చాగంటి.. కేబినెట్ ర్యాంకు ఉంటే తప్ప తీసుకోరా?

అప్పట్లో తన మీద రాజకీయ ముద్ర పడకూడదని చాగంటి జగన్ ఆఫర్ తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు ఆఫర్ ను కూడా తిరస్కరిస్తారా?

రాష్ట్రంలోని ప్రముఖ ప్రవచన కర్తల్లో చాగంటి కోటేశ్వరరావు కూడా ఒకరు. ఆయన ప్రవచనాలు సనాతనధర్మం పేరుతో ఛాందసత్వానికి కాస్త దగ్గరగా ఉంటాయనే విమర్శ కూడా ఉంది. కానీ అలవిమాలిన పాండిత్యం, ఆధ్యాత్మిక నిష్ట ఉన్న ప్రవచన కర్తగా ఆయనకు గుర్తింపు ఉంది. అలాంటి చాగంటి కోటేశ్వరరావు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నైతిక విలువల సలహాదారుగా నియమితులవడం పట్ల సర్వత్రా ఆయన అభిమాన, భక్త సమాజంలో ఆనందం వెల్లువెత్తుతోంది.

అయితే తాజాగా చంద్రబాబునాయుడు ప్రకటించిన కేబినెట్ పదవుల జాబితాలో చాగంటి పేరు ఉండడం పట్ల కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఐహికమైన వాంఛలకు, అహంకారాది అరిషడ్వర్గాలకు అతీతంగా ఉండవలసిన ప్రవచనకర్త చాగంటి.. కేబినెట్ ర్యాంకు ఉంటే తప్ప పదవిని తీసుకోదలచుకోలేదా? అని కొందరు విమర్శిస్తున్నారు.

చాగంటి కోటేశ్వరరావును తెలుగుదేశం ప్రభుత్వ నైతిక విలువల సలహాదారుగా కేబినెట్ ర్యాంకుతో నియమించింది. స్టూటెంట్ ఎథిక్స్ అండ్ వేల్యూస్ అనే కేటగిరీ కేటాయించారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా నామినేటెడ్ పదవుల్లో ఆయనకు పెద్దపీట వేసింది. అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానాల వారికి ధర్మప్రచార పరిషత్ సలహాదారుగా నియమించారు. జగన్ ఎంపికతో ఈ మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది.

ధర్మప్రచార పరిషత్ అనేది టీటీడీలో ఒక విభాగం. ఇవాళ ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడుతానని పవన్ కల్యాణ్ అంటున్నారో.. అలాంటి సనాతన ధర్మానికి ప్రజా బాహుళ్యంలో ప్రచారం కల్పించడానికి పాటుపడుతుంది. ధర్మాన్ని రక్షించే దిశగా ఆ పదవి చాలా గొప్పది. కాకపోతే ఆ పదవికి కేబినెట్ ర్యాంకు లేదు.

జగన్ సర్కారు ఆ పదవిని కట్టబెడితే చాగంటి కోటేశ్వరరావు దానిని తిరస్కరించారు. వెంకటేశ్వరస్వామి తన ఊపిరి అని, తన అవసరం టీటీడీకి ఉన్నప్పుడు ఎప్పటికీ ముందుంటానని.. అందుకు తనకు పదవి అక్కర్లేదని ఆయన అప్పట్లో సెలవిచ్చారు.

అలాంటిది విద్యార్థులకు నైతిక విలువలు ప్రబోధించడానికి మాత్రం ఆయనకు రాష్ట్ర సలహాదారు పదవి అవసరం ఏముంది. విద్యార్థులకు ఆ విలువలు చెప్పడం, నైతిక విలువలను ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం ఆయన పదవిలేకపోయినా కూడా చేయగలరు కదా.. అనే చర్చ జరగుతోంది.

అప్పట్లో తన మీద రాజకీయ ముద్ర పడకూడదని చాగంటి జగన్ ఆఫర్ తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు ఆఫర్ ను కూడా తిరస్కరిస్తారా? లేదా, కేబినెట్ ర్యాంకు ఉన్నది గనుక.. ఎంచక్కా ఎంజాయ్ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. చాగంటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

41 Replies to “చాగంటి.. కేబినెట్ ర్యాంకు ఉంటే తప్ప తీసుకోరా?”

  1. జగన్ రెడ్డి లాంటి నీచుడు, నికృష్టుడు, హంతకుడికి.. దూరం గా ఉండాలని అనుకున్నాడేమో.. అనే పాయింట్ నీ దృష్టిలో పడలేదా..?

    జగన్ రెడ్డి బురద అంటించుకున్న కొందరు సాములోర్ల పరిస్థితి ఇప్పుడు ఏమిటో.. కనపడుతోందిగా..

    అలాంటి కుక్కబతుకు వద్దని ముందుగానే భావించి.. జగన్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ ని తిరస్కరించాడేమో.. అనే అనుమానం నీకు కలగలేదా..?

    1. Hi EJAY, I have some questions. I am not supporter of anyone but having individual thinking.

      1. I think you are Kamma, are you not?
      2. you said that you worked in US before, am I right?
      3. Did you invest in Amaravathi before Jagan came into power?
      4. Did you work for Kamma boss or company in US?
      5. Are you a Paytm guy or born and brought up as a caste maniac?
      6. Is CBN a saint. Did he created all his wealth in legal means?
      7. is he not biased?
      8. what is your opinion about the Telugu associations in US like Tana, Ata, Nats, Nata and others? Are they not caste biased?

      I can ask many questions but we know no use because you are a caste maniac and looks like a Paytm guy. Give respect to others. Simply don’t antagonize other who are having different ideology.

      My disclaimer is that I am neither Reddy nor YCP nor Jagan follower. I hate Jagan because he tried to devide the society by saying that my SC, my ST and my BC. His goal was to be in power forever so he throw navarathnlu biscuits.

  2. కుళ్లుబోతు GA….ఇక్కడ POINT CABINET హోదా గురించి కాదు…CREDIBILITY గురించి…..మీలాంటి వాళ్ళతో కలిసి పనిచేయడం ప్రమాదం అని భయపడ్డాడేమో….ఐనా దానికి ఇప్పుడు విషం కక్కడం ఎందుకు GA కడుపు మంట కాకపోతే……😂😂

  3. ఒరేయ్ గూట్లే…ఆయన ప్రవచన కర్త కన్నా ముందు ఉపాద్యాయులు.అందుకే విద్యార్థుల తో అనుబంధంగాల పదవి. ఇక కాబినెట్ ర్యాంక్, ఆయన వయసుకి, ఎక్స్పీరియన్స్ కి తగ్గట్టుగా

    1. అయన ఉపాధ్యాయ వృత్తి కాదు అనుకుంటా సార్! ఏదో సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో పని చేసి రిటైర్ అయ్యారు అని చదివినట్టు గుర్తు

  4. ఇక్కడ విషయం ఏంటంటే, పదవికి కాబినెట్ హోదా వుందా లేదా అని కాదు. ఎవరితో associate అవ్వాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనేదానిగురించి ఆయనకి ఒక అవగాహన ఉంటుంది కదా. నీ బుర్ర సరిగ్గా పనిచేసి వుంటే, ఆ విషయం అర్థమయ్యి వుండేది.

  5. ఈ స్వాములు.. సన్యాసులు.. బాబాలు.. ప్రవచనకారులు.. వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ.. ఎవరి గోల తొ వారు ముందుకు వస్తారు.. ధర్మ పరిరక్షణ కన్నా ధర్మ విస్తరణ ముఖ్యం.. అందుకు టీటీడీ గట్టిగా నడుం బిగించాలి…

  6. ధుర్యోధనుడి దగ్గరకు వెళ్లిన కర్ణుడు ఎంత గొప్పవాడైనా నాశనం అయిపోయాడు.

    మహా భారతం చెప్పే చాగంటి వారికి ఇది తెలియదా?

    అందుకే గత ప్రభుత్వంలో పదవి స్వీకరించి ఉండరు.

      1. రావణుడి పక్క ఉన్న విభీషణుడు చిరంజీవి అయ్యాడు. లంకను ఏలాడు.

        ధుర్యోధనుడు సాక్షాత్తు కలిపురుషుడి అవతారం.

        ప్యాలెస్ పులకేశి సాక్షాత్తు కలిపురుషుడి కలియుగ అవతారం.

  7. ఆయన ఈ పదవి కూడా వద్దు అనే అంటాడు అనుకుంటున్న… తీసుకుంటే కచ్చితంగా ప్రజలు ఆయనను తప్పు పడతారు.. ఎందుకంటే ప్రజలకు పక్కోడిని విమర్శించడం తప్ప ఏం పనిలేదు…

  8. చర్చ కాదు బొక్కా కాదు. జగన్ ఇస్తే వొద్దన్నోడు చంబా ఇస్తే తీసుకుంటున్నాడు అని వాడి కట్టప్ప వెంకాయమ్మ రోదిస్తోంది

  9. congratulations Changanti Garu🙏 మీ కీర్తి కిరీటం లో ఈ పదవి జస్ట్ చిన్న పూస, మీరు ఆ బాధ్యత స్వీకరించి ప్రస్తుత సమాజంలో గణనీయ మార్పు తీసుకొని రావాలని / రాగలరని ప్రజలందరి కోరిక !! GA, చాగంటి గారి ద్వారా అయినా నువ్వు నీ బాస్ మరియు blue మంద మంచిగా మారి జనజీవన స్రవంతి లో కలుస్తారని ఆశిస్తున్నాం!! great decision CBN గారు!! 👏👏👏

  10. ఒకపక్క మన అన్న చుట్టూ దరిద్రులు అని రాస్తూ …ఇంకో పక్క ఆయన ఆఫర్ చేసిన పదవి తీసుకోలేదు అని ఏడుపు ఎందుకు

  11. చాగంటి వారి మీద వ్యతిరేక వార్త రాసావంటే..నీ జన్మ ధన్యం అయిపోయింది రా…

  12. ప్రియ రంగనాథ్ గారికి,

    జీవితం అనేది వ్యర్థమైన రాజకీయాల కోసం పోరాడటానికి కాదు. మీరు జగన్ మోహన్ రెడ్డిని నిజాయితీ గల వ్యక్తిగా భావిస్తూ, ఆయన తప్పులపై కళ్ళు మూసుకుంటున్నారు. కానీ రంగనాథ్ గారు, నిజమైన సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మన కళ్ళు తెరవాలి. ఒక నాయకుడికి సంబంధించి మీ భావనలు, ఆరాధన స్థాయికి చేరడం మీ నిజాయితీని మసకబార్చనివ్వకండి.

    మీరు మీకు మీరు నిజాయితీగా ఉండాలి, రంగనాథ్ గారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం మన హక్కు, కానీ ఈ హక్కును ఇతరుల తల్లుల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేందుకు ఉపయోగించకూడదు. మీరు గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి, కానీ ఇతరుల తల్లులపై మీరు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు వినడానికి సిగ్గుగా ఉంది. మీ వ్యాఖ్యల గురించి మీరు సిగ్గుపడాలి.

    ఇది ఎక్కడికి తీసుకువెళుతోందో ఒకసారి ఆలోచించండి. ప్రతి ప్రార్థన సమయంలో, మీ అసభ్యకర వ్యాఖ్యల గురించి మనసులో ఆలోచించండి, ఎందుకంటే ఇలాగే కొనసాగితే, మీ ఆరోగ్యానికి హానీ కలగొచ్చు. ఈ విధంగా ఇతర కులాలపై, ముఖ్యంగా కాపు మరియు కమ్మ కులాలపై ద్వేషాన్ని పెంచుకోవడం అనేది మీ మనస్సుకు, హృదయానికి హాని కలిగిస్తుంది.

    ఇలాంటి అప్రజాస్వామ్య తత్వాన్ని ఆపండి, రంగనాథ్ గారు. ఈ నిరాధార ద్వేషాన్ని, అసభ్యకర వ్యాఖ్యలను ఆపండి.

    1. బుర్ర తక్కువ సన్నాసి పదవి కోసం అతను పరుగు పెట్టలేదు…పదవే వెతుక్కుంటూ వచ్చింది….భూమికి భారమే నువ్వు

  13. అప్పటి గొ బి దగ్గర పనిచెయ్యటం ఇష్టం లేదేమో..అది ఆయనిష్టం కదా ఎంకటి..

  14. ఆయన కేబినెట్ ర్యాంక్ విషయమై కాదనిన్నీ…. క్రైస్తవుడు నడిపించే ప్రభుత్వంలో పదవి తీసుకుంటే తన క్రెడిబులిటీ కి దెబ్బ అనిన్నీ అప్పట్లో తిరస్కరించి అంటారు అని సామాన్య జనం అనుకుంటున్నారు.

  15. చాంగటి గారిని కూడా రాజకీయల కొసం విమసిస్తె జనం చెప్పుతొ కొడతారు!

    సొంత కర్చులతొ ప్రవచనాలు చెప్పె చాగంటి గారు, కెవలం క్యాబినెట్ పొస్ట్ చూసె పదవి తీసుకొరు అన్న విషయం మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు!

    .

    ఎవరు పదవి ఇస్తె చెరాలి అన్నది అయన ఇష్టం! నీ నీచపు రాతలతొ వారిని మలినం చెయకు GA!!

Comments are closed.