లక్కీ భాస్కర్.. ఎక్కడ అన్ లక్కీ అయింది?

ఎంత రేటింగ్ లు వచ్చాయి అన్నది కొంత వరకు పాయింట్, జ‌నాలకు ఏది నచ్చింది అన్నది అసలు సిసలు పాయింట్.

యునానిమస్ పాజిటివ్ టాక్. ఎక్కడా ఒక్క నెగిటివ్ ట్రోలింగ్ అన్నది లేదు. దాదాపు అందరూ 3/5 రేటింగ్ లు. సోషల్ మీడియా మొత్తం పాజిటివ్. ఇదంతా ఈవారం వచ్చిన లక్కీ భాస్కర్ సంగతే. కానీ రేస్ లో మాత్రం వెనుక పడింది. మూడు సినిమాల రేస్ లో. కిరణ్ అబ్బవరం…’క’ సినిమా. రెండోది ఇప్పుడు ఎక్కువగా జ‌నం చూస్తున్న మిస్టిక్ సస్పెన్స్ థ్రిల్లర్. కానీ రివ్యూవర్లకు మాత్రం ఎన్నో లోటు పాట్లు కనిపించాయి. చాలా మంది 2.5/5 మించి వేయడానికి సాహసించలేదు. కొందరు మాత్రమే 2.75/5 వేసారు.

సోషల్ మీడియా సినిమా మంచి చెడ్డలు పెద్దగా పట్టించుకోలేదు కానీ, గట్టిగా క సినిమా వెనుక నిలబడిన మాట వాస్తవం. ఇక మూడో సినిమా. క్లాస్ సినిమా, సాయి పల్లవి క్రేజ్‌ కలిసి వచ్చిన అమరన్. సినిమా సూపర్ క్లాసిక్ సినిమా, దేశభక్తి, సాయిపల్లవి నటన పెద్ద ప్లస్. ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ సమీక్షలు వచ్చాయి. అంతా 3/5 రేటింగ్ లు ఇచ్చారు. కానీ సోషల్ మీడియా మరీ వెర్రిగా ఈ సినిమా వెనుక పడిపోలేదు.

ఇక్కడ కొన్ని పాయింట్లు వున్నాయి.

సినిమా హీరోనే పూనుకుని చేసిన విపరీతమైన ప్రచారం, సోషల్ మీడియా దన్ను, సింపతీ, కానీ నెగిటివ్ అండ్ యావరేజ్‌ సమీక్షలు

లక్కీ భాస్కర్.. డీసెంట్ పబ్లిసిటీ. సోషల్ మీడియాలో నో నెగిటివ్.. నో పాజిటివ్.. అలాగే నో సింపతీ. ఫుల్ పాజిటివ్ సమీక్షలు

అమరన్ సినిమా. అల్ మోస్ట్ జీరో పబ్లిసిటీ, పాజిటివ్ సమీక్షలు, సోషల్ మీడియాలో కొద్దిగా స్పందన.

కానీ ఇప్పుడు కలెక్షన్ల పరంగా చూసుకుంటే అమరన్ సినిమా ముందు వరుసలో వుంది. తమిళ నిర్మాత కమల్ హాసన్ ఇక్కడ ఓన్ గా పంపిణీ చేయించుకున్నారు. అందువల్ల లాభం అంతా అన్నీ పోను అయనదే.

క సినిమా 7.20 కోట్లకు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్మారు. ఇప్పుడు మంచి వసూళ్లే వస్తున్నాయి కనుక నిర్మాతకు లాభాలు వుంటాయి.

లక్కీభాస్కర్ రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి 12 నుంచి 13 కోట్లకు విక్రయించారు. నష్టం అయితే లేదు కానీ బయ్యర్లు కమిషన్ చేసుకునే వరకు వుంటుంది అవకాశం.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే

ఎంత పబ్లిసిటీ చేసాము అన్నది పాయింట్ కాదు,

ఎంత రేటింగ్ లు వచ్చాయి అన్నది కొంత వరకు పాయింట్,

జ‌నాలకు ఏది నచ్చింది అన్నది అసలు సిసలు పాయింట్.

అమరన్ కు జీరో పబ్లిసిటీ. కానీ జ‌నాలు విరగబడి చూస్తున్నారు.

క సినిమా జోనర్ నచ్చింది. పబ్లిసిటీ పీక్స్ లో జ‌రిగింది.. సింపతీ వర్కవుట్ అయింది. జ‌నం చూస్తున్నారు

లక్కీ భాస్కర్ కు ఓ మాదిరి పబ్లిసిటీ, మీడియాకు నచ్చింది. కానీ జ‌నాలకు ధర్డ్ ఛాయిస్ అయిపోయింది.

మరి లక్కీ భాస్కర్ కనుక సోలోగా వచ్చి వుంటే…? లేదా లక్కీ భాస్కర్ లాంటి కాన్సెప్ట్ కు, క లాంటి థ్రిల్లర్ పోటీ తగలకుండా వుండి వుంటే.. లేదా లక్కీ భాస్కర్.. అమరన్ అనే రెండు క్లాస్ సినిమాలు ఒకేసారి పోటీ పడకుండా వుండి వుంటే.. లక్కీ భాస్కర్ లక్ వేరుగా వుండేదేమో?

35 Replies to “లక్కీ భాస్కర్.. ఎక్కడ అన్ లక్కీ అయింది?”

  1. నువ్వు క కు తక్కువ ఇచ్చావు కాబట్టి కవరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు

  2. మీలాంటి దిక్కుమాలిన రివ్యూయర్స్ పోగ పెట్టకపోతే అంత బాగానే నడుస్తుంది!!!

Comments are closed.