ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనం (2W) విభాగంలో అగ్రగామి బ్రాండ్ అయిన ప్యూర్ ఈవీ 2025లో గణనీయమైన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ని ప్రారంభించేందుకు ప్రణాళికలను ప్రకటించింది. ఇలా అద్భుతమైన వృద్ధితో ప్రగతిపథంలో కొనసాగుతోంది.
నాట్కో ఫార్మా ఫ్యామిలీ ఆఫీస్, లారస్ ల్యాబ్స్ ఫ్యామిలీ ఆఫీస్, హెచ్ టీ వెంచర్స్, బీసీసీఎల్, యూఈపీఎల్, ఐ-టీఐసీ, ఐఐటీ హైదరాబాద్‌తో సహా ప్రముఖ పెట్టుబడిదారుల మద్దతుతో కంపెనీ బలమైన పెట్టుబడిదారుల పూర్తి నమ్మకాన్ని పొందింది ప్యూర్ ఈవీ. దన్నుగా ఉన్న ఆర్థిక మూలాలతో స్థిరంగా రాణిస్తోంది. గత మూడేళ్లలో నిర్వహణ లాభాలను సాధించింది. FAME సబ్సిడీలపై ఆధారపడకుండా నగదు చెల్లింపులను సజావుగా నిర్వహించింది. 85% వాటాను కలిగి ఉన్న కంపెనీ ప్రమోటర్లు, ఆపరేటింగ్ స్థాయిలో లాభాలను స్థిరంగా పొందుతున్నారు.
అంతర్గత బ్యాటరీ తయారీ, దాని పవర్‌ట్రెయిన్, సాఫ్ట్వేర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్‌తో ప్యూర్ ఈవీ 120 మేధోపరమైన లక్షణాలను పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. సరైన నగదు చెల్లింపులతో ఆర్గానిక్ విక్రయాలను సాగిస్తోంది. ప్రభుత్వ రాయితీలు లేకుండానే కంపెనీ మూడేళ్ల నిర్వహణ లాభాలను సాధించింది. ఇటీవల, ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. వచ్చే ఐదేళ్లలో 100 ఎక్స్ వృద్ధికి సిద్ధంగా ఉన్న సెగ్మెంట్లో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
రాబోయే నాలుగేళ్లల్లో 20 ఎక్స్ టర్నోవర్ వృద్ధి అంచనాలతో ప్యూర్ ఈవీ మాస్ కమ్యూట్ మార్కెట్లో వ్యూహాత్మకంగా స్థానం సొంతం చేసుకుంది. ఐఐటీ హైదరాబాద్‌తో ఇప్పటికే ఉన్న భాగస్వామ్యం, దానికి తోడు యూకే లోని కోవెంట్రీ నుండి ఇంజినీరింగ్ సంస్థ పీడీఎస్ఎల్ తో FY26లో సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించి రాబోయే రోజుల్లో మరిన్ని అద్బుతమైన ఆవిష్కరణలు చేయడానికి సన్నద్ధంగా ఉంది.
2025 భారత్ ఎలక్ట్రానిక్ విప్లవంలో భాగస్వామ్యం కావడం తమకెంతో ఆనందంగా ఉందని ప్యూర్ ఈవీ సీఈవో రోహిత్ వదేరా అన్నారు. నూతన ఆవిష్కరణలు, నైపుణ్యం, స్థిరత్వం పట్ల తమ నిబద్ధత ప్యూర్ ఈవీని అగ్రగామిగా నిలిపిందని తెలిపారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ రవాణా యొక్క భవిష్యత్తు, ప్యూర్ ఈవీనేనని తాము విశ్వసిస్తున్నామన్నారు. తమ వినూత్న AI ఆధారిత సాంకేతికత, పనితీరు, సామర్థ్యంపై దృష్టి సారించడంతో మోటార్‌సైకిల్ విభాగంలో గణనీయమైన వాటాను పొందేందుకు తమకు అనుమతి లభిస్తుందన్నారు. ప్రతిభావంతులైన బృందం, పెట్టుబడిదారుల మద్దతుతో, తాము కేవలం వాహనాలను విక్రయించడం లేదని, తాము తమ కమ్యూనిటీలకు, ఈ సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ప్రస్తుతం ప్యూర్ ఈవీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలో సుమారు 7% మార్కెట్ వాటాను కలిగి ఉందన్నారు. భారతదేశం అంతటా టైర్ 1, టైర్ 2 నగరాల్లో దాని పరిధిని భారీగా విస్తరించాలనే ఆశయంతో ఉందని తెలిపారు. కంపెనీ ఇటీవల ప్రారంభించిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లలో వృద్ధి చెందుతున్న మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇది రాబోయే ఐదేళ్లలో 100 రెట్లు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నామని ఆయన వివరించారు. భారతదేశంలో విక్రయించే ద్వి చక్ర వాహనాలలో 65% వాటా ప్యూర్ ఈవీ మోటార్‌సైకిళ్లదేనన్నారు.
సాంకేతికత అభివృద్ధి చెందడం, బ్యాటరీ ధరలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నందున, ప్యూర్ ఈవీ ఈ ట్రెండ్లను ప్రభావితం చేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందన్నారు. కంపెనీ యొక్క వినూత్న ఆఫర్లు, దూకుడు మార్కెటింగ్, బ్రాండింగ్ వ్యూహంతో కలిపి, దాని డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి సిద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల అమ్మకాలను వేగవంతం చేస్తామన్నారు. రాబోయే నాలుగేళ్లల్లో ప్యూర్ఈవీ 2000 కోట్ల రూపాయల టర్నోవర్‌ను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. టర్నోవర్ పెరగడం వల్ల లాభాలు కూడా గణనీయంగా పెరుగుతాయి అన్నారు.
OLA ELECTRIC MOBILITY LTD issue price @75rs High is :157.40
My advise to retailers you accumulate OLA @ 70 – 75 range for long-term -Target – 450 rs.
OLA ELECTRIC issue price @75rs High is :157.40
My advise to retailers you accumulate OLA @ 70 – 75 range for long-term -Target – 450 rs…
Call boy jobs available 9989793850
vc estanu 9380537747