ర‌ఘ‌రామ‌కు కంగ్రాట్స్ చెప్పిన వైసీపీ కీల‌క నేత‌!

గతంలో ఒకే పార్టీలో ఉంటూ నిత్యం బూతులు తిట్టుకునే విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణం రాజుల మధ్య ప్రస్తుతం స్నేహపూర్వక వ్యవహారం నెలకొన్నట్లు కనిపిస్తోంది. డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణం రాజు ఎన్నికైన తర్వాత విజయసాయిరెడ్డి ఆయనకు ట్విట్టర్…

గతంలో ఒకే పార్టీలో ఉంటూ నిత్యం బూతులు తిట్టుకునే విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణం రాజుల మధ్య ప్రస్తుతం స్నేహపూర్వక వ్యవహారం నెలకొన్నట్లు కనిపిస్తోంది. డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణం రాజు ఎన్నికైన తర్వాత విజయసాయిరెడ్డి ఆయనకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారి పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తోంది. ఒకే పార్టీలో ఉండి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న‌ ఈ నేతల మధ్య సడెన్‌గా సాన్నిహిత్యం పెరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన రఘురామకృష్ణంరాజు గారికి అభినందనలు. ఈ గౌరవనీయమైన పదవికి తగిన విధంగా, మీరు గతంలో చోటుచేసుకున్న పరిణామాలను విడిచిపెట్టి, ఈ స్థానం గౌరవాన్ని మరియు అలంకారాన్ని నిలబెట్టుకుంటారని నాకు నమ్మకం ఉందంటూ ట్వీట్ చేశారు. గతంలో జరిగిన విషయాలు విడిచిపెట్టి అందరితో గౌరవంగా ఉండాలని హితవు చెప్పడం విశేషం.

కొన్ని రోజుల క్రితం కూడా అసెంబ్లీ లాబీలో వైసీపీ అధినేత జగన్‌తో రఘురామకృష్ణం రాజు మాట్లాడిన విషయం అందరినీ షాక్ కు గురిచేసింది. వైసీపీ ప్రభుత్వంలో సొంత పార్టీలో ఉండి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రఘురామ, పలు సందర్భాలలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టును కూడా ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేసి కొట్టారని పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు. అదే సమయంలో టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తన అరెస్ట్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు, ఇదే కేసులో పలువురు అధికారులను విచారిస్తున్న సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డి రఘురామకృష్ణం రాజును ట్విట్టర్ ద్వారా అభినందించడం విశేషం. ఇది రాజకీయ వర్గాల్లో చాలా చర్చలకు కారణమవుతోంది.

కాగా, జగన్ పై ఇక‌ వ్యక్తిగతంగా విమర్శలు చేయనని ఎమ్మెల్యే రఘురామ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి రఘురామకు అభినందలు తెలపడం అందరిని ఆశ్చర్యపరిచింది.

6 Replies to “ర‌ఘ‌రామ‌కు కంగ్రాట్స్ చెప్పిన వైసీపీ కీల‌క నేత‌!”

    1. ఆర్ధిక లబ్ది కలగలేదని.. పదవులు కట్టబెట్టలేదని .. అక్కసుతో నువ్వు కన్ను మిన్ను కానరాక..అన్న మాటలకు చేసిన పనులకి… నిన్ను.. Kv Kk@ ను కొట్టినట్టు కొట్టారు ఇప్పటికైనా.. ఒక హుందాగా ఉండవలసిన పదవి ఇచ్చారు.. అన్ని మరచిపోయి.. హుందాగా బ్రతుకు ఇది అందరికి మంచిది.

  1. గతం లో చోటు చేసుకున్న పరిణామాలు…అంటే కొట్టినట్టు ఒప్పుకుంటున్నాడా? ఎంత దారుణం…మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళని ఏమి అనకూడదని కోర్ట్ కేసులు

Comments are closed.