నాట్ కరెక్ట్.. జగన్!

‘శాసనసభకు వెళ్లాలా లేదా’ అని నిర్ణయించుకోవడం జగన్మోహన్ రెడ్డి సొంత వ్యవహారం కాదు.

‘శాసనసభకు వెళ్లాలా లేదా’ అని నిర్ణయించుకోవడం జగన్మోహన్ రెడ్డి సొంత వ్యవహారం కాదు. ఆయనను నమ్మి గెలిపించిన పులివెందుల నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన జవాబుదారీతనం వహించాలి. తాను సభకు వెళ్లకూడదని అనుకుంటే- ఆ విషయం తన పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పడం కాదు- ఆ విషయాన్ని తన నియోజకవర్గ ప్రజలకు చెప్పుకోవాలి.

జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ కుటుంబం పట్ల అనల్పమైన ప్రజాదరణ అక్కడ ఉండే నేపథ్యంలో ఆయన ఏం చేస్తే అది సబబు అని వాళ్ళు అనుకోవచ్చు గాక! కానీ మిగిలిన పదిమంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? జగన్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు మేం అసెంబ్లీకి వెళ్లం- అని పుంగనూరు ప్రజలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాని, పాడేరు ప్రజలకు మత్స్యరస విశ్వేశ్వర రాజు గాని ఎలా నచ్చ చెప్పుకోగలరు? సాధ్యమా?

జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ప్రజలు క్షమించినంత సులువుగా పది నియోజకవర్గాల ఎమ్మెల్యేలను అక్కడి ప్రజలు క్షమించడం కుదురుతుందా? జగన్ ప్రతిపక్ష నేత హోదా సంగతి హైకోర్టు ద్వారా తేలే వరకు వాళ్ళందరూ కూడా శాసనసభకు వెళ్లకుండా గైర్హాజరయితే ప్రజలలో పలుచన అవుతారు కదా అనేది పార్టీ ఆలోచించాలి.

‘40 శాతం ఓట్లు పొందిన పార్టీ నాయకుడికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరా?’ అని జగన్ ప్రశ్నిస్తున్నారు. ఆయన వాదన కరెక్టే అనుకున్నప్పటికీ అందుకు నిరసనగా ఆయన గైర్హాజరు కావాలి. తనతో పాటు పదిమంది ఎమ్మెల్యేలు కూడా వెళ్లకుండా నియంత్రించడం ఎందుకు? ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ పది మందికి సభలో మాట్లాడడానికి ఇచ్చే మైకు, ఇచ్చే సమయం లో మార్పు ఉండదు కదా!

మార్పు వచ్చేది కేవలం జగన్ కు మాత్రమే కదా! అలాంటప్పుడు వారెందుకు గైర్హాజరు కావాలి.. అనేది ప్రజల వాదన! అదే సమయంలో శాసనమండలిలో మాత్రం తమ పార్టీ ఎమ్మెల్సీలను సభకు వెళ్ళమని జగన్ సూచించారు. అక్కడొక నీతి ఇక్కడొక నీతి పాటించడం ఎమ్మెల్యేలకు పరువు తక్కువ కాదా? అని కూడా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో సభకు వెళ్లకపోవడం నియోజకవర్గంలో ఇబ్బంది అవుతుందని కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించినప్పటికీ జగన్ అసహనంతో ఆ మాటలను తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. జగన్ తన నిర్ణయం పై పునరాలోచన చేయవలసిన అవసరం ఉంది. ప్రతిపక్ష నేత హోదా కావాలనుకుంటే గనుక సభలో ఉండి దానికోసం పోరాడడం అవసరం. అంతే సభకు దూరంగా ఉంటే ఎలా? ప్రతిరోజూ సభలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అనే పకార్డును చూపిస్తూ నిరసనను తెలియజేయవచ్చు.

రాష్ట్ర విభజన సమయంలో గానీ ‘విభజన వద్దు’ అనే పకార్డులతోనూ.. ఆ తర్వాత ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే’ ప్లకార్డులతోనూ పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే తరహా సానుకూల ధోరణి గల నిరసనలను తెలియజేసిన సంగతి జగన్ కు తెలియనిది కాదు. తను నిరసన తెలియజేయడం కోసం తన పదిమంది అనుచర ఎమ్మెల్యేల రాజకీయ జీవితాలను పణంగా పెట్టడం విజ్ఞత గల పని కాదు. ఈ విషయం సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకుడు కచ్చితంగా గ్రహించాలి.

74 Replies to “నాట్ కరెక్ట్.. జగన్!”

  1. వీళ్ళకి దొరికినట్టు నాకు కూడా ఏదైనా వంక దొరికితే బాగుండును. నేను కూడా హ్యాపీ గా ఇంట్లో కూర్చుని జీతం తీసుకునేవాడిని.

    ప్రజాధనం అంటే లోకువ ఐపోయింది ఒక్కొక్కరికీ.

  2. అక్కడ ముక్కోడు , ఇక్కడ జగన్ రెడ్డి పరువు పోయి మొహం చెల్లక బెంగళూరు పాలస్ లో కుట్రలు పన్నుతున్నోడిని నీ మాటలతో జీ నుండి శిరస్సు వరకు దిగేలా మేకులు ఎందుకు కొడుతున్నావు GA??

  3. ఇంకా నయం, సి*ఎం పోస్ట్ వారస*త్వం గా తన పిల్ల*లకి, మన*వళ్ళుకి రిజర్వ్ చేసి పెట్టాలి ( ఎన్నిక లేకుండా) అని అంటాడు ఏమో ఈ తి*క్కల వాడు.

  4. సాక్షి, భారతి సిమెంట్ లాంటి కంపెనీలో ఆఫీసు కూ వెళ్లకుండా వుంటే జీతం ఇస్తారా, వాళ్ళ ఉద్యోగులకు?

    లేదా ఉద్యోగ పీకి పరేస్తారా?

    అలాగే ఆరోగ్య ప్రకృతి విపత్తు అనివార్య కారణాలు మినహాయించి, వుద్దేశ్యం పూర్వకంగా ఆఫిస్ కి వెళ్లకుండా వుంటే ఎలాగ ఐతే ఉద్యోగం తీస్స్తారో, అలాగే ఎంఎల్ఏ లు కూడా కావాలి అని అసెంబ్లీ శేషన్స్ కి 90 రోజులు పైగా హాజరు కాకపోతే ఆ ఎంఎల్ఏ పదవి కూడా తీసెయ్యాలి.

    1. వాడికి కావాల్సింది జీతం కాదు.. ప్రతిపక్ష హోదా..

      ప్రతిపక్ష హోదా వస్తే.. అసెంబ్లీ లో ముందు వరస లో సీట్ కేటాయిస్తారు.. సభ సంప్రదాయాల్లో ప్రతిపక్ష నాయకుడికి గౌరవం ఉంటుంది.. గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తుంది.. మెయిన్ గేట్ నుండి ఎంట్రన్స్ లభిస్తుంది.. పార్కింగ్ అసెంబ్లీ ఎంట్రన్స్ కి దగ్గరలో ఉంటుంది..

      ఆ హోదా లేకపోవడం వల్ల ..

      అసెంబ్లీ లో సీట్ లాస్ట్ లైన్ లో ఒక మూలన పడేస్తారు..

      మాట్లాడే సమయం ఇవ్వరు.. మైక్ కట్ చేసేస్తారు..

      అందరిలా అసెంబ్లీ కి బ్యాక్ డోర్ నుండి రావాలి..

      పార్కింగ్ కూడా చివర్లో ఎక్కడో ఇస్తారు.. నడుచుకుంటూ రావాలి.. లోపల కి వచ్చాక ఈయన గారి మంది మార్బలం ఉండరు.. అంటే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళాలి..

      ఇవన్నీ వాడికి అవమానాలు.. జగన్ రెడ్డి లాంటి వాళ్లకి ఈ హంగులే శ్వాస జీవనం.. కూడా..

      1. మరో కోణం: మిస్ అవుతున్న పాయింట్, జగన్ కు ప్రజల మీద కోపం గెలిపించలేదని. సో ఎందుకు ప్రజల కోసం సమస్యల మీద అసెంబ్లీ లో పోరాడాలని కావొచ్చు.

  5. గ్రేట్ ఆంద్ర వెంకట్ రెడ్డి గారు, ఇక్కడ మీ వెబ్సైట్ లో జగన్ కి ఇన్ని నీతులు చెప్పే బదులు,

    అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లి ప్యాలస్ లో నేరుగా జగన్ నీ కలిసి అతని ముఖం మీదనే నేరుగా చెప్పవచ్చు కదా, ఈ బోధనలు. కుదిరితే ఆ మీటింగ్ లైవ్ లో ప్రసారం చేయండి.

    ఏంది,డబ్బు కట్టకుండా అపాయింట్మెంట్ ఇవ్వడా? మీకు కూడా!

    1. డబ్బులు కట్టినా కూడా జగన్ అపాయింట్మెంట్ దొరకదు GA గారికి. అందుకే అప్పుడప్పుడు సజ్జలని తిడుతూ ఇలా పార్థాయ ప్రతిబోధితాం అని రాస్తుంటారు

  6. జగన్ ను “ప్రత్యేక హోదా” కావాలా..?

    ఎందుకు..? ఏమి చేసుకొంటాడు..? ప్రత్యేక హోదా అంటే అసెంబ్లీ లో స్పీకర్ పక్కన చైర్ వేసి కూర్చోబెట్టాలా..?

    మీరేంటో.. మీ విధానాలేంటో..

    23 లో 5 లాగేస్తే.. చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతుంది అని విర్రవీగిన రోజులు గుర్తున్నాయా.?

    మరి ఈ రోజు.. వచ్చిన బొంగులో 11 సీట్లకు.. “ప్రత్యేక హోదా” కావాలా మీకు..

    ఇంకా నయం.. జగన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టగానే..

    స్పీకర్ లేచి నిల్చోవాలి.. హారతులు పట్టాలి.. పూల స్వాగతం పలకాలి.. యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల నాట్య గాన భజన ఏర్పాట్లు చేయాలి.. అని కోరుకొనేలా ఉన్నారు..

    ఈ బొంగులో 11 సీట్లకు.. మీ గొంతెమ్మ కోరికలు..

    1. మీ వ్యాఖ్యానాలు జగన్ చదవడు కాబట్టి బతికిపోయాడు, లేకపోతె మీ ర్యాగింగ్ కి వినాశం విడిచిన చెడ్డి తన తల కి చుట్టుకుని ఇజ్రాయెల్ యాత్రకి వెళ్లి అక్కడే సన్నాసుల్లో కలిస్పోయేవాడు..

  7. పడే పదే వాడిని అసెంబ్లీ కి రమ్మని ఎందుకు అడుగుతున్నారో అర్ధం కావటం లేదు..చూడబోతే ఏదో అనర్హత వేటు యవ్వారం లా వుంది. పేర్మనెంట్ గా..ఒక సారి clauses చెక్చేసుకోండి రా మూర్ర్ఖాస్.

  8. అసెంబ్లీ కి వస్తే తొక్కి నార తీసి తోముతారని భయం..

    ఈ మాత్రానికి సింహం సింగల్ గా అని ఇతన్ని..

    .

    పులి బిడ్డనిరా అని రెడ్డి గారి అమ్మాయి..

    .

    ఎంతో వెళ్లందరో జంతువులకే పుట్టినట్టు ఎవరు అడక్కపోయినా వాళ్లే చెప్పటం..

  9. నో……డౌట్….‌‌నేను…..నేనేంటి …..అనే అహం తప్ప ఇంకేం కనపఢంలెదు జగన్ లొ……

      1. బాబు అటెండ్ అయిన అసెంబ్లీ సెషన్స్ ఎన్నో చెప్పు.

        ప్రతిసారి అవమానాన్ని ఎదుర్కొన్నారు.

      2. చంద్రబాబు కి అవమానం జరిగింది.. వెళ్లనన్నాడు .. కానీ అంతకుముందు రెండున్నరేళ్లు వెళ్ళాడు.. అసలు వెళ్లకుండా మానలేదు..

        అవమానం జరిగాక కూడా.. టీడీపీ లో మిగిలిన 17 మంది వెళ్లారు..

        ఇప్పుడు కూడా జగన్ రెడ్డి పర్సనల్ కారణాలతో వెళ్లకుండా మానేయొచ్చు.. కానీ వైసీపీ లో మిగిలిన 10 మందిని కూడా పంపకుండా ఉండటం తప్పు..

        ఇది అహంకారం..

        మీరు జగన్ రెడ్డి భజన లో ఏ మాత్రం తక్కువ చేయకుండా కష్టపడండి .. తప్పు లేదు..

        కానీ భజన కి కూడా ఒక కారణం ఉండాలి.. అతను చేసే తప్పుల్ని కూడా భజన లో శృతి కలిపేస్తే అసహ్యం గా ఉంటుంది..

  10. బాగా భయపడ్డాడు !! ఈయన కి మళ్లీ పులివెందుల పులి, సింగల్ సింహం అని బిరుదులు కూడా!! waste/worst ఫెలో!!

  11. ఒకసారి వెళ్తేనే ఆర్ ఆర్ ఆర్ వెళ్లి భుజం మీద చెయ్యి వేసి చెవిలో అమ్మనా బూతులు తిట్టాడు(ట)..

    .

    మళ్లీ వెళ్తే షింగిల్ షింహం షీటు చిరిగిపోతుందని ఆయన భయపడుతుంటే నువ్వు ఊరుకో ఎంకటి..

  12. ఒకసారి వెళ్తేనే ఆర్ఆర్ఆర్ వెళ్లి భుజం మీద చెయ్యి వేసి చెవిలో అమ్మనా @-#బూతులు తిట్టాడు(ట)..

    .

    మళ్లీ వెళ్తే షింగిల్ షింహం షీటు చిరిగిపోతుందని ఆయన భయపడుతుంటే నువ్వు ఊరుకో ఎంకటి..

      1. మహా మేత అయితే మొత్తానికే పోయాడు..పోయాడు అనే పదం దానికి కరెక్ట్

    1. అయితే పులివెందుల ప్రజలు అన్న మొహం చూడాలని లేదు అనడం గ్యారంటీ

  13. అసెంబ్లీ కి వెళ్తే అక్కడ R*RR అనే 6 అడు*గుల మగాడు

    4 అడుగుల పొ*ట్టి ప్యా*లస్ పు*లకేశి బుజం మీద రెండు చే*తులు వేసి, నే*రుగా క*ళ్ళలో క*ళ్ళు పెట్టీ చూ*సి కళ్ళ*తోనే కడు*పు చేస్తాడు అని భయం.

    అలా వచ్చిన 9నె*లల గ*ర్భం తో అసెం*బ్లీ కి వస్తె బాగా వుం*డదు కదా. అందు*కే ఈ సా కు చెప్పి R*RR బా*వ క*ళ్ళ లో పడ*కుండా తప్పిం*చుకుతున్నాడు.

    నా*టీ ఫె*లో.

  14. వీడు ప్రభుత్వం లో వున్నప్పుడే ఆఫీసు కి వెళ్లకుండా ఆ*ఫీసు సె*ట్టింగ్ ఇం*ట్లో వేసు*కుని జ*ల్సా చేసిన బ*ద్దకం గాడు.

    చదువు టైమ్ లో కూడా స్కూల్ కి కూడా వెళ్లే వాడు కాదు. వాళ్ళ నాన్న పరపతి తో స్కూల్ వాళ్లు పాస్ చేసారు, స్కూల్ కి వెళ్లకపోయినా సరే. అది సొంత విషయం.

    కానీ ఎంఎల్ఏ పదవి పబ్లిక్ విషయం కదా. వెళ్ళని అంటే కుదరదు బెప్పం.

    సాక్షి, భారతి సిమెంట్, సందొర్ పవార్ ఇలా సొంత వ్యాపారాల్లో నీ ఇష్టం . నీ వ్యాపారం ఆఫీసు కి వెళ్ళిన వెళ్లకపోయినా సరే.

  15. “జగన్ కు ప్రత్యేక హోదా ఇచ్చేవరకు మేం అసెంబ్లీకి వెళ్లం”

    ఆంద్రకు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం హోదా ఇవ్వాలా?

  16. 40 percent votes vaste opposition leader ivvalantav Mari vodina MLA ku one lach votes vatchayi a padavi invali athaniki sudeerga rajakeeya jeevithama adi already close

  17. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ అన్నప్పుడే మన పాలన గురించి అందరికి తెలిసిపోయింది. 
    ఇప్పుడు ఎన్నికలు వస్తే 11 కాదు కదా 4 కూడా రావు
    1. పవన్ గారిని తాకనియ్యం అన్నారు… ఇప్పుడు వీళ్ళు తాకడానికి భయపడుతున్నారు.

        1. వీరి మద్దతుతో వారు… వారి మద్దతుతో వీరు… పరస్పర గౌరవంతో అసెంబ్లీ లో ఉన్నారు. జనం మద్దతు కూడా కోల్పోయి మనం.అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా భయపడి … కుంటి సాకుల తో అసెంబ్లీ బయట ఉన్నాం

        2. ఒ రే య్ కు క్క …… దే శ ము లో ని త న పా ర్టీ ని 100 % గె లి పిం చి న చ రి త్ర ,* ప వ న్ క ళ్యా ణ్ ది * .. ఆ. సం గ తి. దే శ మూ లో

          అ న్ని. న్యూ స్ ఛా న ల్. వ చ్చిం ది. చూ డ లే దా…

          గూ ట్లే

  18. ఇంత ఫ్యూడల్ ఆలోచనలు వున్న వాడికి ఇంకా సపోర్ట్ చేస్తున్న వాడి కాళ్ళ దగ్గర బానిస బతుకే గొప్ప అనే వాళ్ళని మెట్టే తో కొట్టాలి. కదా, గ్రేట్ ఆంధ్ర.

  19. జగన్ కి కేవలం అధికారం సిఎం పోస్ట్ లు మాత్రమే కావాలి. ప్రతిపక్షం లో ఉండే ఓపిక లేదు. మరి 2029 లో ఓడిపోతే ఈ మనిషి తట్టు కోలేదు. చూద్దాం

  20. ఇదిగో బాబాయ్! CBN చెప్పేవి అన్నీ అబద్ధాలే అవ్వచ్చు గాక! అవి అబద్ధాలు అని రేపు రుజువు కూడా కావచ్చు గాక! అయినా నేను నీకు ఓటు వెయ్యను. నువ్వు రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయ్యి ఊరుకోలేదు. డిస్క్వాలిఫై కూడా ఐపోయావు.

Comments are closed.