విజయనగరం ఎమ్మెల్సీకి వైసీపీదే నామినేషన్… కూటమి నుంచి నో

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని స్థానిక సంస్థల కోటా నుంచి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో సోమవారం నామినేషన్ స్వీకరణ ఘట్టం ముగిసింది. అయితే ఆ సమయానికి వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన…

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని స్థానిక సంస్థల కోటా నుంచి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో సోమవారం నామినేషన్ స్వీకరణ ఘట్టం ముగిసింది. అయితే ఆ సమయానికి వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు మాత్రమే రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇద్దరు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. టీడీపీ కూటమి నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడం విశేషం.

పైగా నామినేషన్ దాఖలుకి గడువు సోమవారం మూడు గంటలతో ముగుస్తుంది అనగా ఆఖరు రోజున ఇద్దరు ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మొత్తం మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎస్ సేతు మాధవన్ వెల్లడించారు. అలాగే అదే ఎస్ కోట మండలం వసి గ్రామానికి చెందిన కారుకొండ వెంకటరావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని అధికారులు వివరించారు

ఈ నేపథ్యంలో నామినేషన్ పత్రాల స్కూటినీ మంగళవారం జరుగుతుందని అధికారులు వివరించారు. ఇండిపెండెంట్ అభ్యర్ధులు విత్ డ్రా చేసుకుంటే ఈ ఉప ఎన్నికల్లో శంబంగి గెలుపు ఏకగ్రీవం అవుతుందని అంటున్నారు. అలా కాకుండా ఉంటే ఈ నెల 28న పోలింగ్ జరుగుతుంది. మెజారిటీ ఓటర్లు తమకే ఉండడం కూటమి నుంచి పోటీ లేకపోవడంతో వైసీపీదే గెలుపు అని ఆ పార్టీ భావిస్తోంది

ఇవన్నీ ఇలా ఉంటే ఇందుకూరి రఘురాజు మీద అనర్హతను హైకోర్టు రద్దు చేసిందని ప్రకటన వచ్చింది. ఆ విషయంలో ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. అయితే ఒక వైపు ఎన్నికల ప్రక్రియ అయితే సాగిపోతోంది. నామినేషన్ల స్కూటినీ అనంతరం అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తే ఇక పోలింగ్ కి పదిహేను రోజులే సమయం ఉంటుందని అంటున్నారు.

2 Replies to “విజయనగరం ఎమ్మెల్సీకి వైసీపీదే నామినేషన్… కూటమి నుంచి నో”

Comments are closed.