అయినవాళ్లకు దోచి పెట్టేందుకే ఆ ఏర్పాటు!

చంద్రబాబునాయుడు ప్రభుత్వం, పరిపాలన అంటేనే అయిన వాళ్లకు దోచిపెట్టడానికి టాప్ ప్రయారిటీ ఇస్తుంటారనే సంగతి అందరికీ తెలుసు. ప్రభుత్వానికి డైరక్టుగా ఆదాయం సమకూరుస్తూ వచ్చిన లిక్కర్ దుకాణాలను ప్రెవేటు పరం చేయడం దగ్గరినుంచి వ్యవహారాలు…

చంద్రబాబునాయుడు ప్రభుత్వం, పరిపాలన అంటేనే అయిన వాళ్లకు దోచిపెట్టడానికి టాప్ ప్రయారిటీ ఇస్తుంటారనే సంగతి అందరికీ తెలుసు. ప్రభుత్వానికి డైరక్టుగా ఆదాయం సమకూరుస్తూ వచ్చిన లిక్కర్ దుకాణాలను ప్రెవేటు పరం చేయడం దగ్గరినుంచి వ్యవహారాలు అన్నీ కూడా అయినవాళ్లకు దోచిపెట్టడం లక్ష్యంగానే సాగుతుంటాయి.

ఇప్పుడు సంక్రాంతిలోగా రోడ్ల మరమ్మతులు మొత్తం పూర్తిచేయిస్తానని చంద్రబాబు ప్రకటించారు. రోడ్ల పనులు రాబోయే రెండుమూడు నెలల్లో ముమ్మరంగా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు కాంట్రాక్టర్లలో కూడా అయినవారికి దోచిపెట్టేందుకు చంద్ర సర్కారు మరో పథకం వేసినట్టుగా కనిపిస్తోంది.

సాధారణంగా ఆర్ అండ్ బీలో రోడ్ల పనులు చేసే కాంట్రాక్టర్లకు బ్లాక్ పీరియడ్ అని ఉంటుంది. టెండర్లలో బిడ్ సామర్థ్యం కోసం కాంట్రాక్టర్ల అనుభవం పరిశీలించడానికి గత అయిదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలంలో తెలుగుదేశానికి చెందిన కాంట్రాక్టర్లు ఎవ్వరూ పనులు చేయడానికి ముందుకు రాలేదు. తాము పనులు చేసినా బిల్లలు దగ్గర పేచీ వస్తుందని ఆగిపోయారు. అలాగని జగన్ హయాంలో రోడ్డు పనులు జరగలేదనడానికి వీల్లేదు.

గత అయిదేళ్లలో ఏడువేల కోట్ల రూపాయలకు పైగా విలువైన రోడ్డు పనులు జరిగినట్టు సాక్షాత్తు ప్రస్తుత మంత్రి జనార్దనరెడ్డి వెల్లడించారు. అంటే పనులు ముమ్మరంగా జరిగినట్టే లెక్క. కాకపోతే వారంతా వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లే అయి ఉంటారని ఈ చంద్రబాబు ప్రభుత్వానికి అనుమానం. అందుకని తమ పార్టీకి చెందిన కాంట్రాక్టర్లకు విస్తృతంగా అవకాశం కల్పించడానికి ఒక వెసులుబాటు కల్పించారు.

కాంట్రాక్టర్ల బ్లాక్ పీరియడ్ అనే దానిని పదేళ్లకు పెంచారు. గత అయిదేళ్లలో కోవిడ్ కారణంగా సరిగా పనులు జరగలేదని ఒక సాకు చూపిస్తున్నారు. అసలు లక్ష్యం మాత్రం 2014-19 మధ్య పనులు చేసిన తెలుగుదేశం కాంట్రాక్టర్లందరికీ అవకాశం ఇవ్వడమే. ఈ వెసులుబాటు వలన గత అయిదేళ్లలో ఒక్క రోడ్డు కాంట్రాక్టు పని కూడా చేయకుండా ఉండిపోయిన కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇప్పుడు తెరమీదకు వస్తారు. అయిన వారికి దోచిపెట్టాలని లక్ష్యం నిరాటంకంగా కొనసాగుతుంది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

14 Replies to “అయినవాళ్లకు దోచి పెట్టేందుకే ఆ ఏర్పాటు!”

  1. ఇందులో తప్పు ఏముంది?

    అయిన వాళ్లకి అనుభవం ఉంటే ఇవ్వకూడదా.. ఇప్పుడు కూడా వైసీపీ వాళ్లకి ఇవ్వాలా?

  2. చంద్రబాబు రోడ్లు వేసి తమ వాళ్లకు దోచి పెడతాడు..

    జగన్ రెడ్డి రోడ్లు వేసేశామని సాక్షి లో రాసుకుని .. మొత్తం దోచుకొంటాడు..

    అక్కడ రోడ్ లేదే అని అడిగితే.. టీడీపీ వేసిన రోడ్లు అప్పుడే పాడైపోయాయా అని వెటకారం చేస్తాడు..

    చంద్రబాబు లాగా కష్టపడేవాళ్ళని చూస్తే.. మొత్తబుద్ధవుతుంది..

    జగన్ రెడ్డి లాగా తన్ని లాక్కునేవాళ్లను చూస్తే.. నోరు కూడా పెగలదు.. ఇది మానవ నైజం..

  3. బాబు కనీసం పనీ చేయించి అయినా దోచిపెడతాడు… ఆన్న పని చెయ్యకుండానే దోచి పెడతాడు అది ఇద్దరి మధ్య తేడా

  4. అంటె Y.-.C.-.P హయాములొ దొచుకున్న Y.-.C.-.P కాంట్రాక్టర్లకె ఈ ప్రబుత్వం లొ అన్ని కాంట్రాక్ట్ లూ కట్టపెట్టాలి అంటవా?

  5. లోఫర్ కొడకా మరి జగను గాడు దోచిపెట్టింది కనిపించలేదా పిచ్చి కుక్క వెంకట రెడ్డి

  6. ఇసుక ఐపోయింది అంటున్నారు.. ఇంకా మిగిలింది ఇదా…దోచుకో పంచుకో తినుకో… ఆలస్యయించిన ఆసా భంగం…

Comments are closed.