ఎట్ట‌కేల‌కు ర‌ఘురామ‌కు ప‌ద‌వి!

ఉండి టీడీపీ ఎమ్మెల్యే క‌నుమూరు ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు ఎట్టకేల‌కు ఒక ప‌దవి ద‌క్కింది. స్పీక‌ర్ ప‌దవి ఆశించిన ఆయ‌న‌, చివ‌రికి డిప్యూటీ స్పీక‌ర్‌గా స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఈ ప‌ద‌వి ఆయ‌న‌కో అలంకార‌ప్రాయంగా మార‌నుంది. ఎందుకంటే స్పీక‌ర్…

ఉండి టీడీపీ ఎమ్మెల్యే క‌నుమూరు ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు ఎట్టకేల‌కు ఒక ప‌దవి ద‌క్కింది. స్పీక‌ర్ ప‌దవి ఆశించిన ఆయ‌న‌, చివ‌రికి డిప్యూటీ స్పీక‌ర్‌గా స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఈ ప‌ద‌వి ఆయ‌న‌కో అలంకార‌ప్రాయంగా మార‌నుంది. ఎందుకంటే స్పీక‌ర్ చైర్‌లో లేని స‌మ‌యంలో మాత్ర‌మే ర‌ఘురామ ఆ సీటులో ఆసీనులు కావాల్సి వుంటుంది. ఈ ప‌ద‌వితో ర‌ఘురామ ఏ మేర‌కు సంతృప్తి చెందుతారో ఆయ‌న మ‌న‌సుకే తెలియాలి.

వైసీపీపై ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను సృష్టించ‌డంలో కీల‌క పాత్ర పోషించాన‌నేది ర‌ఘురామ భావ‌న‌. వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడ్డానికి భ‌య‌ప‌డుతున్న త‌రుణంలో తాను అదే పార్టీ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వ‌హిస్తూ గ‌ళ‌మెత్తాన‌ని ఆయ‌న అనేక సంద‌ర్భాల్లో చెప్ప‌డం చూశాం, విన్నాం. ఎన్నిక‌ల సమ‌యంలో ఆయ‌న ఎంపీ సీటును ఆశించారు. కానీ కుద‌ర్లేదు. చివ‌రికి అతి క‌ష్టం మీద ఆయ‌న‌కు ఉండి ఎమ్మెల్యే సీటు ద‌క్కింది. ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ర‌ఘురామ‌కు కూట‌మి స‌ర్కార్‌లో ఏ ప‌ద‌వి ఇస్తార‌నే విష‌య‌మై విస్తృత‌మైన చ‌ర్చ జ‌రిగింది. స్పీక‌ర్‌, హోంమంత్రి… సోష‌ల్ మీడియా యాక్టివిస్టులే ఆయ‌న‌కు అనేక ప‌ద‌వులు ఇచ్చేశారు. వాస్త‌వానికి వ‌చ్చే స‌రికి, ఆయ‌న‌కు ఎలాంటి ప‌ద‌వి ద‌క్క‌లేదు. ఇది ఆయ‌న‌లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అయితే అసంతృఫ్తి, ఆగ్ర‌హాన్ని పంటి బిగువున అణ‌చిపెట్టుకుని ఉన్నారు.

ప‌ద‌వుల పంపిణీ పూర్త‌య్యే ద‌శ‌లో ర‌ఘురామ‌ను చంద్ర‌బాబునాయుడు గుర్తు పెట్టుకున్నారు. డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వికి ఎంపిక చేశారు. ఏదో ఒక ప‌ద‌వి ఇవ్వాల‌న్న ఉద్దేశం త‌ప్ప, ర‌ఘురామ‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన పోస్టు ఇవ్వ‌లేద‌నే వాద‌న ఆయ‌న అభిమానుల నుంచి వినిపిస్తోంది. పేరుకు డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి అని, దాని వ‌ల్ల ర‌ఘురామ‌కు వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

అయితే ఏ ప‌దవీ ఇవ్వ‌లేద‌నే చెడ్డ పేరు కంటే, ఏదో ఒక‌టి ఇచ్చాం క‌దా అని చెప్పుకోడానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అనే వాళ్లు లేక‌పోలేదు. ఏది ఏమైనా ర‌ఘురామ‌కృష్ణ‌రాజు పేరుకు ముందు ఇప్పుడు ఓ హోదా వ‌చ్చి చేరింది.

18 Replies to “ఎట్ట‌కేల‌కు ర‌ఘురామ‌కు ప‌ద‌వి!”

  1. అయ్యా.. ఎవరైనా ఆ జగన్ రెడ్డి ని యెలహంక పాలస్ నుండి లేపుకెళ్లి ఆంధ్ర అసెంబ్లీ లో పడేయండి.. సామి..

    ఆ ఒక్క డైలాగ్ వినాలని ఉంది..

    మూసుక్కూర్చోరా.. పొట్టోడా.. అనే డైలాగ్ RRR చెపితే వినాలని ఉంది…

  2. ఎంకటి వండి వార్చాడు.…

    .

    “లోకేష్ మీద గెలిస్తే మంత్రిని చేస్తా” కన్నా ఇది వెయ్యి రెట్లు బెటర్..

  3. మొదతి సారి గా TDP MLA గెలిచి చెసి డిప్యుటీ స్పీకెర్ అయ్యడు అంటె తగిన గుర్తింపు ఇచ్చరు అన్నది సుస్పస్టం! అందుకె GA కి కడుపు రగిలి పొతుంది.

    .

    రెపు జగన్ అస్సెంబ్లీ కి వస్తె అద్యక్షా అని పిలవాలి. మరి మాత్రం మండదా?

    1. మీ నత్తి గాడి స్పీచ్ లు వినే బాద తప్పింది, పేపర్ ముక్క లేకపోతే అక్షరం కూడా సరిగా బయటికి రాదు, లైవ్ స్పీచ్ కూడా ఎడిట్ చేసి ప్రసారం చేసే బుర్ర తక్కువ సన్నాసి మీ దద్దమ్మ గాడు

    2. పవన్ గారు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు అనే వారికి…

      ఆయన చాలా అంటే చాలా క్లారిటీ గా.. ఒక ప్రత్యామ్నాయంగా ఎదగడానికి… ప్రయత్నిస్తున్నారు… ఇది సుస్పష్టం.

  4. జగన్ ఓ ఎర్రిపుకు మూర్ఖపు వ్యక్తి, వాడి బతుకు అంతే చుట్టూ పనికిమాలిన వాళ్ళు సజ్జల,విజయసాయి,చెవిరెడ్డి కోడలి, బోరుగడ్డ,జోగి రమేష్, శ్రీ రెడ్డి ఇలా ఎందరో ఎర్రిపుగాళ్ళు !! ఎదో సుడితిరిగి సీఎం అయ్యాడు, ఇంక 15 -20 ఏళ్ళు రాడు.

  5. డిప్యూటీ లను శిఖండి మాదిరి వాడుకోవడం ఇటీవలి రాజకీయం..ఈ దెబ్బకు ఎంతటి అర్జునడైనా మైక్ వదిలి సభ నుంచి పారిపోవడం ఖాయం!

  6. ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చి పడేసి , అసెంబ్లీకి రప్పించండయ్యా.. స్పీకర్ గా అయ్యన్న గారు, డిప్యూటీ స్పీకర్ గా రాజు గారు మధ్యలో బెప్పం కాంబినేషన్ మాములుగా ఉండదు

  7. ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చి పడేసి , అసెంబ్లీకి రప్పించండయ్యా.. స్పీకర్ గా అయ్యన్న గారు, డిప్యూటీ స్పీకర్ గా రాజు గారు మధ్యలో బె ప్పం కాంబినేషన్ మాములుగా ఉండదు

Comments are closed.