పంచాయతీ ఎన్నికలు.. టీడీపీ అప్పులు

పంచాయతీ ఎన్నికల ఉరుము ఉరిమి టీడీపీ జిల్లా నేతలపై పడ్డాయి. చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని చోట్లా పోటీకి దింపడానికి అభ్యర్థుల వెంట పడిన టీడీపీ నేతలు, చివరికి వారి నామినేషన్ ఫీజు,…

పంచాయతీ ఎన్నికల ఉరుము ఉరిమి టీడీపీ జిల్లా నేతలపై పడ్డాయి. చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని చోట్లా పోటీకి దింపడానికి అభ్యర్థుల వెంట పడిన టీడీపీ నేతలు, చివరికి వారి నామినేషన్ ఫీజు, ఇంటి పన్ను బకాయిలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు.

అధికార పార్టీ తరపున పోటీ అంటే అందరూ ముందుకొస్తారు. ప్రస్తుతం ఏపీలో కూడా అలాంటి కాంపిటీషనే నెలకొని ఉంది. ప్రతిపక్షం విషయానికొస్తే టీడీపీ చచ్చిన పాము కావడంతో ఎవరూ పోటీకి ముందుకు రావడంలేదు. అభ్యర్థులే లేరు బాబోయ్ అంటుంటే.. ఎలాగోలా పోటీ పెట్టండి, ఏకగ్రీవం కావడానికి వీల్లేదంటూ చంద్రబాబు హుకుం జారీ చేశారు.

వైసీపీకి ఎక్కువ ఏకగ్రీవాలయ్యే నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిపెడతామని, అక్కడి టీడీపీ ఇన్ చార్జ్ ల పై వేటు తప్పదని బాబు ఆల్రెడీ హెచ్చరికలు పంపించారు. దీంతో జిల్లా స్థాయి నేతలు తలలు పట్టుకున్నారు. గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు, వారి నామినేషన్ పై సంతకాలు పెట్టే మరో ఇద్దరికి ఇంటి పన్ను బకాయిలు తామే చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఇక నామినేషన్ రోజున అయ్యే ఖర్చు కూడా భరిస్తేనే బరిలో దిగుతామంటూ టీడీపీ అభ్యర్థులు జిల్లా నాయకత్వానికి తేల్చి చెబుతున్నారట. దీంతో చేసేదేం లేక చాలా చోట్ల వారికి చదివింపులు ఇచ్చుకుంటున్నారట టీడీపీ నేతలు. మరికొన్ని చోట్ల ఖర్చు జిల్లా నాయకత్వం పెట్టుకున్నప్పటికీ.. పోటీ చేసి, పరువు పోగొట్టుకోమని గ్రామస్థాయి నాయకులు మొహం మీదే చెబుతున్నారు.

మొత్తమ్మీద పంతాలకుపోతున్న చంద్రబాబు తమకు ఇబ్బందులు తెస్తున్నారని, తమ జేబులు ఖాళీ చేయిస్తున్నారని టీడీపీ నేతలు లోలోపల మధనపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయి రెండేళ్లు కాలేదు, అప్పుడే పంచాయతీ ఎన్నికలంటే పెద్ద తలకాయల దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులు కూడా లేవు.

అధికార పార్టీ అంటే నోటి మాటతో అన్ని పనులూ పూర్తవుతాయి. అదే ప్రతిపక్ష నేతలంటే మాత్రం ఎవరూ కేర్ చేయడంలేదు. అందులోనూ టీడీపీ అంటే అస్సలు లెక్కే చేయడంలేదు. 

ఈ దశలో గ్రామస్థాయి నేతలు తమ మాట వినడంలేదని చెప్పుకోవడం ఇజ్జత్ కా సవాల్ కావడంతో అప్పుచేసి మరీ వారికి ఆర్థిక సాయం చేయడానికి సిద్ధపడుతున్నారు టీడీపీ నేతలు. తమ ఇబ్బందులు ఎన్ని ఉన్నా, అధినేత ప్రాపకం కోసం, స్థానికంగా పరువు నిలుపుకోవడం కోసం కష్టపడుతున్నారు. 

మనకి బూతులు జనాలకు కాదు

చంద్రబాబు వచ్చే వరకూ టీవీల్లో మాట్లాడిన పట్టాభి..