వైద్య సీట్ల‌పై మంత్రి స‌త్య‌కుమార్‌కు శ్ర‌ద్ధ ఏదీ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వైద్య క‌ళాశాల‌ల్ని తీసుకొచ్చి, సాధ్య‌మైనంత ఎక్కువ మంది విద్యార్థుల‌కు వైద్య విద్య‌ను అందించాల‌న్న శ్ర‌ద్ధ కూట‌మి స‌ర్కార్‌కు లేదు. చివ‌రికి వ‌చ్చిన క‌ళాశాల‌ల‌ను కూడా ప్రారంభించ‌లేని దుస్థితి. పులివెందుల మెడిక‌ల్ క‌ళాశాల‌కు 50…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వైద్య క‌ళాశాల‌ల్ని తీసుకొచ్చి, సాధ్య‌మైనంత ఎక్కువ మంది విద్యార్థుల‌కు వైద్య విద్య‌ను అందించాల‌న్న శ్ర‌ద్ధ కూట‌మి స‌ర్కార్‌కు లేదు. చివ‌రికి వ‌చ్చిన క‌ళాశాల‌ల‌ను కూడా ప్రారంభించ‌లేని దుస్థితి. పులివెందుల మెడిక‌ల్ క‌ళాశాల‌కు 50 సీట్ల‌కు అనుమ‌తి ఇస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది. అయితే తాము నిర్వ‌హించ‌లేమంటూ ఏపీ స‌ర్కార్ కేంద్రానికి లేఖ రాయ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

ఈ నేప‌థ్యంలో అస‌లు పులివెందుల‌కు ఎలా అనుమ‌తి ఇస్తారంటూ వైద్యారోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేయ‌డం వైద్య విద్య చ‌ద‌వాల‌నుకున్న విద్యార్థుల‌ను షాక్‌కు గురి చేసింది. తాజాగా రాష్ట్రంలో మెడిక‌ల్ సీట్ల‌ను పెంపున‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని కేంద్రాన్ని టీడీపీ లోక్‌స‌భ ప‌క్ష నేత లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయలు కోరారు. ప‌ది ల‌క్ష‌ల జ‌నాభాకు 100 మెడిక‌ల్ సీట్ల నిబంధ‌న‌ను స‌వ‌రించాల‌ని కేంద్ర మంత్రి న‌డ్డాకు ఆయ‌న విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

ఇలాంటి ప్ర‌య‌త్న‌మేదో ముందే చేసి వుంటే చాలా మంది విద్యార్థుల‌కు వైద్య విద్య‌ను చ‌దివే అవ‌కాశం వుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వైద్య విద్య‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.

వైద్య విద్య‌పై సంబంధిత మంత్రి స‌త్య‌కుమార్‌కు క‌నీస ఆస‌క్తి కూడా లేద‌ని, త‌న‌కు ప‌ద‌వి వుంటే చాల‌న్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విద్యార్థులు మండిప‌డుతున్నారు.

2 Replies to “వైద్య సీట్ల‌పై మంత్రి స‌త్య‌కుమార్‌కు శ్ర‌ద్ధ ఏదీ?”

Comments are closed.