వామ్మో ఈ స్థాయిలో పెంచుతున్నారా?

పెద్ద సినిమా వస్తుందంటే, థియేటర్లలో టికెట్ రేట్లు సవరించడం కామన్. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ప్రత్యేక అనుమతులు తెచ్చుకొని మరీ టికెట్ రేట్లు, షోలు పెంచుకుంటారు నిర్మాతలు. అయితే పుష్ప-2 విషయంలో మాత్రం…

పెద్ద సినిమా వస్తుందంటే, థియేటర్లలో టికెట్ రేట్లు సవరించడం కామన్. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ప్రత్యేక అనుమతులు తెచ్చుకొని మరీ టికెట్ రేట్లు, షోలు పెంచుకుంటారు నిర్మాతలు. అయితే పుష్ప-2 విషయంలో మాత్రం అంతకుమించి అన్నట్టు సాగుతోందంట వ్యవహారం.

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు నామమాత్రంగా పెరిగాయి. ప్రస్తుత ప్రభుత్వంలో ఇంకాస్త ఎక్కువ పెంపు ఇచ్చారు. కల్కి సినిమా నుంచి అది మొదలైంది. దాదాపు అవే రేట్లు అటుఇటుగా ప్రతి సినిమాకు అనువర్తింపజేస్తున్నారు. పుష్ప-2 విషయంలో మాత్రం ఈసారి రూల్స్ ను మరింత సడలించబోతున్నట్టు తెలుస్తోంది. అదెలా అంటే..

ఏపీలో సింగిల్ స్క్రీన్స్ లో సాధారణ రోజుల్లో టికెట్ ధరలు 120 నుంచి 150 రూపాయల మధ్య ఉన్నాయి. పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచినప్పుడు ఈ రేట్లు 175-210 రూపాయల వరకు ఎగబాకిన సందర్భాలున్నాయి. ఇప్పుడు పుష్ప-2 కోసం ఈ రేట్లను అమాంతం 300 రూపాయలకు పెంచబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.

సింగిల్ స్క్రీన్ కే ఈ రేటు అంటే, ఇక మల్టీప్లెక్సుల్లో పుష్ప-2 టికెట్ రేటు కనీసం 400 చేస్తారేమో. సినిమాలో బన్నీ ఎలాగైతే తగ్గేదేలే అంటూ డైలాగ్ చెప్పాడే, టికెట్ రేట్ల విషయంలో నిర్మాతలు కూడా అదే విధంగా వ్యవహరించబోతున్నారంటూ కథనాలు వస్తున్నాయి.

ఇక ఏపీలోనే పరిస్థితి ఇలా ఉంటే, తెలంగాణ సంగతి చెప్పనక్కర్లేదు. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలు మాత్రమే. వెయ్యి కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే, ఈ మాత్రం రేట్లు ఉండాలంటున్నారు కొంతమంది. కానీ ఈ స్థాయిలో పెంపు ఉండకపోవచ్చనేది చాలామంది అభిప్రాయం. ఎంతలా ప్రభుత్వ పెద్దలతో పరిచయాలున్నప్పటికీ, ఈ స్థాయిలో పెంపు సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

19 Replies to “వామ్మో ఈ స్థాయిలో పెంచుతున్నారా?”

    1. మాన ga కి స్మగ్లర్స్, బ్రాకెట్ గాళ్ళు, లక్షల కోట్ల అవినీతిపరులు, గొడ్డలి పోటుగాళ్ళు అంటేనే బాగా ఇష్టం bro! 😜😜😜

    1. నీకు వెయ్యి రూపాయలు తక్కువలా కనిపిస్తుందేమో! కూలీ పని చేసే వాడిని అడుగు, ఆ వెయ్యి విలువేంటో చెప్పి, బోడి సినిమాలే అంటాడు.😡

  1. అదేంటి GA…. మన పార్టీ SUPPORT కూడా వుందిగా…ఇలా ఏడిస్తే దొరికిపోతారు GA….😂😂😂

    1. బలవంతపు సపోర్ట్ ఎక్కువ కాలం ఉండదు. బాలయ్య గారంటే ప్రత్యేక అభిమానం మన GA గారికి

  2. పెద్ద సినిమాలు అందరికి అందుబాటులో ఉండేలా జగన్ రెడ్డి తెచ్చిన 5 రూపాయల టికెట్ ధర పెట్టాలి అన్ని సినిమా థియేటర్ లలో అలాగే అన్ని లెవెల్స్ లోను ఒకే ధర అంటే 5 రూపాయల ధర ఉండాలి

    1. భా*ర*తి సిమెంట్ ధర కూడా బస్తాకి 100 చేస్తే బాగుంటుంది, మధ్య తరగతి దిగువ తరగతి వాళ్లకు మేలు జరుగుతుంది, అలా చేస్తే బాగుండేది జగన్ రెడ్డి

  3. evadi ishtam vachinattu vaadu penchukuntoo poyi maaku 500 cr vachay ani okadu, 1000 cr ani okadu…. ani dabbaalu, malla andulo fans kosam fake collections okati…. very very bad trend.. entha sepu fans ego ni satisfy cheyyatame pani ayipoyindi big heroes andariki

  4. మొదటి రోజు… మొదటి వారం.. సినిమా చూసి తీరాలి అనుకునే పిచ్చ జనం ఉన్నంతవరకు అలాగే పెంచుకుంటారు. ఏం… రేట్లు తగ్గాక చూస్తే కథ ఏమన్నా మారుతుందా? డాన్సులు ఫైట్స్. ఏమన్నా మారుతాయా? ఏంటో ఈ పిచ్చ జనం.. all non sense

Comments are closed.