మరోసారి బెదిరింపులు.. ఈసారి రూ.5 కోట్లు

వారంలో వరుసగా రెండోసారి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. మొదటిసారి బెదిరింపులు వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన దుండగులు, ఈసారి ఏకంగా 5 కోట్ల రూపాయలు…

వారంలో వరుసగా రెండోసారి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. మొదటిసారి బెదిరింపులు వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన దుండగులు, ఈసారి ఏకంగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. అంతేకాదు, మరో ఆప్షన్ కూడా ఇచ్చారు.

ప్రాణాలతో ఉండాలంటే 5 కోట్ల రూపాయలు చెల్లించాలని, లేదంటే ఏదైనా దేవాలయానికి వెళ్లి క్షమాపణలు చెప్పాలని బెదిరింపు కాల్ వచ్చింది. గతంలో వచ్చినట్టుగానే ఈసారి కూడా ముంబయి ట్రాఫిక్ పోలీసు కంట్రోల్ రూమ్ కు ఈ బెదిరింపులతో కూడిన వాట్సాప్ సందేశం వచ్చింది.

గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ కు ప్రాణహాని ఉందనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఓసారి సల్మాన్ ఇంటిపైకి గ్యాంగ్ సభ్యులు కాల్పులు జరిపారు. ఆ కేసు ఓవైపు నడుస్తుండగానే, సల్మాన్ కు సన్నిహితంగా ఉంటున్నాడనే కారణంతో బాబా సిద్ధిఖీని హత్య చేశారు.

ఇప్పుడు మరోసారి సల్మాన్ కు వార్నింగ్ ఇచ్చింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హైదరాబాద్ లో ఉన్నాడు. ఫలక్ నుమా ప్యాలెస్ లో అతడి కొత్త సినిమా షూటింగ్ జరుగుతోంది. భారీ భద్రత మధ్య ఈ షూటింగ్ కొనసాగుతోంది.

గతంలో, బాలీవుడ్ సినిమా ‘హమ్ సాథ్ సాథ్ హై’ షూటింగ్ సమయంలో రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ప్రమేయం ఉందంటూ, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చంపేస్తామంటూ సల్మాన్ ను బెదిరిస్తోంది.

8 Replies to “మరోసారి బెదిరింపులు.. ఈసారి రూ.5 కోట్లు”

      1. క్షమాపణ కోరాలంటే ఇగో అడ్డు రావొచ్చు.. అదే సల్మాన్ కి ఐదు కోట్లు లెక్క కాదు

    1. మన పప్పెష్ … గాడు… వైజాగ్ ఎయిర్పోర్ట్ లోదిగినప్పుడంతా 2014 నుండి 2019 లో స్నాక్స్ తిన్న ఖర్చు కంటే తక్కువే.. ఇచ్చేయచ్చు.

Comments are closed.