ఇప్ప‌ట్లో డీఎస్సీ లేన‌ట్టేనా?

డీఎస్సీపై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. డీఎస్సీ అభ్య‌ర్థులు ఒక్కొక్క‌రు రూ.50 వేలు చొప్పున ఖ‌ర్చు చేసి, మ‌రీ కోచింగ్ తీసుకున్నారు. మ‌రికొంద‌రు ఇప్ప‌టికీ కోచింగ్ సెంటర్‌లలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో విద్యాశాఖ మంత్రి నారా…

డీఎస్సీపై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. డీఎస్సీ అభ్య‌ర్థులు ఒక్కొక్క‌రు రూ.50 వేలు చొప్పున ఖ‌ర్చు చేసి, మ‌రీ కోచింగ్ తీసుకున్నారు. మ‌రికొంద‌రు ఇప్ప‌టికీ కోచింగ్ సెంటర్‌లలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌పై చేసిన ప్ర‌క‌ట‌న విద్యార్థుల్లో అయోమ‌య్యాన్ని సృష్టిస్తోంది. వ‌చ్చే ఏడాది అని ఆయ‌న అంటున్న‌ప్ప‌టికీ, కోర్టు వ్య‌వ‌హారం కావ‌డంతో ఇప్ప‌ట్లో నిర్వ‌హ‌ణ సాధ్యం కాద‌ని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

తాము అధికారంలోకి వ‌స్తే మెగా డీఎస్సీ ఇస్తామ‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ హామీ ఇచ్చారు. దీంతో నిరుద్యోగులు కూట‌మికి అండ‌గా నిలిచారు. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత 16,347 టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని మెగా డీఎస్సీ ప్ర‌క‌టించారు.

గ‌త వైసీపీ ప్ర‌భుత్వం 6,900 టీచ‌ర్ పోస్టుల‌కు ఇచ్చిన నోటిఫికేష‌న్‌ను కూట‌మి స‌ర్కార్ ర‌ద్దు చేసింది. ఈ పోస్టుల‌ను కూడా మెగా డీఎస్సీలో క‌లిపింది. వైసీపీ ప్ర‌భుత్వం చివ‌రి రోజుల్లో డీఎస్సీ ప్ర‌క‌ట‌న ఇచ్చి త‌ప్పు చేసింది. న‌వంబ‌ర్ 4న టెట్ ఫ‌లితాలు వెల్ల‌డించి, 6న డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని హామీ ఇచ్చింది.

టెట్ ఫ‌లితాల‌ను మాత్రం ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. కానీ డీఎస్సీ నోటిఫికేష‌న్ రాక‌పోవ‌డం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. డీఎస్సీ నోటిఫికేష‌న్ కోసం 7.50 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా కోచింగ్ తీసుకుంటూ వేలాది రూపాయ‌ల్ని ఖ‌ర్చు చేసుకుంటున్నారు. కొంద‌రు మ‌హిళ‌లు చిన్న పిల్ల‌ల్ని సైతం ఇళ్ల వ‌ద్ద విడిచి కోచింగ్ తీసుకుంటున్నారు.

డీఎస్సీ నోటీఫికేష‌న్‌పై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కొన్ని న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లున్నాయ‌ని, వాటిపై అధ్య‌య‌నం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించిన‌ట్టు లోకేశ్ చెప్పారు. న్యాయ ప‌ర‌మైన చిక్కుల‌పై లోతుగా అధ్య‌య‌నం చేయాల‌ని అధికారులు చెబుతున్నారు. దీంతో డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇప్ప‌ట్లో వ‌చ్చేలా లేద‌ని నిరుద్యోగులు తీవ్ర నిరాశ‌నిస్పృహల‌కు గురి అవుతున్నారు. మ‌రీ ముఖ్యంగా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ నేప‌థ్యంలో రిజ‌ర్వేష‌న్‌లో మార్పు చేయాల్సి వ‌స్తోంద‌ని విద్యాశాఖ అధికారులు అంటున్నారు.

ఇప్ప‌టికే ఆరేళ్లుగా డీఎస్సీ నోటిఫికేష‌న్లు లేవు. దీంతో వ‌య‌సు పైబ‌డుతూ, ఉద్యోగాల‌కు అర్హ‌త కోల్పోతామ‌నే ఆందోళ‌న అభ్య‌ర్థుల్లో ఆందోళ‌న నెల‌కుంది. మొత్తానికి డీఎస్సీ ఇప్ప‌ట్లో జ‌రుగుతుంద‌నే న‌మ్మ‌కం అభ్య‌ర్థుల్లో నెమ్మ‌దిగా స‌డ‌లుతోంది.

9 Replies to “ఇప్ప‌ట్లో డీఎస్సీ లేన‌ట్టేనా?”

  1. ఆరేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ లేనప్పుడు.. ఆరో ఏడు లో తీరిగ్గా ప్రశ్నించేద్దామనుకుని .. మొదటి ఐదేళ్లు ప్రశాంతం గా పడుకొన్నావా వెంకట్ రెడ్డి..

    కూటమి గవర్నమెంట్ డీఎస్సీ పైన రెండో సంతకం చేసింది.. ఇచ్చి తీరుతుంది.. కాస్త ఉచ్చా ఆపుకో..

    మాట ఇచ్చి ఎగ్గొట్టడానికి.. ఇది జగన్ రెడ్డి ప్రభుత్వం కాదు..

    డీఎస్సీ పైన సంతకం పెట్టినప్పుడే .. ఆరు నెలల్లో ప్రాసెస్ మొదలు పెడతామని చెప్పారు..

    ప్రతిపక్షం లో ఉన్నప్పుడే.. నీకు, జగన్ రెడ్డి కి ప్రజల పైన ఎక్కడాలేని ప్రేమ, అభిమానం పుట్టుకొచ్చేస్తాయి..

  2. ఆరేళ్లుగా లేవు అన్నపుడు .. అందులో ఐదేళ్లు పదవిలో ఉన్న వాళ్ళ తప్పు లేదా ?? ఆరు నెలలు ముందు వొచినవాళ్ల తప్పు అంతేనా ?మళ్ళా మేము ఏపార్టీ కొమ్ము కాయం అని పెద్ద నీతులు రాస్తావు ..

  3. మేగా డీఎస్సీ supersix ఎక్సప్రెస్ ఎక్కి అమరావతి కరకట్ట గుండా ప్రకాశం బ్యారేజ్ లో కలిసింది

Comments are closed.