మా అరెస్టులే తరువాయి అంటున్న మాజీ మంత్రి

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడుతూ అరెస్టులు చేస్తోందని వైసీపీ నాయకులు అంటున్నారు. Advertisement ఇదంతా ఒక పద్ధతి ప్రకారం కావాలనే…

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడుతూ అరెస్టులు చేస్తోందని వైసీపీ నాయకులు అంటున్నారు.

ఇదంతా ఒక పద్ధతి ప్రకారం కావాలనే కక్ష సాధింపు చర్యలలో భాగంగా జరుగుతోందని అంటున్నారు. ఇపుడు సోషల్ మీడియా కార్యకర్తలను పనిగట్టుకుని అరెస్ట్ చేస్తున్నారని వారి తరువాత వంతు మాదే అని మాజీ మంత్రి వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ అంటున్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరుతూంటే కేసులు అక్రమంగా పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అయినా ఈ కేసుల విషయంలో తాము భయపడేది లేదని అన్నారు.

తన మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతోందని తన తాత గుడివాడ అప్పన్న పేరు మీద ఇరవై ఏళ్ళ క్రితం ట్రస్ట్ పెడితే దానికి సంబంధించిన భూముల వివరాలు ఇతర పేపర్లు తేవాలని అడుగుతున్నారని గుడివాడ చెప్పారు అయినా తాము ఎవరికీ తగ్గేది లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఇవ్వలేకపోయింది అన్నారు. బడ్జెట్ లో నిధుల కేటాయింపులు కూడా చాలా వాటికి లేవని అన్నారు.

ఇక తల్లికి ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పధకం ఇస్తామన్నారని అలా చూస్తే రాష్ట్రంలో 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని వారికి ఈ పధకం కింద 12 వేల 500 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కేవలం బడ్జెట్ లో అయిదు వేల కోట్లు మాత్రమే కేటాయించారని ఆయన అన్నారు.

అలాగే, 18 ఏళ్లు దాటిన మహిళలు రాష్ట్రంలో కోటి 50 లక్షలు మంది వరకు ఉన్నారని వారికి ఆడ బిడ్డ పధకం కింద ఏడాదికి 26 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కానీ బడ్జెట్ లో ఒక రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. నిరుద్యోగ భృతికి ఒక రూపాయి కేటాయించలేదని గుడివాడ విమర్శించారు.

చంద్రబాబు ఇచ్చిన హామీలకు ఏడాదికి లక్ష 20 వేల కోట్ల రూపాయలు అవసరం అయితే ఆయన బడ్జెట్ లో 30 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని గుడివాడ చెప్పారు. హామీలు అమలు చేయలేక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని మండిపడ్డారు.

11 Replies to “మా అరెస్టులే తరువాయి అంటున్న మాజీ మంత్రి”

  1. అయ్యా పోలీసులు..

    వీడు జైలుకి వచ్చినప్పుడు.. భోజనం లో మాత్రం గుడ్డు ఉండేలా చూడండి..

    వీడు మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రజలకు ఎన్నో గుడ్లు పెట్టాడు.. వీడికి ఆ మాత్రం చేయడం మన ధర్మం..

  2. అయ్యా పోలీసులు..

    వీడు జైలుకి వచ్చినప్పుడు.. భోజనం లో మాత్రం కోడిగుడ్డు ఉండేలా చూడండి..

    వీడు మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రజలకు ఎన్నో గుడ్లు పెట్టాడు.. వీడికి ఆ మాత్రం చేయడం మన ధర్మం..

Comments are closed.