రాజ‌గురువు ప‌త్రిక‌కు ఎన్ని క‌ష్టాలో!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి ప్ర‌భుత్వం అధికారం చెలాయిస్తోంది. అయితే రాజ‌గురువు ప‌త్రిక క‌ష్టాలు అన్నీఇన్నీ కావు. కోరి మ‌రీ తెచ్చుకున్న ప్ర‌భుత్వం కావ‌డం వ‌ల్లే చంద్ర‌బాబు రాజ‌గురువు ప‌త్రిక‌కు కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. కూట‌మి…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి ప్ర‌భుత్వం అధికారం చెలాయిస్తోంది. అయితే రాజ‌గురువు ప‌త్రిక క‌ష్టాలు అన్నీఇన్నీ కావు. కోరి మ‌రీ తెచ్చుకున్న ప్ర‌భుత్వం కావ‌డం వ‌ల్లే చంద్ర‌బాబు రాజ‌గురువు ప‌త్రిక‌కు కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. కూట‌మి ప్ర‌భుత్వంపై ఏ మాత్రం ప్ర‌జా వ్య‌తిరేక‌త క‌నిపించ‌కుండా చేయాల‌నే య‌జ్ఞంలో రాజ‌గురువు ప‌త్రిక నానా ఇబ్బందులు ప‌డుతోంది.

చంద్ర‌బాబు ఎంత‌గానో అభిమానించే, భ‌గ‌వ‌ద్గీత‌గా ఆరాధించే ఆ ప‌త్రిక నిత్యం కూట‌మి స‌ర్కార్ గొప్ప‌త‌నాన్ని చాటి చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ, దాన్ని మూసిపెట్టేందుకు ఆ ప‌త్రిక స‌ర్క‌స్ ఫీట్స్ చేయాల్సి వ‌స్తోంది. తాను కూత కూయ‌నిదే లోకం నిద్ర‌లేవ‌ద‌నే భ్ర‌మ‌లో ఆ మీడియా ఉన్న సంగ‌తి తెలిసిందే.

అందుకే పాఠ‌కులు, ప్ర‌జ‌లు ఏమ‌న్నా అనుకోని, తాను మాత్రం ఇట్లే క‌థ‌నాలు రాస్తాన‌నే రీతిలో ఆ ప‌త్రిక వ్య‌వ‌హ‌రిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు ఈ రోజు ఆ ప‌త్రిక‌లో వార్త‌ల్ని ప‌రిశీలిద్దాం. పిఠాపురంలో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిన్నారులు, మ‌హిళ‌ల‌పై అత్యాచారాల్ని అరిక‌ట్ట‌క‌పోవ‌డంపై ప‌వ‌న్ సీరియ‌స్ అయ్యారు. ఇన్ని దారుణాలు సాగుతున్నా అనిత చ‌ల‌నం లేకుండా, బాధ్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ఇలాగైతే తాను హోంశాఖ మంత్రిత్వ బాధ్య‌త‌ల్ని తీసుకోవాల్సి వుంటుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ స‌మాచారాన్ని రాజ‌గురువు ప‌త్రిక ఎలా రాసిందో తెలుసుకుందాం.

“నేర‌గాళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకోలేని పోలీసులెందుకు?” అనే శీర్షిక‌తో ప్ర‌చురించారు. అనిత‌కు, ప్ర‌భుత్వానికి ఏ మాత్రం దెబ్బ త‌గ‌ల‌కూడ‌ద‌నే రాజ‌గురువు ప‌త్రిక అక్ష‌ర విన్యాసం న‌వ్వి తెప్పిస్తోంది. తాను నిజాలు రాయ‌క‌పోతే, జ‌నానికి తెలియ‌ద‌నుకుంటే త‌ప్ప ఇట్లా రాసే అవ‌కాశ‌మే వుండ‌దు. పాఠ‌కులు, ప్ర‌జ‌ల‌పై రాజ‌గురువు ప‌త్రిక‌కు ఏ మాత్రం గౌర‌వం వుందో మ‌రో క‌థ‌నం గురించి తెలుసుకుందాం.

గ‌త నెల‌లో ఇంధ‌న స‌ర్దుపోటు చార్జీలంటూ విద్యుత్ వినియోగదారుల‌పై గ‌త నెల‌లో ప్ర‌భుత్వం దాదాపు రూ.7 వేల కోట్ల భారాన్ని వేసింది. వ‌చ్చే నెల నుంచి ఈ భారాన్ని ప్ర‌జ‌లు మోయాల్సి వుంటుంది. దీన్నే భ‌రించ‌లేమ‌ని జ‌నం అల్లాడుతుంటే, ఇది చాల‌ద‌న్న‌ట్టు మ‌రో రూ.11,826.15 కోట్టు భారం వేయ‌డానికి సిద్ధ‌మైంది. ప్ర‌జ‌ల‌కు షాక్ ఇచ్చే ఈ స‌మాచారాన్ని రాజ‌గురువు ప‌త్రిక లోప‌ల 13వ పేజీలో ప్ర‌చురించ‌డం గ‌మ‌నార్హం. అది కూడా వైకాపా ప్ర‌భుత్వ పాపం…పొంచి వుంది మ‌రో భారం అనే శీర్షిక‌తో క‌థ‌నాన్ని అచ్చోశారు.

ప్ర‌జ‌ల‌కు న‌ష్టం క‌లిగించే స‌మాచారాన్ని మాత్రం క‌నిపించీ క‌నిపించ‌కుండా చేయ‌డ‌మే రాజ‌గురువు ప‌త్రిక ఎజెండా. ఇదే వైసీపీకి న‌ష్టం క‌లిగించేదైతే మాత్రం ఫ‌స్ట్ పేజీలో ప్ర‌చురిస్తారు. ఈ రోజు ప‌త్రిక‌లోనే మొద‌టి పేజీలో “వైకాపా బాదుడుకు ఉప‌శ‌మనం” అనే శీర్షిక క‌నిపిస్తుంది. ధాన్యం కొనుగోళ్ల‌పై మార్కెట్ రుసుం స‌గానికి త‌గ్గించారంటూ స‌మాచారం ఇచ్చారు.

ఇలా రాజ‌గురువు ప‌త్రిక త‌మ ఆరాధ్య ప్ర‌భుత్వ దారుణ త‌ప్పుల్ని క‌ప్పి పుచ్చుకోడానికి ఎన్నెన్నో ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇలా ఎన్నైనా చెప్పొచ్చు. ప‌రిశీల‌నాస‌క్తి వుండాలే గానీ, రాజ‌గురువు ప‌త్రిక దుర్మార్గాల‌ను తెలుసుకోవ‌డం పెద్ద ప‌నేమీ కాదు.

15 Replies to “రాజ‌గురువు ప‌త్రిక‌కు ఎన్ని క‌ష్టాలో!”

  1. కమ్మ మాఫియా మీడియా రెండూ తెలుగు రాష్ట్రాలని నాశనము చేస్తున్నాయి.బొల్లోడు వాడి దత్త పుత్రుడు కోసం

  2. రాష్రం లొ ఒక లక్షా 60 వెల కొట్ల Arcelor Mittal పెట్తుబడుల గురించి నువ్వు, సాక్షి రాసారా? గుండె మీద చెయ్యి వెసుకొని చెప్పు!!

    .

    అలానె షర్మిల, విజయమ్మ జగన్ గురించి చెప్పింది రాసారా? మీ రాతల ద్వారా కెవలం దాని మీద ఎదురుడానె చెసారు కదా?

  3. రాష్రం లొ ఒక ల.-.క్షా 60 వెల కొట్ల Arcelor Mittal పెట్తుబడుల గురించి నువ్వు, సాక్షి రాసారా? గుండె మీద చెయ్యి వెసుకొని చెప్పు!!

    .

    అలానె షర్మిల, విజయమ్మ జగన్ గురించి చెప్పింది రాసారా? మీ రాతల ద్వారా కెవలం దాని మీద ఎదురుడానె చెసారు కదా

  4. రాష్రం లొ ఒక ల.-.క్షా 60 వెల కొట్ల Arcelor Mittal పెట్తుబడుల గురించి నువ్వు, సాక్షి రాసారా? గుండె మీద చెయ్యి వెసుకొని చెప్పు!!

    .

    అలానె షర్మిల, వి.-.జ.-.య.-.మ్మ జగన్ గురించి చెప్పింది రాసారా? మీ రాతల ద్వారా కెవలం దాని మీద ఎదురుడానె చెసారు కదా

  5. ఎమి ఇబ్బంది పడుతోంది GA?
    ప్రజలు మార్చిపోతున్నా, ప్రతి రోజు రాక్షస పాలనలో అలా జరిగింది ఇలా జరిగింది అని గుర్తు చేసి
    కుటమి పాలన గురించి చెప్తున్నారు..ఇందులోఇబ్బంది ఏమి ఉంది
  6. పోయిన వాళ్ళని కూడా వొదలవా బానిస కట్టప్ప ? ఈనాడులో రాసినదానికి రామోజీ మీద పడి ఇంకా ఏడుస్తుంటే మరి సచ్చి లో రాసినవి భారతికి ఆపదీస్తావా ?

    -అని పలువురు సామాజిక నెటిజన్లు వెంకీని నిజం $%^&.. తిడుతున్నారట.
  7. మంది సొమ్ము అప్పనంగా దోచుకున్నప్పుడే తప్పు రా పురుగులు పట్టి పోతాము అని చెప్పుంటే ఇవాళ ఆ దోచుకున్న సొమ్ము పంచుకోడానికి ఇలా రోడ్ల మీద పడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా %#’విజయమ్మ గారు..

Comments are closed.