వరుణ్ కు ఇది బెస్ట్ ఛాన్స్!

మెగా హీరోల్లో ఒకరైన వరుణ్ తేజ్ ను పరాజయాల పరంపర వెంటాడుతోంది. ఇలాంటి టైమ్ లో మట్కా సినిమా వస్తోంది. ఇది ఒక విధంగా బెస్ట్ చాన్స్. అన్న విధాలా ప్రూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే…

మెగా హీరోల్లో ఒకరైన వరుణ్ తేజ్ ను పరాజయాల పరంపర వెంటాడుతోంది. ఇలాంటి టైమ్ లో మట్కా సినిమా వస్తోంది. ఇది ఒక విధంగా బెస్ట్ చాన్స్. అన్న విధాలా ప్రూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఏదో రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు. కమర్షియల్ లెక్కలు చూసుకుని, మూడు ఫైట్లు, అయిదు పాటలు పెట్టి చుట్టేసిన సినిమా కాదు. కాస్త డిఫరెంట్ గా ప్రయత్నించిన సినిమా.

దర్శకుడు కరుణ్ కుమార్ కు ఒక ఐడియాలజీ అంటూ వుంది. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలు కమర్షియల్ గా ఎంత ఫేర్ చేసాయి.. అలాంటి లెక్కలు పక్కన పెడితే క్రిటికల్ గా ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పుడు తీస్తున్న మట్కా కూడా కింద నుంచి పైకి వచ్చిన ఓ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ కథే అయినా, దానికి తీసుకున్న నేపథ్యం, పిరియాడిక్ టచ్ ఇలా అన్నీ కలిసి మట్కాను ఓ వైవిధ్యమైన సినిమాగా మార్చాయి. పైగా వరుణ్ తేజ్ కు నటుడిగా ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఓ అవకాశం ఇది. సినిమాలో దాదాపు నాలుగైదు షేడ్స్ వున్నాయి. యంగ్ నుంచి సీనియర్ వరకు అన్ని ఏజ్ ల్లో తన నటన చూపించే అవకాశం వుంది.

సో, అందువల్ల సక్సెస్ కొట్టడానికి అన్ని విధాలా స్కోప్ వున్న సినిమా. వరుణ్ తేజ్ కెరీర్ లో మంచి హిట్ లు వున్నాయి. సూపర్ ఫ్లాపులు వున్నాయి. కానీ ఇక్కడ ఎప్పటి సక్సెస్ అప్పుడే. రెండు సినిమాలు వరుసగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఈ మూడో సినిమా కనుక హిట్ అనిపించుకుంటే ఓకె. లేదంటే సినిమాలు చేతికి రావు అని కాదు. మార్కెట్ నిలబడాల్సి వుంది. అ పాయింట్ లో హిట్ అనేది అత్యవసరం.

వరుణ్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఫిజిక్‌ విషయంలో, లుక్ విషయంలో, డబ్బింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. సినిమా ప్రచారానికి కూడా చాలా ఎక్కవ టైమ్ కేటాయించి, తిరిగాడు. ఓపెన్ గా మాట్లాడాడు.

సో ఒక సక్సెస్ ఫుల్ సినిమాకు ఏం కావాలో, అన్ని విధాలుగా, అన్నీ చేసారు. ఇక మిగిలింది సినిమా ఎలా వచ్చింది అన్నది. సినిమా ఏమాత్రం ఎంగేజింగ్ గా వున్నా, థియేటర్లో సరైన సినిమా లేదు. కంగువ సినిమా గట్టి పోటీనే. కానీ మట్కా సినిమాకు జానర్ అడ్వాంటేజ్ వుంది. కానీ ఎన్ని అడ్వాంటేజ్ లు వున్నా, చివరకు ప్రూవ్ కావాల్సింది, సినిమాను నిలబెట్టాల్సింది సినిమానే. అది ఎలా వచ్చింది అన్నది మరో ఒక్క రోజులు తేలిపోతుంది.

6 Replies to “వరుణ్ కు ఇది బెస్ట్ ఛాన్స్!”

  1. మెగా హీరోల సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయినా వాళ్ళ కెరీర్ కి ఢోకా లేదు. అదే బైట హీరో ఐతే ఇన్ని ఫ్లాపుల తరువాత సినిమానే ఉండదు.

    1. Hero lo vishayam unte chance lu vastayi. Varun bad luck hit raavatledu last few movies.

      Nagarjuna ki SIVA taruvata 12 flops,

      Nithin ki kuda most flops,

      Appatlo Udaykiran ki enni cinemalu vachina hit ayyevi kaavu.

      Talent unte konni chance lu vastayi.

  2. ఏమోలే..ఎన్నో చదువుతాం…అన్నీ అనుకున్నట్టు జరగవు కదా! ఇదీ అంతే…రివ్యూ లో చదువుకుందాం.సరేనా?

Comments are closed.