చాలామంది హీరోయిన్లకు డేటింగ్స్ కామన్. ఎంత సీక్రెట్ గా ప్రేమించుకుంటారో, అంతే ఆర్బాటంగా పెళ్లి కూడా చేసుకుంటారు. అయితే పెళ్లికి దూరంగా ఉండే హీరోయిన్ల జాబితా కూడా ఉంది. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా చేరింది.
“నేను నా జీవితంలో పెళ్లి చేసుకోను. ఇదేదో ఎమోషనల్ గా తీసుకున్న నిర్ణయం కాదు, బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. నాకు తెలిసిన చాలా జంటల్ని చూశాను. ఒక జంట తప్ప, మిగతావాళ్లంతా రాజీ పడుతున్నారు. ఈ పెళ్లిళ్ల వల్ల చాలామంది వ్యక్తిగతంగా ఎదగలేకపోవడం కూడా నేను చూశాను. అందుకే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను.”
నిజానికి పాతికేళ్ల వయసు వరకు పెళ్లి గురించి చాలా కలలు కనిందంట ఐశ్వర్య లక్ష్మి. గురువాయూర్ గుడిలో ఎన్నో పెళ్లిళ్లు చూశానని, అవి చూసినప్పుడల్లా తను కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని, కానీ పెద్దయిన తర్వాత పెళ్లి అసలు రూపం తనకు తెలిసొచ్చిందని అంటోంది.
“కొన్నేళ్ల కిందటి వరకు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఒక టైమ్ లో మ్యాట్రిమోని సైట్ లో నా సొంత డబ్బులతో ప్రొఫైల్ కూడా పెట్టాను. కాకపోతే అది చూసి చాలామంది ఫేక్ ప్రొఫైల్ అనుకున్నారు. ఆ తర్వాత పెళ్లిపై నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది”
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు 34 ఏళ్లు. తనకు 29 ఏళ్లకే పెళ్లిపై క్లారిటీ వచ్చేసిందని చెబుతోంది ఐశ్వర్య లక్ష్మి. పెళ్లి విషయంలో ఇక తనను ఎవ్వరూ ప్రభావితం చేయలేరని కూడా అంటోంది. ప్రస్తుతం తెలుగులో సాయిదుర్గతేజ్ సరసన ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఐశ్వర్య లక్ష్మి.
Good decision!
vc available 9380537747
Ok madam
ఇవుడు ఏ ఆడపిల్ల పెళ్ళి చేసుకుంటోంది కనుక. జాబ్ వచ్చేవరకు ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు తలూపడం…ఆ తర్వాత అమ్మాయి జీతం చూసి అమ్మా నాన్నా తలూపడం..ఇదే కథ.
vc available 9380537747