వైఎస్ జ‌గ‌న్ వార్నింగ్‌కు తిరుప‌తి ఎస్పీ కౌంట‌ర్‌!

సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోస్టులు పెట్టార‌నే కార‌ణంతో వైసీపీ యాక్టివిస్టుల‌ను రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేస్తుండ‌డంపై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా డీజీపీ ద్వారకా తిరుమ‌ల‌రావు,…

సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోస్టులు పెట్టార‌నే కార‌ణంతో వైసీపీ యాక్టివిస్టుల‌ను రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేస్తుండ‌డంపై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా డీజీపీ ద్వారకా తిరుమ‌ల‌రావు, తిరుప‌తి ఎస్పీ సుబ్బారాయుడికి జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

రిటైర్ అయినా డీజీపీని వదిలిపెట్టేది లేద‌ని జ‌గ‌న్ హెచ్చ‌రించారు. టీడీపీ కార్య‌క‌ర్త‌లా డీజీపీ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. అలాగే తిరుప‌తి ఎస్పీ సుబ్బ‌రాయుడిని తెలంగాణ నుంచి అదే ప‌నిగా చంద్ర‌బాబునాయుడు పిలిపించుకున్నార‌న్నారు. ప్ర‌భుత్వం మార‌గానే తిరిగి తెలంగాణ వెళ్లిపోవ‌చ్చ‌ని తిరుప‌తి ఎస్పీ అనుకుంటున్నాడ‌ని జ‌గ‌న్ అన్నారు. స‌ప్త స‌ముద్రాల ఆవ‌త‌ల ఉన్నా విడిచి పెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని జ‌గ‌న్ హెచ్చ‌రించ‌డం రాజ‌కీయంగా సంచ‌ల‌నం క‌లిగించింది.

ఈ నేప‌థ్యంలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కామెంట్స్‌పై మీడియా స‌మావేశంలో తిరుప‌తి ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారు. తాను రాజ‌కీయాల గురించి మాట్లాడ‌న‌ని అన్నారు. తన‌పై ఎవ‌రెన్ని ఆరోప‌ణ‌లు చేసినా, చ‌ట్ట ప‌రిధిలోనే ప‌ని చేస్తున్న‌ట్టు జ‌గ‌న్ కామెంట్స్‌కు వివ‌ర‌ణ ఇచ్చారు. తాను ఏపీకి చెందిన అధికారిని అని, అనంత‌పురం జిల్లా నివాసిగా ఎస్పీ వివ‌ర‌ణ ఇచ్చారు.

తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిలో ప‌ని చేసే అవ‌కాశం ల‌భించ‌డం మ‌హాభాగ్యంగా ఆయ‌న చెప్పుకొచ్చారు. పూర్వ‌జ‌న్వ సుకృతంగా ఆయ‌న అభివ‌ర్ణించ‌డం విశేషం. తిరుప‌తిలో ప‌ని చేయాల‌నే కోరిక చాలా కాలంగా వుండింద‌న్నారు. త‌న‌కు త‌ప్పు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు. జ‌గ‌న్ ఆరోపిస్తున్న‌ట్టుగా, తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని తిరుప‌తి ఎస్పీ వివ‌ర‌ణ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

19 Replies to “వైఎస్ జ‌గ‌న్ వార్నింగ్‌కు తిరుప‌తి ఎస్పీ కౌంట‌ర్‌!”

  1. ఈ అరెస్త్ అవుతున్న వాళ్ళు సొషల్ మీడియా లొ ఎనెన్ని దారునమయిన కూతలు కూసారొ కూడా ఇప్పుడు భయటకు వస్తున్నాయి.

    .

    ఇంత చండలమయిన వారిని సొషల్ మీడియా యాక్టివిస్ట్లు అని jagan చెప్పుకుంటూ, వాళ్ళని రక్షించటం కొసం నెరుగా పొలీసులనె బెదిరించటం చూస్తె జనానికి అసహ్యం వెస్తుంది.

  2. రాష్ట్రము ఎక్కడికో వెళ్లిపోతుంది…

    ఒక రాజకీయ నాయకుడు ఆరోపణలకి ఒక ఐపీఎస్ వివరణ ఇచ్చాడంటే నెక్స్ట్ ఇంకేం జరుగుతుందో…..

  3. నెత్తి మీద 36 కేసులున్న నువ్వెందిరా మాకు వార్ణింగ్ ఇచ్చేది గొట్టం.. అని సుతి మెత్తగా చెప్పాడు..

    పోలీసోడు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళతాడు..

    జగన్ రెడ్డి ట్రాన్స్ఫర్ అయితే అసెంబ్లీ కి కాకుండా సెంట్రల్ జైలు కి వెళతాడు.. అని సీట్ వార్ణింగ్ ఇచ్చాడు..

  4. జగన్ హయాంలో బాబు, లోకేష్ లు ఇదే రకమైన వార్నింగ్లు ఇచ్చారు. ఇప్పుడు జగన్ వంతు.

  5. ఇతనికి బెయిల్ రద్దు చెయ్యాలని జగన్ గారు పోలీస్ లకు వార్నింగ్ ఇవ్వడం సుప్రీమ్ కోర్ట్ ద్రుష్టి కి తీసుకెళ్లాలి బయట ఉండి పోలీసులను బెదిరించినోడు ఏమైనా చెయ్యగలడు అందుచేత ధర్మాసనం దృష్టికి వెళితే తప్పక బెయిల్ రద్దయి పోతుంది

Comments are closed.