‘కొనుగోళ్లు’ తగ్గుతున్నాయి

ఒకప్పుడు ఓటీటీ హక్కులు అంటే నిర్మాణ వ్యయంలో 70 శాతం వరకు ఇచ్చే పరిస్థితి వుండేది. కానీ రాను రాను ఆ పరిస్థితి మారుతోంది. క్రేజీ ప్రాజెక్ట్ లు, భారీ కాంబినేషన్ల సంగతి అలా…

ఒకప్పుడు ఓటీటీ హక్కులు అంటే నిర్మాణ వ్యయంలో 70 శాతం వరకు ఇచ్చే పరిస్థితి వుండేది. కానీ రాను రాను ఆ పరిస్థితి మారుతోంది. క్రేజీ ప్రాజెక్ట్ లు, భారీ కాంబినేషన్ల సంగతి అలా వుంచితే, మిగిలిన సినిమాలు అంటే దాదాపు ఏడాదికి 100 సినిమాలకు పైగా ఓటీటీ సంస్థ ల నుంచి సరైన మొత్తాలు అందుకోవడం లేదు.

ఓటీటీ సంస్థలు మిడ్ రేంజ్, బీలో మిడ్ రేంజ్ సినిమాలకు నిర్మాణ వ్యయంలో ముఫై శాతం దగ్గర నుంచి బేరాల ప్రారంభిస్తున్నాయి. అంటే 15 కోట్లు ఖర్చయితే నాలుగు కోట్ల దగ్గర నుంచి, అక్కడ నుంచి మహా అయితే మరో అయిదు, పదిశాతం పెంచుతున్నాయి. అది కూడా హీరో, డైరక్టర్, బ్యానర్ వీటన్నింటిని చూసి. మరీ తప్పక అయితే 50 శాతం వరకు వెళ్తున్నాయి. అలా వెళ్లారు అంటే చాలా అంటే చాలా లక్ అనే చెప్పాలి.

భారీ క్రేజీ ప్రాజెక్ట్ లు అయితేనే 60 నుంచి 70 శాతం వరకు అఫర్ చేస్తున్నాయి. ఇదిలా వుంటే ఓటీటీ కొనుగోళ్ల సంగతి అలా వుంటే శాటిలైట్ కొనుగోళ్లు దాదాపు జీరో అయిపోయాయి. మహా మహా పెద్ద సినిమాలకు కూడా శాటిలైట్ అమ్మకాలు జరగడం లేదు. టాప్ రేంజ్ పాన్ ఇండియా సినిమా అయినా అదే పరిస్థితి.

ఓటీటీ, శాటిలైట్ ఇలా వుంటే థియేటర్ అమ్మకాలు కూడా నానాటికీ తగ్గుతున్నాయి. పెద్ద సినిమాలను పక్కన పెడితే మిడ్ రేంజ్ సినిమాలు ఎపి లో 10 కోట్ల మేరకు జరగడం అంటే అద్భుతమే. అయిదు నుంచి ఏడు కోట్ల రేంజ్ దగ్గర ఆగిపోతున్నాయి. పైగా చాలా సినిమాలకు అదీ రావడం లేదు. కేవలం పంపిణీ కే తీసుకుంటున్నారు.

అంటే మిడ్ రేంజ్, బిలో మిడ్ రేంజ్ సినిమాలు పూర్తయిన తరువాత ఓ ముఫై శాతం ఓటిటి నుంచి వస్తోంది. ఓ పదో, ఇరవై శాతమో హిందీ డబ్బింగ్ నుంచి వస్తోంది. మిగిలినది మాత్రం దైవాధీనం అయిపోయింది. బయ్యర్లు అడ్వాన్స్ లు ఇవ్వడం వరకు ముందుకు వస్తున్నారు. అది కూడా బ్యానర్ కంటిన్యూగా సినిమాలు తీస్తుంది అనే నమ్మకం వుంటే. లేదంటే అదీ లేదు.

ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి ఇలా వుంది.. 2025లో మారుతుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. కొత్త ఓటీటీ సంస్థలు వస్తాయి. పోటీ పెరుగుతుంది.. అప్పుడు బాగుంటుంది అని అంటున్నారు. చూడాలి ఎలా వుంటుందో?

9 Replies to “‘కొనుగోళ్లు’ తగ్గుతున్నాయి”

Comments are closed.