రెండు సీజ‌న్లు వదులుకున్న తండేల్

గీతా సంస్థ ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు నిర్మించలేదు. అలాంటిది 70 కోట్లకు పైగా బడ్జెట్ తో నాగ్ చైతన్య-సాయి పల్లవి కాంబినేషన్ లో సినిమా భారీగా నిర్మిస్తోంది. ఈ సినిమాకు ముందుగా…

గీతా సంస్థ ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు నిర్మించలేదు. అలాంటిది 70 కోట్లకు పైగా బడ్జెట్ తో నాగ్ చైతన్య-సాయి పల్లవి కాంబినేషన్ లో సినిమా భారీగా నిర్మిస్తోంది. ఈ సినిమాకు ముందుగా అనుకున్న డేట్ క్రిస్మస్. కానీ టైమ్ కు వర్క్ పూర్తి కావడం లేదు. సంక్రాంతి అనుకుంటే పోటీ సినిమాలతో సమస్య వచ్చింది. దాంతో ఇప్పుడు ఫిబ్రవరికి వెళ్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది తప్పని సరి కావచ్చు. కానీ సరైన డేట్ కాదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు

నిజానికి జ‌నవరి లాస్ట్ వీక్ కు, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కు వచ్చి మంచి కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాలు చాలానే వున్నాయి. కానీ ఇదంతా ఓటిటి విజృంభణ కు ముందు. ఇప్పుడు జ‌నాలు చాలా కాలుక్యులేటెడ్ గా సినిమా చూస్తున్నారు. సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్నాయి. అవి ఇంతో అంతో గట్టిగా డబ్బులు లాగేస్తాయి. పైగా నాలుగు వారాల్లో ఓటిటి లోకి వస్తాయి. అంటే ఫిబ్రవరి రెండో వారం నాటికి ఓటిటి లోకి రెడీ అయిపోతాయి.

సంక్రాంతి ఖర్చు తరువాత మళ్లీ థియేటర్ కు పెట్టాలంటే తండేల్ సూపర్ డూపర్ హిట్ అనిపించుకోవాలి. లేదూ అంటే అదే టైమ్ లో ఓటిటి కి వచ్చే సంక్రాంతి సినిమాలు అడ్డం పడతాయి. తండేల్ సినిమా మీద నిర్మాత బన్నీవాస్ చాలా నమ్మకంగా వున్నారు. అందుకే నాగ్ చైతన్య మీద 70 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. థియేటర్ నాన్ థియేటర్ కలిసి అక్కడిక్కడ సరిపోయే పరిస్థితి వుంది. కానీ లాభాలు కావాలంటే మాత్రం సినిమా బాగా అడాల్సి వుంది. మంచి టాక్ రావాల్సి వుంది.

క్రిస్మస్, సంక్రాంతి సీజ‌న్ అయితే ఇంత టెన్షన్ వుండదు. ఫిబ్రవరి కాబట్టే కాస్త టెన్షన్.

3 Replies to “రెండు సీజ‌న్లు వదులుకున్న తండేల్”

Comments are closed.