2027లో ఎన్నిక‌లు.. వైసీపీ నినాదం!

జ‌మిలి ఎన్నిక‌ల‌పై వైసీపీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. వైసీపీ నాయ‌కులు ప్ర‌తి స‌మావేశంలోనూ 2027లో ఎన్నిక‌లొస్తాయ‌ని చెబుతూ, కేడ‌ర్‌ను స‌మాయ‌త్తం చేస్తున్నారు. వైసీపీ నినాదం…2027లో ఎన్నిక‌లు. ఈ నినాదం వెనుక వైసీపీ భారీ…

జ‌మిలి ఎన్నిక‌ల‌పై వైసీపీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. వైసీపీ నాయ‌కులు ప్ర‌తి స‌మావేశంలోనూ 2027లో ఎన్నిక‌లొస్తాయ‌ని చెబుతూ, కేడ‌ర్‌ను స‌మాయ‌త్తం చేస్తున్నారు. వైసీపీ నినాదం…2027లో ఎన్నిక‌లు. ఈ నినాదం వెనుక వైసీపీ భారీ వ్యూహం వుంది. అధికారం కోల్పోయి, కూట‌మి దాడుల‌తో తీవ్ర నిరాశ‌లో ఉన్న కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో ధైర్యం నింప‌డం. అంతేకాదు, ఎన్నిక‌లు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయంటే కూట‌మి నేత‌ల్లో భ‌యం పుడుతుంది.

దీంతో అధికారంలో త‌క్కువ కాలం వుంటామ‌ని, సంపాద‌న కోసం చేయ‌కూడ‌ని త‌ప్పుల్ని చేస్తార‌నే వైసీపీ అంచ‌నా క‌డుతోంది. కూట‌మి నేత‌లు ఎన్ని త‌ప్పులు చేస్తే, అంత‌గా రాజ‌కీయంగా వైసీపీకి ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు న‌మ్ముతున్నారు. ఒన్ నేష‌న్ -ఒన్ ఎల‌క్ష‌న్ నినాదంతో బీజేపీ అగ్ర‌నేత‌లు ముందుకెళుతున్న సంగ‌తి తెలిసిందే.

ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల ఫ‌లితాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని బీజేపీ జ‌మిలి ఎన్నిల‌కు వెళ్లొచ్చ‌నే ప్ర‌చారం జరుగుతోంది. మ‌హారాష్ట్ర‌లో మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే మాత్రం… ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా బీజేపీ జ‌మిలి ఎన్నిక‌ల‌కు వెళ్తుంద‌ని ఆ పార్టీ ముఖ్య నాయ‌కులు చెబుతున్నారు.

జాతీయ బీజేపీ రాజ‌కీయ పంథాని గ‌మ‌నిస్తే, ప్ర‌తి అడుగు జ‌మిలి ఎన్నిక‌ల ల‌క్ష్యంగా వేస్తున్న‌దే అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇండియా కూట‌మి బ‌ల‌ప‌డ‌క ముందే జ‌మిలి ఎన్నిక‌ల‌కు వెళ్లి, ప్ర‌త్య‌ర్థుల్ని చావ‌దెబ్బ కొట్టాల‌నే వ్యూహం బీజేపీ నేత‌ల్లో క‌నిపిస్తోంది.

ఇదే విష‌యాన్ని ఘోర ప‌రాజ‌యం పాలైన వైసీపీ విస్తృతంగా జ‌నంలోకి తీసుకెళుతోంది. కూట‌మి స‌ర్కార్ ఐదు నెల‌ల కాలంలోనే తీవ్ర ప్ర‌జా వ్య‌తిరేక‌త సంపాదించుకుంద‌ని వైసీపీ బ‌లంగా న‌మ్ముతోంది. ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా త‌మ‌కు అధికారం ఖాయం అని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఇంత‌కాలం జ‌గ‌న్ ఐదేళ్లు ఓపిక ప‌ట్టండి, అధికారం మన సొంత‌మ‌వుతుంద‌ని ఊర‌డిస్తూ వ‌చ్చారు. ఇప్పుడు ఆయ‌న స్వ‌రం మారింది. 2027లో ఎన్నిక‌లొస్తాయ‌ని, అధికారాన్ని తిరిగి సాధిద్దామ‌ని, అంద‌రూ క‌లిసి క‌ట్టుగా ప‌ని చేయాల‌ని జ‌గ‌న్ పిలుపునిస్తున్నారు. అంతేకాదు, ఈ ద‌ఫా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులకు పెద్ద‌పీట వేస్తామ‌ని న‌మ్మ‌బ‌లుకుతున్నారు.

ఒక‌వేళ 2027లో జ‌మిలి ఎన్నిక‌లు రాక‌పోయినా, ఇప్ప‌టి నుంచే శ్రేణుల్ని స‌మాయత్తం చేయ‌డానికి ఈ నినాదం ప‌ని చేస్తుంద‌నే వ్యూహంతో వైసీపీ నేత‌లు ముందుకెళుతున్నారు.

17 Replies to “2027లో ఎన్నిక‌లు.. వైసీపీ నినాదం!”

  1. ఇక్కడ ఎవరు పని లేకుండా లేరు మూసుకొని ఆ వాలంటీర్ ల తో పని చెపించుకొని సిద్ధం సభలు పెట్టుకోండి

    చెట్టనకొడకల్లర రాజకీయ పార్టీ ఇలా నడపాలి teludu రా మీకు

    ముందు అది నేర్చుకోండి మీరు మీ పార్టీ నాయకుల

  2. వైఎస్ఆర్సీపీ లో కార్యకర్తలు అభిమానులు బాధపడింది నాయకులు తిని కనీసం మమ్మలని పట్టించుకోలేదు అని బాధపడ్డారు .

    బాదపడి వేరే పని చేసుకుంటున్నారు .

    2029 లో పక్తూ రాజకీయాలు చేసే కార్యకర్తలు ఉండరు

    కాబట్టి మీ పార్టీ శ్రేయస్సు కోరి నేను చెప్పేది ఏంటి అంటే మంచికో చేడుకో సోషల్ మీడియా నమ్ముకున్నారు కనీసము వాళ్ళకి అన్న ఆర్థికంగా మరియు లీగల్ గా సహాయం చేస్తూ ముందుకు వెళితే అప్పుడు వేరే వాళ్ళు ఏమైనా రావచ్చు అది కూడా గ్యారెంటీ లేదు

  3. నాలుగు నెలలకే అప్పుడే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారము మనదే అని నాయకులు నమ్ముతున్నారా .

    ముందు నియోజకవర్గ సమావేశాలు పెట్టండి

    జిల్లా సమావేశాలు పెట్టండి రాజకీయంగా ఎవరికి అయితే ఇంట్రెస్ట్ ఉందో గ్రౌండ్ లెవెల్ లోకి కనుక్కోండి

    వాళ్ళకి తగిన స్థానము ఇవ్వండి మీరేమి పిఠాపురం జమిందారు పోస్ట్ ఏమీ ఇవ్వలేదు

    కార్యకర్తలకు మైక్ ఇచ్చి చూడండి ఏమీ చెబుతున్నారో వినండి సరిదిద్దుకోండి l

    లేదంటే సర్థుకోండి.

    అయితే కార్యకర్తల్ని మాత్రం డబ్బులు ఖర్చు పెట్టుకోమని అడగకండి అడిగితే G మీద త్తంతారు నాయకులు ఎవడు సంపాదించాడు తెలుసు వాడిని మూసుకొని ఖర్చు పెట్టామని చెప్పండి

  4. నీవన్నీ ఆఫ్టర్ నూన్ dreams GA

    2027 వరుకు వైసీపీ పార్టీ నే ఉండదు ..ఎందుకంటె జగన్ గాడు వాడి పార్టీ AP కె హానికరం

    1. ఇప్పటికీ కూటమి వద్దు అనుకునేవాళ్ళకి అందరికీ జగనే alternative

      కాబట్టి రెండు ఆప్షన్స్ కూటమికి

      ఒకటి చేతనైతే మంచిగా చెయ్యండి

      లేదు అంటే జగన్ నీ లోపల వెయ్యండి అంతే

      ఊరికి సొల్లు వద్దు

Comments are closed.