భ‌విష్య‌త్‌లో ఏ యిజం వుండదంటున్న చంద్ర‌బాబు

భ‌విష్య‌త్‌లో ఏ యిజం వుండ‌ద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అన్నారు. కేవ‌లం టూరిజం మాత్ర‌మే వుంటుంద‌ని ఆయ‌న అన్నారు. విజ‌య‌వాడ‌లోని ప్ర‌కాశం బ్యారేజీలో పున్న‌మీ ఘాట్‌లో సీ ప్లేన్ ప‌ర్యాట‌కాన్ని చంద్ర‌బాబు శ‌నివారం ప్రారంభించారు. ఈ…

భ‌విష్య‌త్‌లో ఏ యిజం వుండ‌ద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అన్నారు. కేవ‌లం టూరిజం మాత్ర‌మే వుంటుంద‌ని ఆయ‌న అన్నారు. విజ‌య‌వాడ‌లోని ప్ర‌కాశం బ్యారేజీలో పున్న‌మీ ఘాట్‌లో సీ ప్లేన్ ప‌ర్యాట‌కాన్ని చంద్ర‌బాబు శ‌నివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మ‌న రాష్ట్రానికి టూరిజం ఒక వ‌రం అన్నారు.

తాను మొత్తం నాలుగు సార్లు సీఎం ప‌ద‌వి చేప‌ట్టిన‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. ఇప్పుడు మాదిరిగా గ‌తంలో తాను క‌ష్ట‌ప‌డ‌లేద‌ని ఆయ‌న అన్నారు. విధ్వంసం చేసిన వ్య‌వ‌స్థ‌ను చ‌క్క‌దిద్ద‌డానికి తాను ఎక్కువ క‌ష్ట‌ప‌డుతున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. వెంటిలేట‌ర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజ‌న్ అందిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. రాష్ట్రాన్ని మ‌ళ్లీ నంబ‌ర్ ఒన్‌గా నిల‌బెట్టే వ‌ర‌కూ అవిశ్రాంతంగా ప‌ని చేస్తాన‌న్నారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడిపై చంద్ర‌బాబు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. త‌క్కువ స‌మ‌యంలోనే అత్యున్న‌త స్థాయికి ఎదిగిన నాయ‌కుడు రామ్మోహ‌న్‌నాయుడు అని బాబు అన్నారు. భ‌విష్య‌త్ అంతా ప‌ర్యాట‌కందే అని బాబు అన్నారు. భ‌విష్య‌త్‌లో ఏ యిజం వుండ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

గ‌తంలో కూడా చంద్ర‌బాబు ఇవే కామెంట్స్ చేశారు. క‌మ్యూనిజం, సోష‌లిజం లేవ‌ని, ఉండేద‌ల్లా టూరిజ‌మే అని చాలా ఏళ్ల క్రితం చంద్ర‌బాబు చేసిన కామెంట్స్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. చంద్ర‌బాబు పెట్టుబ‌డీదారుల‌కు కొమ్ము కాస్తుండ‌డం వ‌ల్లే ఆయ‌న‌కు క‌మ్యూనిజం, సోష‌లిజం లాంటివి న‌చ్చ‌వ‌ని నాడు ప్ర‌జాసంఘాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేశాయి. ఇప్పుడు మ‌ళ్లీ చంద్ర‌బాబు అదే పాట పాడారు.

19 Replies to “భ‌విష్య‌త్‌లో ఏ యిజం వుండదంటున్న చంద్ర‌బాబు”

  1. ఆయన అన్నట్లుగానే రాష్ట్రం లో కమ్యూనిజం కనుమరుగైంది. దేశం లో కూడా ఒకటి రెండు చోట్ల తప్ప పెద్దగా ప్రభావం లేదు

    1. హమ్మయ్య.. ఫ్యాక్షనిజం ఉండదన్నమాట.. బెంగుళూరు కి తరిమేశాం శాశ్వతం గా..

      మళ్ళీ ఆంధ్ర కి వస్తే.. పాతి పెట్టేద్దాం..

  2. How can we believe these guys? One earned lakhs of crores and shiponed money to foreign countries by earning from two acres, how it possible, the other earned crores of rupees after his father fallen in debt trap. Whatever they are saying is only to be in power. The other guy only question when it is beneficial to him. Do we have different body structures being Reddy, Kapu, Kamma or other castes? Are we different species by being in different castes? Ultimately common man like us are loosing and giving power to the unscrupulous people. All the media and social media channels are biased and only to help themselves. God save us.

  3. ప్రియ రంగనాథ్ గారికి,

    జీవితం అనేది వ్యర్థమైన రాజకీయాల కోసం పోరాడటానికి కాదు. మీరు జగన్ మోహన్ రెడ్డిని అద్భుతంగా నిజాయితీ గల వ్యక్తిగా భావించి, ఆయన తప్పులపై కళ్ళు మూసుకుంటున్నారు. కానీ రంగనాథ్ గారు, నిజమైన సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మన కళ్ళు తెరవాలి. ఒక నాయకుడికి సంబంధించిన మీ భావనలు ఆరాధనగా మారి మీ నిజాయితీని మసకబారనివ్వకండి.

    మీకు మీరు నిజాయితీగా ఉండాలి, రంగనాథ్ గారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం మన హక్కు, కానీ ఈ హక్కును ఇతరుల తల్లుల పట్ల అసభ్యకరమైన మాటలు మాట్లాడటానికి, వారి గౌరవాన్ని కించపరిచే విధంగా ఉపయోగించకూడదు. మీరు ఎంతో గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి, కానీ మీ తల్లుల మీద వేసే అసభ్య వ్యాఖ్యలు వింటూ ఉండటం చాలా దురదృష్టకరం. మీరు నిజంగా గౌరవం కలిగిన వ్యక్తి అయితే, ఈ రీతిగా మాట్లాడరు.

    మీ ప్రార్థనలు చేసే ప్రతి సందర్భంలో మీ కృత్యాలపై ఆలోచించండి, ఎందుకంటే ఈ ద్వేష భావం, ఈ అసహనం మీ హృదయానికి నష్టం చేస్తుంది. ఇతర కులాలపై మీకున్న ద్వేషం మీ ఆరోగ్యానికి భారం అవుతోంది. కాపు మరియు కమ్మ కులాలపై ఈ ద్వేషాన్ని వదలండి, ఇది మీకు మంచి చేస్తుంది.

    ఈ ద్వేషాన్ని ఆపండి, రంగనాథ్ గారు.

  4. గొ బిడ్డల్లారా..మాట భద్రం..

    రోడీయిజం, ఫ్యాక్షనిజం, సైకోయిజం, కడపిజం, పులివెందులిజం ఇక బంద్..

    1. Who is pappu? The guy who got more majority than psycho from a tough seat is he?

      the guy who motivated the party by doing padayatra with out even getting mic?

      the guy working so hard to get industries and employment to the state?

      the guy created ripples in cheapest with red book?

Comments are closed.