సంతకాలు మనం చేస్తే.. రుణం మరొకరు తీరుస్తారా?

అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు సమకూరుతూ ఉండడం మంచి విషయమే. ఆ డబ్బులతో ఐకానిక్ భవనాలే కడతారో.. రోడ్లు పార్కులు లాంటి ఇతర విషయాల మీద ఖర్చు పెట్టేస్తారో తర్వాతి…

అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు సమకూరుతూ ఉండడం మంచి విషయమే. ఆ డబ్బులతో ఐకానిక్ భవనాలే కడతారో.. రోడ్లు పార్కులు లాంటి ఇతర విషయాల మీద ఖర్చు పెట్టేస్తారో తర్వాతి సంగతి. మొత్తానికి అమరావతి నిర్మాణంలో ఒక కీలక ముందడుగు పడేలాగా ఒక దశ వరకు ఒక స్థాయి పనులు పూర్తయ్యేలాగా 15000 కోట్ల రూపాయలు అందుబాటులోకి రావడం అనేది చిన్న విషయం కాదు.

అయితే ఇది ప్రపంచ బ్యాంకు మరియు ఎడిబి సమకూరుస్తున్న రుణం. ఈ ఇద్దరు కలిపి 13,500 కోట్ల రూపాయలను రుణంగా ఇస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ రెండు బ్యాంకులూ కలిపి ఇస్తున్న రుణాన్ని తీర్చవలసింది ఎవ్వరు? అనే విషయంలో ఇప్పటిదాకా సందేహాలు తొలగడం లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం మీదనే భారం పడుతుందా? అనే భయాలు ప్రజలలో ఉన్నాయి.

అమరావతి నిర్మాణం కోసం 15 వేల కోట్ల రూపాయల ఇవ్వబోతున్నట్లుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే ప్రకటించారు. సభలో ప్రకటన తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మొత్తం ప్రపంచ బ్యాంకు ఎడిబి కలిసి రుణంగా ఇస్తాయి కానీ, వీటిని కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది అని ఆమె అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద రుణభారం ఉండదని నిర్మలా సీతారామన్ చాలా స్పష్టంగా చెప్పారు. తర్వాత పరిణామాలలో రాష్ట్ర ప్రభుత్వమే అంటే సి ఆర్ డి ఏ నే రుణం తీసుకుంటున్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. మధ్యలో రుణం సి ఆర్ డి ఏ తీసుకుంటున్నప్పటికీ తిరిగి చెల్లింపు బాధ్యత మాత్రం కేంద్రానిదేనని ఆ విషయంలో స్పష్టత ఉందని రాష్ట్ర మంత్రి నారాయణ ప్రకటించారు.

తీరా ఇప్పుడు సిఆర్డిఏ కమిషనర్ కాటమనేని భాస్కర్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎడిసి చైర్మన్ లక్ష్మీ పార్థసారధి కలిసి ఢిల్లీలో ప్రపంచ బ్యాంకు ఎడిబి బ్యాంకుల ప్రతినిధులతో సమావేశం జరిపారు. ఒప్పందాన్ని కూడా ఖరారు చేసుకున్నారు. దీన్ని తిరిగి ఈ సి ఆర్ డి ఏ ఆమోదానికి పెడతారు. ఆ తరువాత సి ఆర్ డి ఏ కమిషనర్ సంతకాలు చేసి ప్రపంచ బ్యాంకు ఎడిబిలకు పంపుతారు. వచ్చే నెలలో జరిగే ఆయా బ్యాంకుల సమావేశాలలో ఆమోదించి.. బ్యాంకు ప్రతినిధులు కూడా సంతకాలు చేసిన తర్వాత ఒప్పంద ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ నెలలోగా వారు సమకూర్చే సొమ్ములో సుమారు 25 శాతం నిధులు విడుదల అవుతాయి.. అని ప్రస్తుతానికి సమాచారం!

కేవలం సి ఆర్ డి ఏ అధికారులు మాత్రమే ఒప్పందం మీద సంతకం చేస్తే రుణ చెల్లింపు కేంద్రం ద్వారా జరుగుతుందా? లేదా? అనే సందేహాలు ప్రజలలో కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ రుణంపై ఐదేళ్లపాటు మారటోరియం ఉంటుంది. అంటే ఐదేళ్లపాటు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆ తరువాత చెల్లింపు మొదలుపెట్టాలి. ఆరు నెలలకు ఒక వాయిదా వంతున 23 సంవత్సరాల పాటు రుణం ఇఎంఐలు కట్టుకుంటూ పోవాలి. ఆ రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ కేంద్ర ప్రతినిధుల సంతకాలు ఒప్పందం మీద ఒక్కటైనా లేకుండా కేంద్రాన్ని తిరిగి చెల్లించమని నిర్దేశించడం సాధ్యమవుతుందా? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.

ఐదేళ్ల తర్వాత కేంద్రంలో ప్రభుత్వం మారితే పరిస్థితి ఏమిటి? అనే భయం కూడా చాలామందిలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను, చట్టబద్ధమైన రాష్ట్ర హక్కు అయినప్పటికీ బిజెపి సర్కారు ఏర్పడిన తర్వాత సాధించుకోలేకపోయాం.

అదే విధంగా బిజెపి సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక్క సంతకం కూడా చేయకుండా 13500 కోట్ల రూపాయల రుణాన్ని, 2029 తర్వాత మరొక పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడితే వారు తీర్చడానికి అంగీకరిస్తారా? అనేది పెద్ద భయం. ఈ విషయంలో సిఆర్డిఏ అధికారులు గానీ, మునిసిపల్ మంత్రి నారాయణ గానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గానీ ప్రజలకు సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది.

21 Replies to “సంతకాలు మనం చేస్తే.. రుణం మరొకరు తీరుస్తారా?”

  1. అంటే మహా మేత టైమ్ లో

    ఫేక్ పేరెంట్స్ ఫేక్ కిడ్స్ ని కాలేజ్ లో జాయిన్ చేస్తే ఆ రుణం గవర్మెంట్ తీర్చినట్టు, మళ్లీ వాళ్లనుంచి లెవెనోడు, మేత మేసినట్టు..

    అలాగే పిర్ర మీద సెగ్గడ్డ కి కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లి జాయిన్ అయ్యి సైన్ చేస్తే ఆ రుణం గవర్మెంట్ తీర్చి హాస్పిటల్స్ నుంచి మేత లెవెనోడు మేసినట్టు..

    ఇక్కడ కూడా సంతకాలు చేస్తారు, రుణం తీర్చేవాళ్లు వేరు..

  2. అంటే మహా మేత టైమ్ లో

    ఫేక్ పేరెంట్స్ ఫేక్ కిడ్స్ ని కాలేజ్ లో జాయిన్ చేస్తే ఆ రుణం గవర్మెంట్ తీర్చినట్టు, మళ్లీ వాళ్లనుంచి @-#లెవెనోడు, మేత మేసినట్టు..

    అలాగే పిర్ర మీద సెగ్గడ్డ కి కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లి జాయిన్ అయ్యి సైన్ చేస్తే ఆ రుణం గవర్మెంట్ తీర్చి హాస్పిటల్స్ నుంచి మేత @-#లెవెనోడు మేసినట్టు..

    ఇక్కడ కూడా సంతకాలు చేస్తారు, రుణం తీర్చేవాళ్లు వేరు..

  3. అంటే మహా @-#మేత టైమ్ లో

    ఫేక్ పేరెంట్స్ ఫేక్ కిడ్స్ ని కాలేజ్ లో జాయిన్ చేస్తే ఆ రుణం గవర్మెంట్ తీర్చినట్టు, మళ్లీ వాళ్లనుంచి @-#లెవెనోడు, @-#మేత మేసినట్టు..

    అలాగే పిర్ర మీద సెగ్గడ్డ కి కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లి జాయిన్ అయ్యి సైన్ చేస్తే ఆ రుణం గవర్మెంట్ తీర్చి హాస్పిటల్స్ నుంచి @-#మేత @-#లెవెనోడు మేసినట్టు..

    ఇక్కడ కూడా సంతకాలు చేస్తారు, రుణం తీర్చేవాళ్లు వేరు..

  4. అంటే @మహా @-#మేత టైమ్ లో

    ఫేక్ పేరెంట్స్ ఫేక్ కిడ్స్ ని కాలేజ్ లో జాయిన్ చేస్తే ఆ రుణం గవర్మెంట్ తీర్చినట్టు, మళ్లీ వాళ్లనుంచి @-#లెవెనోడు, @-#మేత @మేసినట్టు..

    అలాగే పిర్ర మీద సెగ్గడ్డ కి కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లి జాయిన్ అయ్యి సైన్ చేస్తే ఆ రుణం గవర్మెంట్ తీర్చి హాస్పిటల్స్ నుంచి @-#మేత @-#లెవెనోడు @మేసినట్టు..

    ఇక్కడ కూడా సంతకాలు చేస్తారు, రుణం తీర్చేవాళ్లు వేరు..

    1. మీరేమి కట్టకండి.. ఆన్న ఎలాగూ మళ్ళ పవర్లోకి వచ్చేది లేదు.. మేము చూసుకుంటాం లెండి ఆంధ్ర భవిష్యత్తుని

    2. దొరికిన కాడల్ల అప్పు తెచ్చి పప్పు బెల్లాల్ల పంచిన డబ్బు భా*ర*తి సి*మెం*ట్ అమ్మి కడతారా

    3. రాజదాని ఎన్నికల అంశం అని మీరు చెప్పుకున్నరుగా. మరి ప్రజల తీర్పు చూస్తె తెలియటం లెదా, ప్రజలు ఎమి కొరుకుంటున్నరొ?

      ఇంకా కులం తెచ్చి ఈ లొత్కొర్ కబుర్లు ఎన్నాలు చెపుతావు!

  5. మనం 5 ఏళ్లుగా దృతారాష్టడు లాగా కళ్ళకి గంతలు కట్టుకుని.. ఇప్పుడు విప్పాము

  6. I am sure that all that money we are spending on Amaraavati ( so far approximately 90thousand crores) plus the money we are going to spend in the future on Amaravati region (may be around 4lakh crores) will be paid back by taxes collected within amaravati capital region just like other cities like Delhi, Mumbai, Vizag or Bejawada.

  7. మహా మేత టైం లో సంతకం గవర్నమెంట్ తో చేశాక రుణం లెవునోడి కంపెనీలు లో తీర్చుకోలా..

Comments are closed.