ఆర్ఆర్ఆర్: పదవి దక్కినా ఆ ముచ్చట తీరదేమో!

రఘురామ కృష్ణంరాజు .. ఏపీ శాసనసభకు ఉప సభాపతిగా బాధ్యతలు స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు సభాపతి స్థానంలో ఉండాలని ఆశపడ్డారు. ఆయన ఉండి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే..…

రఘురామ కృష్ణంరాజు .. ఏపీ శాసనసభకు ఉప సభాపతిగా బాధ్యతలు స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు సభాపతి స్థానంలో ఉండాలని ఆశపడ్డారు. ఆయన ఉండి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే.. తనను అధ్యక్ష స్థానంలో చూడాలని తన అభిమానులు కోరుకుంటున్నారంటూ అభిలాషను బహిరంగంగానే వెల్లడించారు.

సభాపతి స్థానంలో ఉంటే.. ఆయన శత్రువుగా పరిగణించే.. గత అయిదేళ్లపాటు నిత్యం దూషిస్తూ గడిపిన జగన్మోహన్ రెడ్డిని ఆ స్థానం నుంచి శాసించవచ్చునని బహుశా ఆశపడి ఉంటారు. ఇప్పుడు ఆయనకు పదవి దక్కింది గానీ.. ముచ్చట మాత్రం తీరలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే తప్ప శాసనసభకు రానని తేల్చేయడంతో.. రఘురామ కృష్ణంరాజు అవకాశం మిస్సయ్యారని అనుకోవాలి.

నిజానికి రఘురామ కృష్ణంరాజు సభాపతి స్థానాన్నే కోరుకున్నారు గానీ.. చివరికి ఉపసభాపతి స్థానం దక్కింది. ఎన్నికలకు ముందు.. ఆయన కాలయాపన చేయకుండా ఉండి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేదేమో. అప్పట్లో ఆయన మళ్లీ నరసాపురం ఎంపీగానే నెగ్గాలని కలగన్నారు. మూడు పార్టీల మధ్య పొత్తులు కూడా కుదరక ముందే.. తాను తిరిగి నరసాపురం ఎంపీగా పోటీచేయడం గ్యారంటీ అని.. ఏ పార్టీ తరఫున పోటీచేసేది తర్వాత చెప్తానని ఆయన అంటూ వచ్చారు.

భాజపా, జనసేన, తెలుగుదేశం ఏ పార్టీలోనైనా తనకు రెడ్ కార్పెట్ ఎంట్రీ ఉంటుందని.. అలాగే తాను అడిగితే నరసాపురం ఎంపీ సీటు ఇవ్వకుండా కాదనేవారు ఉండరని ఆయన భ్రమ పడ్డారు. అనుకున్నట్టే పొత్తుల్లో నరసాపురం భాజపాకు వెళ్లింది. భాజపాలో చేరాలని ప్రయత్నించారు గానీ.. వారు అవకాశం ఇవ్వలేదు. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకున్న కార్యకర్త శ్రీనివాసవర్మకు ఎంపీ టికెట్ ఇచ్చారు. రఘురామ కృష్ణంరాజు కు మరో అవకాశం లేకుండాపోయింది.

అప్పటికీ చంద్రబాబునాయుడు ఆయన కోసం చాలా పైరవీలు చేశారు. నరసాపురం ఎంపీ స్థానం తెలుగుదేశానికి ఇస్తే.. రెండు ఎమ్మెల్యే స్థానాలు బిజెపికి ఇస్తాం అంటూ బేరం పెట్టారు. అయితే బిజెపి స్థిరంగా నో చెప్పింది. చివరికి ఉండికి అప్పటికే ప్రకటించిన సిటింగ్ ఎమ్మెల్యేకు నచ్చజెప్పి.. చంద్రబాబునాయుడు ఆ సీటును రఘురామ కృష్ణంరాజుకు ఇచ్చారు. అంత చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన వ్యక్తే అయినప్పటికీ.. ఆయనకు ఇప్పుడు ఉపసభాపతి పదవి కూడా ఇచ్చారంటే.. చంద్రబాబు- రఘురామ కృష్ణంరాజును నెత్తినపెట్టుకున్నట్టే లెక్క!

3 Replies to “ఆర్ఆర్ఆర్: పదవి దక్కినా ఆ ముచ్చట తీరదేమో!”

  1. ఆయన ముచ్చటేంటో నీతో ముచ్చటించాడా ఎంకటి..

    .

    మన ప్రియతమ నాయకుడు Mr. లె..1 ని అసెంబ్లీ గేట్ టచ్ చెయ్యకూడదు అని ముచ్చటపడ్డాడేమో..అదే అయితే ముచ్చట తీరినట్టేగా..

Comments are closed.