ఆర్ కృష్ణయ్య టీడీపికి దగ్గరవుతున్నారా?

జగన్మోహన్ రెడ్డి తన అనాలోచిత పరిపాలన విధానాలు, నిర్ణయాలతో అనుచితంగా పదవులు కట్టబెట్టిన వారిలో బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్ కూడా ఒకరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంఘాల నాయకులే లేనట్టుగా.. వైఎస్సార్…

జగన్మోహన్ రెడ్డి తన అనాలోచిత పరిపాలన విధానాలు, నిర్ణయాలతో అనుచితంగా పదవులు కట్టబెట్టిన వారిలో బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్ కూడా ఒకరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంఘాల నాయకులే లేనట్టుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బీసీ వర్గాల్లో ప్రముఖ నాయకులకు గతి లేనట్టుగా తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ఆర్ కృష్ణయ్య ను తీసుకువచ్చి ఏపీ నుంచి తమ పార్టీ తరఫున రాజ్యసభకు పంపారు.

ఆ సందర్భంలో జగన్ ను అనల్పంగా కీర్తించిన ఆర్ కృష్ణయ్య ఇప్పుడు తెలుగుదేశానికి దగ్గరయ్యే ప్లాన్ తో ఉన్నారా? అని అనిపిస్తోంది. ఒకప్పట్లో తెలుగుదేశం నాయకుడిగానే ఉన్న ఆర్ కృష్ణయ్యకు ఇప్పుడు, ఆ పార్టీలో ఎంట్రీ దొరక్కపోతే గనుక.. వారి ప్రాపకంతో బిజెపిలోకి వెళ్లవచ్చునని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆర్ కృష్ణయ్య ఒకప్పట్లో కేవలం కుల సంఘాల పోరాటాల వరకు పరిమితమై ఉండేవారు. బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా ఒక రాజకీయ పార్టీ స్థాపించాలని కూడా కలలు కన్నారు. చివరికి తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత.. 2014లో రెండు తెలుగురాష్ట్రాలకు తొలిసారిగా ఎన్నికలు జరిగినప్పుడు.. ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రొజెక్టు చేస్తూ తెలుగుదేశం ఎన్నికలకు వెళ్లింది. తద్వారా తాము బీసీలకు పెద్దపీట వేస్తున్నట్టుగా ప్రచారం చేసుకోవడానికి తెలుగుదేశం ప్రయత్నించింది.

నిజానికి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం విజయావకాశాలు చాలా ఘోరమైన పరిస్థితి. అప్పటికే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతం.. ఆ పార్టీకి గరిష్టంగా చేటు చేసి ఉంది. ఎటొచ్చీ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు గనుక.. ఆర్ కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రొజెక్టు చేశారనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది.

ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్ కృష్ణయ్య తెలుగుదేశం కుట్రను అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పార్టీకి దూరం జరిగారు. కేవలం కుల సంఘాల నాయకత్వానికి పరిమితం అయి ఉండిపోయారు. అలాంటి ఆర్ కృష్ణయ్యను జగన్ ప్రత్యేకంగా తెలంగాణ నుంచి దిగుమతి చేసుకుని రాజ్యసభ సభ్యత్వం కట్టబెడితే.. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓడిపోగానే.. ఆయన రాజీనామా చేసేశారు. తద్వారా జగన్ చేసిన మేలును తృణీకరించి జగన్ మీద విమర్శలు కురిపించారు.
ఆయన భాజపా లో చేరే అవకాశం ఉన్నదని అప్పట్లో ప్రచారం జరిగింది. తీరా ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో చేరుతారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

తాజాగా జాతీయ బీసీ సంక్షేమ సంగానికి అధ్యక్షుడు అయిన ఆర్ కృష్ణయ్య.. ఆ సంఘం ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వై నాగేశ్వరరావును నియమించారు. ఆయన తెలుగుదేశం అనుకూలుడిగా పేరుంది. వై నాగేశ్వరరావును తెలుగుదేశం బీసీ నాయకులు టీడీ జనార్దన్, బీద రవిచంద్ర, నూకసాని బాలాజీ తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ నియామకం ద్వారా ఆర్ కృష్ణయ్య తెలుగుదేశానికి మళ్లీ దగ్గరవడానికి, లేదా, వారి ద్వారా జాతీయ రాజకీయాల్లోనే ఉండేలా భాజపాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

19 Replies to “ఆర్ కృష్ణయ్య టీడీపికి దగ్గరవుతున్నారా?”

  1. అదేంటి వెంకట్ రెడ్డి…

    ఈ ఆర్ కృష్ణయ్య కి వైసీపీ లో ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు..

    జగన్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ అన్నావు..

    ప్రతిపక్షాలకు వణుకు పుట్టించాడు అన్నావు..

    చంద్రబాబు కి మైండ్ బ్లాక్క్ అన్నావు..

    టీడీపీ కి దిమ్మ తిరిగిపోయింది అన్నావు..

    బీసీ కులాలందరూ జగన్ వెంటే అన్నావు..

    ఈ దెబ్బతో బీసీ ప్రజలందరూ జగన్ రెడ్డి ని ఆకాశానికెత్తేస్తారు అన్నావు..

    ఇప్పుడేమో.. జగన్ రెడ్డి ఒక తెలివితక్కువ దద్దమ్మ అంటూ.. కూరలో కరివేపాకులా తీసిపడేశావు..

    Dare to Write అని చెప్పుకొంటావు.. బుర్రలో చెమ్చాడంత కూడా విషయం ఉండదు.. పనికిమాలినోడా..!

    1. వైఎస్p నుండి వచ్చినోలు గనుక టీడీపీ లో యాక్సెప్ట్ చేస్తే. ఇక అంతే సంగతులు

    2. ప్లీజ్, మా ఎంకటి ని ఏమి అనకండి, అసలే ఆయన ఏ పార్టీ కి కొమ్ము కాయట్లేదు, జస్ట్ నిన్నటినుంచి..

  2. తెలుగుదేశం కృష్ణయ్య కి సీట్ ఇస్తే అది కుట్ర… అదే అన్నియ ఇస్తే గొప్ప మనసు.. లోక కళ్యాణం

    1. ఎవరు ఎవరికైన.. ఇచ్చుకోవచ్చు సీటు. కానీ.. అనర్హులకు.. ఇచ్చారనేదే ఇక్కడ విషయం. ఎవరు దొరకనట్టు.. తెలంగాణ వాడు అని కూడా చూడకుండా… ఆంధ్ర లో ఎవరు లేనట్టు రాజ్యసభ ఇస్తే.. టర్మ్ పూర్తి గా ఉండకుండా వైసీపీ ప్రభుత్వం ఓడిపోగానే.. విమర్శలు చేసి.. రాజినామా చేసేసిన అవకాశవాదికి ఇచ్చారు అన్నదే.. ఇక్కడ విషయం. అదేదో పార్టీ కి లాయల్ గా ఉన్నవాడికి ప్రజలకు మంచి చేస్తాడు అన్నవాడికి కులం చూడకుండా ఇవ్వాల్సింది.

  3. జగన్ సీట్ ఇస్తే మంచితనం – అదే టీడీపీ సీట్ ఇస్తే కుట్ర ..??

    వ్వాహ్ ఏమన్నా లాజిక్ ఆహ్

  4. ఇల్లాంటి రాతలెందుకు..ఎవ్వరిని ఉద్దరిస్తాయి…ముద్రగడని కూడా ఇలానే పక్కకి నెట్టేసేరు..

  5. మాకులపోడు చాల్లే అని జనాలు అనుకున్నతవరకు బీసీ లు కు అవి తక్కువ ఇవి తక్కువ అని మీడియా లో వచ్చి ఎ పార్టీ పదవి ఇచ్చిన పోతారు ఇలాంటి నాయకులు. బీసీ సంక్షేమం బీసీ లే చేయ్యాల.

Comments are closed.