ఎమ్మెల్యేకు తెలిసిన సంగతి చంద్రబాబుకు తెలియదా?

చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన నిర్ణయాలు తెచ్చిన జీవోలు వీటన్నింటి మీద విస్తృతంగా రంధ్రాన్వేషణ చేస్తున్నారు. జగన్ నిర్ణయాల్లో ఏ లోపం గమనించినా సరే దాన్ని పట్టుకుని…

చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన నిర్ణయాలు తెచ్చిన జీవోలు వీటన్నింటి మీద విస్తృతంగా రంధ్రాన్వేషణ చేస్తున్నారు. జగన్ నిర్ణయాల్లో ఏ లోపం గమనించినా సరే దాన్ని పట్టుకుని ‘గత ప్రభుత్వం’ మీద బురద చల్లాలనే ఉత్సాహంతో ఉన్నారు. కానీ.. చాలా కీలకమైన ఒక విషయంలో జగన్ నిర్ణయం ఇప్పటిదాకా చంద్రబాబుకు తెలియనే తెలియదా? అని ఆశ్చర్యం కలుగుతోంది.

ఒక సాధారణ బిజెపి ఎమ్మెల్యేకు తెలిసిన సంగతి.. పదుల సంఖ్యలో అధికార్లను పాత ప్రభుత్వ నిర్ణయాలు పరిశోధించడానికి పురమాయించిన సీఎం చంద్రబాబునాయుడుకు తెలియకపోవడం శోచనీయం కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇంతకూ విషయం ఏంటంటే.. విశాఖపట్నంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ విషయంలో శాసనసభలో సుదీర్ఘ చర్చ జరపాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. స్పీకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిఎసి సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ఆ ప్యాలెస్ ను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నివాసంగా వినియోగించుకునేందుకు గత ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది.. ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా? అని సీఎం చంద్రబాబును విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. అయితే అప్పటికి చంద్రబాబుకు ఆ సంగతి తెలియదు. అలాంటిదేమీ లేనట్లుందే అని చంద్రబాబు అన్నారు. దాంతో ‘వారు రహస్యంగా జారీ చేసిన జీవోల్లో ఇది కూడా ఒకటి. చాలా శోధించిన తర్వాత నాకు దొరికింది.

గత ఏడాది నవంబర్ 22న జీవో ఆర్టీ 2282 లో ఈ ప్రస్తావన ఉంది. సుమారు ఒకటిన్నర లక్షల చదరపు అడుగుల నిర్మాణం ఉంటుందని అందులో పేర్కొన్నారు. ఆ భవనంలో ఫర్నిచర్ ఏర్పాటు కోసం గత ఏడాది డిసెంబర్లో మరొక జీవో కూడా ఇచ్చారు- అని విష్ణుకుమార్ రాజు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి తెలిపారు.

ఒక సాధారణ ఎమ్మెల్యే తన సొంత పరిశోధన శక్తి, ఆసక్తితో తెలుసుకున్న విషయం ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుకి తెలియదా? పాత ప్రభుత్వం తీసుకువచ్చిన అన్ని జీవోలను కూలంకషంగా పరిశీలించి వాటిలో లోపాలను వెలికితీయడంపై అధికారులను పురమాయించిన చంద్రబాబు రుషికొండ ప్యాలెస్ ను ముఖ్యమంత్రి నివాసానికి కేటాయించిన జీవో సంగతి గుర్తించలేకపోయారా? అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

అధికారులు ఆ విషయాన్ని సీఎం దృష్టికి వెళ్లకుండా దాచిపెట్టారా? అనే అనుమానం కలుగుతోంది. లేదా, గుర్తించినా కూడా తెలియనట్లుగా ఉండిపోయి దానిని తానే విశాఖ నివాసంగా, క్యాంపు కార్యాలయంగా, విశాఖ వెళ్లినప్పుడు సరదాగా ఉండడానికి వాడుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారా అనే అనుమానాలు కూడా ప్రజలలో కలుగుతున్నాయి. ఋషికొండ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే దాని ద్వారా కూడా సంపద సృష్టించేలా తగిన నిర్ణయం వీలైనంత త్వరగా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

15 Replies to “ఎమ్మెల్యేకు తెలిసిన సంగతి చంద్రబాబుకు తెలియదా?”

    1. Ha…Ha…arey bulidings kadithe corruption yenti raa badcow…?? Adhi government property world class infrastructure with very less amount…1190 crores k

      Petti, kaare sachivalam kattina vedhava ni ye cheppu tho kattali raaa…??

      1. మీకు 11 ఇచ్చినా ఇంకా బుద్ధి రానట్టుంది మీ చెప్పుతో మీరే కొట్టుకోండి, కారే బిల్డింగ్ లో 5 సంవత్సరాలు అసెంబ్లీ ఎలా నడిపించారు, గొడుగులు పట్టుకొని కర్చున్నారా అసెంబ్లీ లో?

        రిషికొండ ప్యాలెస్ గవర్నమెంటు ప్రాపర్టీ అని తెలుసు కానీ ఎందుకు కట్టించారు అనేదే ప్రశ్న.

      2. మీకు 11 ఇచ్చినా ఇంకా బు*ద్ధి రానట్టుంది మీ చె*ప్పు*తో మీరే కొట్టుకోండి, కారే బిల్డింగ్ లో 5 సంవత్సరాలు అ*సెం*బ్లీ ఎలా నడిపించారు, గొడుగులు పట్టుకొని కర్చున్నారా అ*సెం*బ్లీ లో?

        రిషికొండ ప్యాలెస్ గవర్నమెంటు ప్రాపర్టీ అని తెలుసు కానీ ఎందుకు కట్టించారు అనేదే ప్రశ్న.

Comments are closed.