పోలీసులతో నడవదు.. కోర్టుల్ని ఆశ్రయించాలి!

తెలుగుదేశం, జనసేన నాయకుల మీద వారి కుటుంబసభ్యుల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తల మీద ఇప్పుడు విచ్చలవిడిగా కేసులు నమోదు అవుతున్నాయి. తప్పు చేసిన వారికి శిక్షలు పడడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం…

తెలుగుదేశం, జనసేన నాయకుల మీద వారి కుటుంబసభ్యుల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తల మీద ఇప్పుడు విచ్చలవిడిగా కేసులు నమోదు అవుతున్నాయి. తప్పు చేసిన వారికి శిక్షలు పడడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. తప్పుడు పోస్టులు పెట్టే వారి మీద ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి. శిక్షల ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని అనుకుంటే శిక్షలు ఉండాలి. ఇందులో భిన్నాభిప్రాయం ఏమీ లేదు.

కానీ.. కేసులు గానీ శిక్షలు గానీ అన్నీ ఒక పార్టీ వారి మీద మాత్రమే నమోదు అవుతూ ఉండడం మాత్రం సామాన్యులు తటస్థులు జీర్ణం చేసుకోలేని సంగతి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఇలాగే జరిగింది.

అప్పట్లోనూ వైసీపీ నేతల మీద పోస్టులు పెట్టేవారిని అరెస్టు చేశారు. తెలుగుదేశం నాయకుల మీద పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు కూడా చేయలేదు. అయితే వైసీపీ ఎలాంటి పోకడలు అనుసరించిందో.. అదే మాదిరి విధానాలను తెలుగుదేశం కూడా అనుసరించదలచుకుంటున్నదా? అలాంటి విధానాలను అనుసరించబట్టే కదా.. వైసీపీని ప్రజలు తిరస్కరించారు? ఆ సంగతిని ఎన్డీయే కూటమి ప్రభుత్వం గుర్తించలేకపోతున్నదా? అనేది ఒక మీమాంస.

అయితే వైసీపీ నాయకులకు సంబంధించిన వారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యమైన పోస్టులు కూడా వెల్లువలా వస్తున్నాయి. వాటి మీద ఆయా నాయకులు ఫిర్యాదులు చేసినా పెద్ద స్పందన ఉండడం లేదని వాపోతున్నారు. పోలీసులు అధికార పార్టీకి లాయల్గ్ గా ఉంటారు గనుక తమ ఫిర్యాదుల్ని పట్టించుకోవడం లేదంటున్నారు. ఇది నిజమే కావొచ్చు.

పోలీసుల అధికార పార్టీ లాయల్టీని మార్చి.. నిష్పాక్షికంగా తయారుచేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. కానీ ఒకరికి అన్యాయం జరిగినప్పుడు మొరపెట్టుకోవడానికి, న్యాయం కోరడానికి ఈ దేశంలో పోలీసులు మాత్రమే సర్వోత్కృష్టమైన వ్యవస్థ కాదు. పోలీసులు వారి బాధలను పట్టించుకోనప్పుడు కోర్టులను ఆశ్రయించడానికి అవకాశం ఉంది.

పోలీసులు కేసు నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయించి నమోదు అయ్యేలా చూడవచ్చు. అలాగే.. పోలీసులు కేసు విచారణ ఆలస్యం చేసినా కూడా కోర్టు ద్వారా వారిని నిలదీయవచ్చు. ఒకే తరహా కేసులు వైసీపీ వారి మీద పెడితే ఎందుకు వెంటవెంటనే అరెస్టులు జరుగుతున్నాయో.. అవే తరహా కేసులు తెదేపా వారి మీద పెడితే ఎందుకు నత్తనడకన నడుస్తున్నాయో.. కోర్టు ద్వారా పోలీసు యంత్రాంగాన్ని నిలదీయవచ్చు. అప్పుడు వైసీపీ వారి వాదనలకు బలం కూడా పెరుగుతుంది.

అంతే తప్ప.. ఎంతసేపూ ప్రభుత్వాన్ని పోలీసుల్ని నిందిస్తూ ప్రెస్ మీట్లు పెట్టడం వలన ఉపయోగం ఉండదు. అసభ్య పోస్టులు ఆగవు.. అని విశ్లేషకులు భావిస్తున్నారు.

31 Replies to “పోలీసులతో నడవదు.. కోర్టుల్ని ఆశ్రయించాలి!”

  1. టీడీపీ 40 ఏళ్ల నుండి ఉన్నది. Sociall mediaa అనేది Orkutt రోజుల నుండీ ఉన్నది. మరి ఈ అసభ్య దూషణలు ఎప్పటి నుండి మొదలయ్యాయి?

  2. ఓరి కొండెర్రిపప్పా..

    కోర్టుల్లో జడ్జీలను, లాయర్లను కూడా వదలలేదు నీ జగన్ రెడ్డి సోషల్ మీడియా కుక్కలు.. వాళ్ళకే దిక్కు తోచక పోలీసులకు మొర పెట్టుకొన్నారు..

    అప్పట్లో పదుల సంఖ్యలో సిబిఐ కేసులు తెరుచుకున్నాయి.. నీ జగన్ రెడ్డి అన్నిటినీ మేనేజ్ చేసి మూసేసాడు.. ఏ కే సు ఏమైందో కోర్ట్ లో జడ్జీలకే తెలీదు..

    ఇప్పుడు మీరు వెళ్లి జడ్జీలకు చెప్పుకొంటారా… వెళ్ళండి.. తెరుచుక్కూర్చున్నారు నీ జగన్ రెడ్డి కోసం..

    రెండు రోజుల క్రితమే చెప్పిందిగా హైకోర్టు .. తప్పు చేస్తే అరెస్ట్ చేయడం లో తెప్పేముంది అంటూ పిల్ కొట్టేసింది..

    …..

    వెళ్ళండి.. “అమరావతి” లో కోర్ట్ మెట్లు శుభ్రంగా కడిగి.. దేహి అంటూ ప్రాధేయపడండి.. ప్రాణ బిక్ష పెట్టమని వేడుకోండి.. మాకు న్యాయం చేయండి అని గట్టిగా అరవండి..

    అప్పుడు జడ్జీలు చెపుతారు..

    “NO” అని…

  3. తటస్థులు అంటే నీ లెక్కలో జర్నలిస్ట్ సాయి, తెలకపల్లి, ప్రో. నాగేశ్వర్, ఉండవల్లి, వర్రా’s భార్య, బోరుగడ్డ’s భార్య ?

    1. కళ్ళు కులం తో కమ్ముకుపోయి నీకు కనపడటం లేదు.. వెళ్లి మొహం కడుక్కుని కళ్ళు రుద్దుకొని చూడు.. ఎవరికీ కారుతుందో

  4. Present situation in AP seems like “1975 Indira Gandhi Emergency ruling” on 40% of AP population who have voted YSRCP.

    Sri Modiji and courts has to look into the issue and bring back the normal situation in AP

    1. మన జగన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు.. ఈ జడ్జీలను దుర్భాషలాడి దూషించిన సిబిఐ కేసులన్నీ ఏమైపోయాయి..

      ఎమర్జెన్సీ రూలింగ్ మన జగన్ రెడ్డి ప్రభుత్వం లో ఉన్నప్పుడే మొదలయింది.. ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ నుండి బయట పడుతున్నాము..

      మీరు కూల్ గా ఉండండి.. జగన్ రెడ్డి పెంచి పోషించిన విష వృక్షాన్ని కూకటివేళ్లతో పెకలిస్తారు..

    2. You remeber these lyrics??

      మన జోలికొస్తే బ్రదరు మంటెత్తి పోద్ది వెధరు మన చేతి దెబ్బ తిని పడుకున్నోళ్ళు మల్లి లేగరు మంచోడని గిల్ల గలరు అహేయ్ చెడ్డోడ్ని గిచ్చ గలరు ఏ లెక్కకందని నాలాంటోడ్ని గెలికేదెవరు.. perfecy situation in AP right now

  5. ఒరేయ్ గూట్లే…ఆలా కోర్ట్ ని విజయ్ బాబు అనే డమ్మీ తో ఆస్టరాయిస్తేనే గా, కోర్ట్ దొబ్బేయమంది

  6. కోర్టు లు కేసు కొట్టేకుండా స్వీకరించటానికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అప్పుడు తెలుస్తుంది

  7. కోర్ట్ లో అయితే ఎంచక్కా జగన్ రెడ్డి ఆర్థిక నేరాలు చేసి 13 ఏళ్ళు గా వాయిదాలు వేసుకుంటూ గడుపుతున్నట్టు ఆలా ఆలా కాలం గడపొచ్చు నీలి కార్యకర్తలు ..

  8. కష్టం…కోర్టుల్లో/మీడియాలలో కేవలం జగన్ మీద కనబడిన విద్వేషం మరెవ్వరిమీద కనబడలేదు. .అతడి మీద వ్యక్తిగతంగా నష్టాలని ఆపడం దాదాపు అసాధ్యం

  9. హైదరాబాద్ లో తెలంగాణ సారస్వత పరిషద్ లో లో ఒక మహిళ, లెక్చరర్ గ నకిలీదళిత పత్రాలతో నియామకం అయ్యింది. లో కుటుంబసభ్యులే ఫిర్యాదు చేసిన తర్వాత కలెక్టర్ గారు దర్యాప్తు చేసి,

    పట్టుకుని, తొలగించారు. కానీ వెంటనే న్యాయవాదిని కలిసి, జడ్జీకి లంచాలు ఇచ్చి ఆమె సహజన్యాయమని స్టే పొందారు. కలెక్టర్ ను పునఃనియామకం చేయమని కోర్టుధిక్కార ఆదేశాలు జారీ చేసారు. తండ్రిపేరుతో తీసుకున్న దళిత పత్రాలు నకిలీ అని నిర్ధారింఛాక, కొత్తగా చనిపోయిన తల్లికి దళిత ఇంటిపేరుండేది అని న్యాయవాది కల్పిత కథతో, దొంగ బంధువులను ప్రవేశపెట్టి, వాయిదాలు, నాటకాలు వేయిస్తూనే ఉన్నాడు. కోర్టులో అటువంటి దిక్కుమాలిన తెలివితేటలున్న వాడిని ఎవ్వడూ ఆపలేడు. హైదరాబాద్ హై కోర్టులో ఏ జడ్జీలకు న్యాయవాదిపై అనుమానం రాలేదు. ఇప్పటిదాకా ఎవ్వరూ కుటుంబ సభ్యులను పిలవ. లేదు.ఇంట్లో అత్తగారిని, సవతి కూతురిని, మరిదిని బెదిరించి ఆత్మహత్యలకు పురిగొలిపి చంపేశారు. పదిహేనేళ్ళు గడిచిపోయాయి. పోలీసులకు, జడ్జీలకు లంచాలు వస్తే చాలు. ఎవడెలా ఛస్తే మనకెందుకు? ఇదీ నిత్యసంబరమే

Comments are closed.