విప్ కాదు మంత్రి కావాలి

విశాఖ జిల్లాలోని సీనియర్ శాసనసభ్యుడు గణబాబు ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు మంత్రి పదవి యోగం మాత్రం ఎందుకో దక్కడం లేదు. Advertisement బీసీ వర్గానికి చెందిన వారు. రాజకీయ కుటుంబానికి…

విశాఖ జిల్లాలోని సీనియర్ శాసనసభ్యుడు గణబాబు ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు మంత్రి పదవి యోగం మాత్రం ఎందుకో దక్కడం లేదు.

బీసీ వర్గానికి చెందిన వారు. రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆ కుటుంబం టీడీపీతో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం పెంచుకుని ఉంది.

విశాఖ జిల్లాలో గవర సామాజికవర్గం బలంగా ఉంటుంది. నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రభావం చూపించే ఆ సామాజిక వర్గానికి పదిహేనేళ్ళుగా మంత్రి పదవి దక్కడం లేదు. టీడీపీ రెండు సార్లు అధికారంలోకి వచ్చినా మినిస్టర్ యోగం లేదని అంటున్నారు.

గణబాబు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆయన 2014లో గెలిస్తే అపుడూ విప్ పదవినే ఇచ్చారు. 2024లో టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. అయినా విప్ పోస్టే దక్కింది.

దాంతో విప్ గా గణబాబు తన చాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన వేళ అభినందించడానికి వెళ్ళిన నియోజకవర్గం నేతలు ఆయనకు కంగ్రాట్స్ చెబుతూనే ఈసారి విప్ కాదు తొందరలోనే మంత్రి కావాలని కోరుకున్నారు.

గణబాబు మనసులోనూ ఇదే ఉందని అంటున్నారు. పార్టీలో విధేయతతో ఉంటున్న గణబాబుకు మంత్రి పదవి ఇవ్వడం సముచితమని అంటున్నారు. గణబాబు వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారని గుర్తు చేస్తున్నారు.

విప్ పదవి తమకు అంత సంతోషాన్ని ఇవ్వదని మంత్రి హోదా కావాలని బలమైన సామాజిక వర్గం నేతలు అంటున్నారు. విస్తరణలో అయినా గణబాబుకు అవకాశం వస్తుందని వారంతా ఆశిస్తున్నారు.

4 Replies to “విప్ కాదు మంత్రి కావాలి”

Comments are closed.