టీడీపీ లోకి గ్రంధి: బ్రేక్ పడుతుందా?

తనను ఓడించిన గ్రంధి శ్రీనివాస్ తెలుగుదేశంలో చేరడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని ఒక వాదన ఉంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరుతారు అనే వదంతులు నాలుగైదు వారాలుగా ముమ్మరంగా సర్కులేట్ అవుతున్నాయి. తాజాగా ఆయన నివాసం మీద ఐటీ దాడులు జరిగాయి. ఆయన నివాసం, కార్యాలయాల మీద ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన ఏదైనా ఆర్థిక నేరాలకు పాల్పడినట్లుగా తేలితే.. తెలుగుదేశంలో చేరడం అనే ప్రక్రియ వాయిదా పడడం కానీ, రద్దు కావడం కానీ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గ్రంధి శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఓడించిన జైంట్ కిల్లర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2024ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటినుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తో ఆంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని, తెలుగుదేశం లో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

ఇక ముహూర్తం ప్రకటించడం ఒక్కటే తరువాయి.. మంతనాలు మొత్తం పూర్తయ్యాయి.. అని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఐటీ దాడులు జరిగాయి.

తనను ఓడించిన గ్రంధి శ్రీనివాస్ తెలుగుదేశంలో చేరడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని ఒక వాదన ఉంది. ఐటీ దాడుల వెనుక పవన్ హస్తం ఉండవచ్చునని కూడా కొందరు అనుమానిస్తున్నారు. ఆర్థిక నేరగాడు గా తేలితే.. గ్రంధిని చంద్రబాబు తన పార్టీలో చేర్చుకోకబోవచ్చునని అనుకుంటున్నారు. పవన్ కోరుకుంటున్నది కూడా అదే అనే వాదన ఉంది.

11 Replies to “టీడీపీ లోకి గ్రంధి: బ్రేక్ పడుతుందా?”

  1. అసభ్యకర వ్యాఖ్యలు, విద్వేషాన్ని నిలిపేద్దాం: సామాజిక మాధ్యమాల్లో గౌరవాన్ని పునఃస్థాపించుకుందాం

    ఇతరుల తల్లులు, చెల్లెమ్మల గురించి అసభ్యకర భాష వినియోగించడం తీవ్రంగా తప్పు, దీన్ని తక్షణం ఆపాలి. ఈ విధమైన ప్రవర్తన వ్యక్తులను మాత్రమే కాదు, మొత్తం సామాజిక మాధ్యమాల వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. ఇటీవల, వైసీపీ అనుచరుడు వర్రా రవీంద్ర రెడ్డి ఇతర ప్రముఖులు, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మంత్రి వంగలపూడి అనిత, షర్మిల, వై.ఎస్. విజయలక్ష్మి వంటి వారి గురించి అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు పోలీసుల అదుపులోకి వచ్చాడు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సమీప అనుచరుడైన ఇతని చర్యలు, కొన్ని వైసీపీ అనుచరులు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తున్న అసభ్యకరమైన పోస్టుల నైజాన్ని వెలుగులోకి తెచ్చాయి.

    గత ఐదేళ్లుగా వైసీపీ పాలనలో, ప్రతిపక్ష నాయకులపై అసభ్యకరమైన, పరుషమైన విమర్శలు విపరీతంగా పెరిగాయి, కొంతమంది వైసీపీ అనుచరులు మర్యాద రేకలు దాటుతున్నారు. సామాజిక మాధ్యమాలు వ్యక్తిగత దూషణల కోసం కాదు; ఇవి గౌరవప్రదమైన చర్చలకు వేదికగా ఉండాలి. రాజకీయ అభిప్రాయాలు ఎలా ఉన్నా, ప్రతి ఒక్కరికి గౌరవం అవసరం. కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగడం, కామెంట్ చేయడం, మాట్లాడేవారికి మర్యాదను తగ్గిస్తుంది.

    అసభ్యకర భాష వినియోగించడం, కుల విద్వేషం వ్యాప్తి చేయడం వల్ల ఏమీ సాధ్యం కాదు. ఇవి మనలను విభజిస్తాయి, హానికర వాతావరణం సృష్టిస్తాయి, మరియు నిజమైన వ్యక్తులను కష్టంలో పడేస్తాయి. సామాజిక మాధ్యమాలు మన మధ్య అనుసంధానానికి వేదికగా ఉండాలి, విద్వేషం, విభజనలకు కాదు.

    మీ గౌరవం మరియు ఆత్మగౌరవం, ఎవరైనా నాయకుడికి ఉన్న కూలంకషమైన అనురక్తి కంటే ఎంతో విలువైనవి. నాయకులు మారతారు, కానీ మనం వ్యాపింపజేసిన ద్వేషం వల్ల కలిగే దుష్ఫలితాలు అనేక కాలం పాటు ఉండిపోతాయి. నిజమైన శక్తి గౌరవం మరియు దయలో ఉంది, రాజకీయాలు లేదా కులం మీద ఆధారపడి మర్యాద లేకుండా మాట్లాడడంలో కాదు.

    అందరూ, ముఖ్యంగా వైసీపీ అనుచరులు, గౌరవప్రదమైన, మర్యాదపూర్వక భాషను ఉపయోగించడానికి కట్టుబడి ఉండాలి. ఈ అసభ్య ప్రవర్తనను నిలిపి, మన ఇంటరాక్షన్లలో మర్యాదను పునఃస్థాపించుకుందాం. సామాజిక మాధ్యమాలు మనం ఉన్న గొప్పతనాన్ని ప్రతిబింబించాలి, అసభ్యకరమైన భాషకు వేదిక కావద్దు. ఈ మార్పు మన ప్రతి ఒక్కరిలో ఉంది — నిజమైన సమస్యలపై దృష్టి పెట్టి, ప్రతి వ్యక్తిని గౌరవించి, మనస్పూర్తిగా సమాజ నిర్మాణం చేస్తూ, పరస్పర అవగాహనను పెంపొందిద్దాం.

  2. అసభ్యకర భాష, విద్వేషం నిలిపి గౌరవాన్ని పునరుద్ధరించండి:

    ఇతరుల తల్లులు, చెల్లెమ్మల గురించి అసభ్యకరంగా మాట్లాడడం, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం తక్షణం ఆపాలి. ఇటీవలి కాలంలో కొన్ని వైసీపీ అనుచరులు సామాజిక మాధ్యమాల్లో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. ఈ విధమైన ప్రవర్తన మన సమాజాన్ని విభజిస్తుంది, ఆవరణాన్ని కలుషితం చేస్తుంది.

    సామాజిక మాధ్యమాలు గౌరవప్రదమైన చర్చలకు వేదికగా ఉండాలి, వ్యక్తిగత దూషణలకు కాదు. నిజమైన శక్తి గౌరవం, దయలో ఉంది, ద్వేషంలో కాదు. వైసీపీ అనుచరులు సహా అందరూ మర్యాదగా మాట్లాడటానికి కట్టుబడి ఉండాలి. అసభ్య ప్రవర్తనను వీడి, ప్రతి వ్యక్తికి గౌరవం ఇచ్చే సమాజాన్ని నిర్మిద్దాం.

    1. ఇతరుల భార్యల సంగతి?

      కేవలం తల్లి చెల్లి అంటున్నారంటే మీరు త్రాసు కి ఎటువైపు వున్నారో అర్థం అవుతుంది..

      మీ ప్రయత్నానికి అభినందనాలు !

      1. తల్లయినా, చెల్లైనా, భార్యైనా స్తీలను గౌరవించడం మన సాంప్రదాయం. ఎవరి గురించి ఎవరూ వ్యక్తిగతంగా కించపరిచే విమర్శలు చేయడం అనవసరం.

  3. 2019 లో పోటీ చేసి ఓడించినంత మాత్రాన అసహించు కుంటాడా, ఐటీ రైడ్ చేస్తాడా, all false న్యూస్

Comments are closed.