జనాభా పెంచే పనిలో చంద్రబాబు ఫస్ట్ స్టెప్!

దేశంలో జనాభా పెంచేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలకమైన ఒక ముందడుగు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి ఇద్దరు పిల్లలు ఉండేవారు మాత్రమే అర్హులు అనే నిబంధనను ఆయన తొలగించారు. ఆ నిబంధనను…

దేశంలో జనాభా పెంచేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలకమైన ఒక ముందడుగు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి ఇద్దరు పిల్లలు ఉండేవారు మాత్రమే అర్హులు అనే నిబంధనను ఆయన తొలగించారు. ఆ నిబంధనను ఎత్తివేస్తూ చట్టసవరణ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది.

నిజానికి ఇది కొత్త సంగతి కాదు. చంద్రబాబునాయుడు చాలాకాలంగా ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సిన అవసరం ఉందని యువతకు ఉద్బోధిస్తున్నారు. ఇలాంటి చట్టసవరణ చేస్తామని ఎన్నికలకు ముందే చెప్పారు. ఇప్పుడు చట్టసవరణ జరిగింది.

కుటుంబ నియంత్రణ అనే వ్యవహారాన్ని మొన్నమొన్నటిదాకా గవర్నమెంటు ప్రమోట్ చేస్తూ వచ్చింది. దేశ జనాభా విపరీతంగా పెరుగుతూ పోతున్న నేపథ్యంలో ఇద్దరు పిల్లలు చాలు అంటూ ప్రభుత్వం ప్రచార ఉద్యమాలనే నడిపింది. అలాగే.. ఇద్దరు పిల్లలకు పరిమితం అయ్యేలా ప్రోత్సహించడానికి రాజకీయ నిర్ణయాలు కూడా తీసుకున్నారు. 1994లో ఇద్దరి కంటె ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులు అని చట్టం తెచ్చారు.

నిజం చెప్పాలంటే మారుతున్న కాల మాన పరిస్థితుల్లో ఇప్పుడు చిన్న కుటుంబాలను ప్రమోట్ చేయాల్సిన అవసరం లేకుండాపోయింది. యువతరం మొత్తం చిన్న కుటుంబాలనే ఇష్టపడుతున్నారు. ఇద్దరు పిల్లలు కాదు కదా.. ఒక్కరు చాలు అనుకుంటున్న వారే ఎక్కువ. లక్షలకు లక్షలు జీతాలు ఆర్జిస్తున్న యువదంపతులు కూడా రకరకాల కారణాల వల్ల.. ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకుంటున్నారు.

ఇదివరకటి లాగా ఉమ్మడి కుటుంబాలు లేకుండా, మైక్రో ఫ్యామిలీలు పెరగడం, యువత ఉపాధి ఉద్యోగ అవకాశాల పేరిట విస్తృతంగా ఇతర ప్రాంతాల్లో స్థిరపడుతుండడం.. అలాగే దంపతులు ఇద్దరూ ఉద్యోగులుగా ఉంటే తప్ప కుటుంబం నడవలేని ఆర్థిక వ్యయం పెరగడం ఇత్యాది కారణాల వల్ల.. అందరూ ఒక్కబిడ్డనే ప్రిఫర్ చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో.. చంద్రబాబునాయుడు మళ్లీ పెద్ద కుటుంబాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇద్దరికంటె ఎక్కువ మందిని.. దండిగా పిల్లల్ని కనాలని అంటున్నారు. దేశంలో యువ వనరులు తగ్గిపోతున్నాయని, వృద్ధుల సంఖ్య పెరుగుతోందని ఆయన అంటున్నారు. అయితే.. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం.. స్థానిక సంస్థల ప్రతినిధుల అర్హతల విషయంలో ఈ చట్టసవరణ.. హిందువుల సంఖ్య తగ్గిపోతున్నదని, పెరగాల్సిన అవసరం ఉన్నదని వాదించే భారతీయ జనతా పార్టీ భావజాలానికి దగ్గరగా ఉండడం గమనార్హం.

6 Replies to “జనాభా పెంచే పనిలో చంద్రబాబు ఫస్ట్ స్టెప్!”

  1. Also CM CBN has to find out new method like …. How to increase the land – earth for feeding food to growing population.

    Just in the name of development ‘every month lakhs of hectares of land being converted from agricultural to residential’.

    is this the development ?

    so called CM should be sensible in saying let us increase the population

  2. ఇండియా దేశ జనాభా 1947 లో ౩0 కోట్లు. ఈరోజు 140 కోట్లు. జనాభా పెరగడం వలన భారత దేశం ఒక కార్మికుల నిలయం ఇతర దేశాల వాళ్ళకి స్వర్గధామం అయింది. దేశ పేదరికం స్వతంత్రతం రాక ముందు ఎంత ఉందొ ఇప్పుడు అంత కన్నా ఎక్కువ ఉంది. జనాభ పెరుగుదల వలన జాతీయ భావము తగ్గి ప్రాంతీయత వర్గ కుల మత వైషమ్యాలు ఎక్కువ అయ్యాయి. ప్రభుత్వాలు జనాభా కు సరిపడే లా విద్య వైద్య సదుపాయాలు సరిపడేలా చేయలేక పోతుంది. నారా సీబీన్ లాంటి వాళ్ళు జనాభా పెంచమనడం సహేతుకం కాదు

Comments are closed.