ట్రంప్‌కు మద్దతుగా అమెరికన్ తెలుగు సమూహం!

అమెరికాలో ఉన్న దాదాపు 25 లక్షల మంది భారతీయులు అమెరికా అధ్యక్షుడి ఎన్నికలో తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు. అమెరికా ఎన్నికల్లో వలసదారుల గళాన్ని వినిపించే క్రమంలో భాగంగా భారతీయ అమెరికన్లు తమ బాధ్యత నిర్వర్తించనున్నారు.…

అమెరికాలో ఉన్న దాదాపు 25 లక్షల మంది భారతీయులు అమెరికా అధ్యక్షుడి ఎన్నికలో తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు. అమెరికా ఎన్నికల్లో వలసదారుల గళాన్ని వినిపించే క్రమంలో భాగంగా భారతీయ అమెరికన్లు తమ బాధ్యత నిర్వర్తించనున్నారు. వీరిలో కొత్త ఓటర్లు ఎటు మొగ్గు చూపబోతున్నారు.. అనేది కూడా కీలకంగా కనిపిస్తోంది. చాలా మంది డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా ఉంటారని భావిస్తున్నప్పటికీ.. మహిళా ఓట్లు వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కు పడే అవకాశం ఉంది.

న్యూజెర్సీలో నివసించే 43 ఏళ్ల ఐటీ కన్సల్టెంటు రమేష్ మెట్టు ఎర్లీ-ఇన్-పర్సన్ విధానంలో తన ఓటు హక్కును పోలింగ్ రోజుకంటె ముందుగానే వినియోగించుకున్నారు. ‘‘ముందుగానే ఓటు వేసేయడం నాకు మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. నాకున్న పనుల ఒత్తిడిలో ఎలక్షన్ రోజు వరకు ఎదురుచూసి, పెద్దపెద్ద క్యూలైన్లలో వేచి ఉండి టైం వేస్టు చేసుకోవడం నాకు ఇష్టంలేదు- అని ఆయన చెబుతున్నారు. ‘ముందుగనే ఓటు వేసేయడం చాలా సులభం కూడా. ఇక్కడ 20 ఏళ్లుగా నివసిస్తున్న వ్యక్తిగా.. ఈ దేశపు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో నా ఓటు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు.

టెక్సాస్ లో నివసిస్తున్న ఇద్దరు పిల్లల తల్లి ప్రసన్న రెడ్డి మాత్రం మెయిల్-ఇన్- పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ బాధ్యతల కారణంగా ఈ పద్ధతి నాకు అత్యుత్తమం అనిపిస్తుంది అని ఆమె చెప్పారు.

చాలా రాష్ట్రాల్లో డ్రాప్ బాక్స్ లు ప్రజాదరణ పొందాయి. పోస్టుద్వారా పంపే మెయిల్ కు ఇవి ప్రత్యామ్నాయం. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో లో నివసించే రియల్టర్ ఎ.భార్గవ దీనిని మంచి పద్ధతిగా అభివర్ణించారు. మా ఇంటికి సమీపంలో ఉన్న డ్రాప్ బాక్స్ వద్దకు వెళ్లి ఓటు వేసేశాను.. ఇది ఎంతో సులువు అని ఆయన చెప్పుకొచ్చారు.

అంతర్జాతీయ శాంతి కోసం పనిచేసే కార్నెగీ ఎండోమెంట్ వారి అధ్యయనంలో భారతీయ మూలాలు కలిగిన 52 లక్షల మంది అమెరికాలో నివసిస్తున్నట్టు తేల్చింది. మెక్సికో తర్వాత ఈ దేశంలో భారతీయ అమెరికన్లు రెండో అతిపెద్ద వలసదారులుగా ఉన్నారని ఈ అధ్యయనం తేలుస్తోంది.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ట్రెజరర్ అశోక్ గల్లా మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు మాట్లాడేవారి ఓటు కూడా కీలకంగా మారనున్నదాని అంటున్నారు. 25.6 లక్షల మంది భారతీయ అమెరికన్లకు ఓటు హక్కు ఉన్నదని, గత నాలుగేళ్ల పాలన పట్ల ఏర్పడిన విపరీతమైన అసంతృప్తితో వీరు ట్రంప్ కు ఓటు వేసేందుకు మొగ్గుతున్నారని ఆయన చెప్పారు.

భారతీయ వ్యాపారలను ప్రోత్సహించేలా ఉన్న అనుకూల విధానాల కారణంగా భారతీయ అమెరికన్లు అత్యధికంగా ట్రంప్ వైపే ఉన్నట్లు తానా అధ్యక్షుడు నిరంజన్ కూడా అంటున్నారు. అదే సమయంలో తెలుగువారిలో మహిళలు మాత్రం.. అబార్షన్ హక్కుల విషయంలో సరళంగా ఉన్నందుకు కమలా హారిస్ కు ఓటు వేసే అవకాశం ఉందని అంటున్నారు.

చికాగోలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, డెంటల్ స్టూడెంట్ తబితా జాయ్ మాట్లాడుతూ.. అబార్షన్ హక్కులకోసం పోరాడేవారికోసం ప్రజలు చూస్తున్నారని వ్యాఖ్యానించడం విశేషం.

12 Replies to “ట్రంప్‌కు మద్దతుగా అమెరికన్ తెలుగు సమూహం!”

  1. ఇప్పటి వరకు ట్రంప్ వస్తాడనే అనిపించింది..మన వాళ్ళు మద్దతు అనగానే ఏదో డౌట్…

  2. Don’t understand the support to Trump from indians living in India. I can understand the NRIs who settled there wanting the immigration curbed, trade sanctions against India and basically being a bully towards India etc. But Indians supporting him is still a mystery. Context: Threatening India with sanctions for banning HCQ exports during COVID-19, recently threatening countries including India of 100% tax if they don’t do business in USD only.

  3. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎవరు గెలిస్తే ఏం అవుతుందో నాకు తెలీదు కానీ కమల హారిస్ గెలిస్తే మాత్రం మస్క్ గాడు దుకాణం సర్దేసి ఖచ్చితంగా మన దేశానికి రావాల్సిందే

    అక్కడ లోకల్ గా అందరినీ బెదిరించి భూమి ఆక్రమించాడు, వీడి అరాచకాలు మామూలుగా లేవు అక్కడ వై చీపి నాయకుల కంటే ఒక్క ఆకు ఎక్కువే చేసాడు .

      1. నీలాంటి పో రం బో కు లకి కళ్ళు మూసుకుపోయి గత పాలనలో జరిగిన అరాచకం కనపడటం లేదు రా . నీకు కూడా జగన్ గాడి వ్యాధి ఉన్నట్లుంది . మందులు వాడు తగ్గిపోద్ది .

Comments are closed.