అమెరికా మాస్ డిపోర్టేషన్లో కష్టనష్టాలు

అమెరికానుంచి అక్రమ వలసదారుల్ని ఏరి వాళ్ల దేశాలకి పంపించేస్తానంటున్నాడు ట్రంప్!

అమెరికానుంచి అక్రమ వలసదారుల్ని ఏరి వాళ్ల దేశాలకి పంపించేస్తానంటున్నాడు ట్రంప్! చరిత్రలోనే కనీ వినీ ఎరుగనంతమందిని డిపోర్ట్ చేస్తానంటున్నాడు ట్రంప్.

ఇది వినడానికి ఒక సెన్సేషనల్ వార్త. అమెరికా పౌరులకి అనందమనిపించే వార్త.

మనవాళ్లల్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎలాగూ చాలా తక్కువే కాబట్టి, ఈ నిర్ణయం వల్ల భారతదేశీయులు, మరీ ముఖ్యంగా తెలుగువాళ్లు పెద్దేమీ ఇబ్బందిపడేది లేదు.

ఎటొచ్చీ ఈ నిర్ణయంలో కాస్త ముందు వెనుకలు గమనించాల్సిన పని ఉంది అంటున్నారు అమెరికాలో కొందరు విశ్లేషకులు. అవేవిటో చూద్దాం.

అసలు ఈ నిర్ణయాన్ని అమలుచేయడమే ఊహించనంత ఖర్చుతో కూడుకున్న పని. మిలిటరీని రంగంలోకి దించి, విజిల్ బ్లోయర్ల సాయంతో ఏరి వేత కార్యక్రమం మొదలు పెడతానంటున్నాడు. అలా ఏరివేతలో దొరికిన వారిని ముందు జైలులో పెడతారు. ఆ దేశీయులందరూ కనీసం ఒక విమానంలో పట్టేంతమంది దొరికేవరకు వాళ్లనలా ఉంచి పొషించాలి. ఆ తర్వాత విమానాలు ఏర్పాటు చేసి ఆయా దేశాలకి పంపాలి. ఇదంతా విపరీతమైన ఖర్చుతో కూడుకున్నపని అని అంటున్నవారున్నారు. అలా అంటున్నవాళ్లు డెమోక్రాట్స్ తప్ప ఇతరులెవరూ కారనేది మరొక వాదన.

అంతే కాదు..మెక్సికో, వెనెజులా తదితర దేశాలనుంచి వలసొచ్చిన ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అతి తక్కువ వేతనాలకు బ్లూ కాలర్ వర్క్స్ చేస్తున్నారు. కూలీపనులనుంచి, బాత్రూములు కడిగే ఉద్యోగాల వరకూ అన్నీ ఉన్నంతలో చవకలో అవుతున్నాయి. ఎందుకంటే వీళ్లు ఇల్లీగల్ గా అమెరికాలో ఉంటున్నవాళ్లు కాబట్టి ట్యాక్సులు కట్టక్కర్లేదు. కనుక అడిగేది తక్కువే ఉంటుంది. కాబట్టి, ఈ మాస్ డిపోర్టేషన్ వల్ల చవకగా పనులు చేసే వాళ్లు దొరకక అన్ని పనులలోనూ స్తబ్దత వస్తుందని, దాని ఎఫెక్ట్ ఎకానమీ మీద కూడా పడుతుందని అంటున్నారు. అమెరికాని కనీసం 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లే పని ట్రంప్ చేస్తున్నాడంటూ వాపోతున్న వర్గాలున్నాయి.

మొత్తమ్మీద ఒకకోటి పదిలక్షలమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నట్టు ఒక అంచనా. వీళ్లని పట్టుకుని తరలించాలంటే ఎన్నో బిలియన్ డాలర్లు ఖర్చవుతాయని అమెరికన్ ఇమిగ్రేషన్ కౌన్సిల్ చెబుతోంది. అది ఖజానాపై విపరీతమైన భారం.

“టాక్సులు కట్టని జనమే కదా, వాళ్లు పోతే ఏముందిలే అని అనుకోవడానికి లేదు. వాళ్లు వెళ్లిపోవడం వల్ల మూతపడే వ్యాపారాలు కూడా ఉంటాయి. వాటి వల్ల వచ్చే ట్యాక్సులు పోతాయి కదా!” అని ఒక విశ్లేషకుడు అభిప్రాయపడ్డాడు.

అంతే కాదు, అమెరికా వ్యవసాయరంగం కూడా ఈ మాస్ డిపోర్టేషన్ వల్ల కుంటుపడుతుందని అంటున్నారు కొందరు. కారణం తక్కువకి పనిచేసే కూలీలు లేకపోవడమే.

కాలిఫోర్నియాలో శాన్వాకిన్ అనే సువిశాల ప్రాంతం ఉంది. గణనీయమైన వ్యవసాయం అక్కడే జరుగుతుంది. క్యాలిఫోర్నియాకే కాదు, అమెరికాలోని చాలా ప్రాంతాలకి తిండిపెట్టే వ్యవస్థ అక్కడుంది. అక్కడ పనిచేసే కూలీల్లో దాదాపు అందరూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే. ఒక్కసారిగా వాళ్లు డిపోర్టేషన్ కి గురైతే చాలామంది పస్తులుండాలంటున్నాడు రైతుసంఘం అధ్యక్షుడు మాన్యువల్ కున్యా జూనియర్.

కానీ, ఇక్కడే మరొక వాదన కూడా ఉంది. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఇన్నాళ్లూ ప్రభుత్వాలు కనీస జీవనవేతనం కింద కొంత మొత్తాన్ని ఇస్తున్నాయి. అదంతా ట్యాక్స్ పేయర్స్ మనీయే. కనుక ఆ డబ్బు దేశానికి మిగులుతుందనేది ఒక లెక్క.

అర్ధికంగా, సామాజికంగా, న్యాయంగా, రాజ్యాంగబద్ధంగా అన్ని విధాలుగా దేశం బాగుండాలంటే అక్రమవలసదారుల్ని తోలేయాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించుకుంది. దీనిని అమలు చేయడానికి క్రిస్టి నోయం అనే హోం ల్యాండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ని, “బోర్డర్ జార్” అని పిలవబడే వలసదారుల ద్వేషి అయిన టాం హోమన్ ని ఎంపిక చేసాడు ట్రంప్. కనుక డిపోర్టేషన్ ప్రక్రియ అనివార్యం.

కొన్ని నిర్ణయాలు వినడానికి ఆదర్శంగా ఉంటాయి. అమలు చేస్తున్నప్పుడు తప్పొప్పులు తెలుస్తుంటాయి. ప్రస్తుతానిని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏరివేత అనే వార్త బాగుంది. జనవరి నుంచి అమలయ్యే ఈ ప్రక్రియ ఎంతవరకూ సత్ఫలితాలనిస్తుందో, ఏ రకమైన దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

పద్మజ అవిర్నేని

26 Replies to “అమెరికా మాస్ డిపోర్టేషన్లో కష్టనష్టాలు”

  1. నువ్వేం భయపడకు అక్కయ్య మనం డల్లాస్ ఏరియా లో అన్ని ఖాళీ అయిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కమ్యూనిటీస్ ఏరియాలని రియల్ ఎస్టేట్ లో అమ్మేయచ్చు. చీప్ లేబర్ మనుషులు ఉంటే మనకేంది పోతే మనకెందకు

  2. ఫస్ట్ అక్రమ వలసదారులని కాదు డిపొర్ట్ చెయ్యలిసింది

    ఒన్స్ అమెరికా వెళ్ళాక ..లొన్ లొ ఇళ్ళు… కార్లు కొని ..అవి whatsapp లొ instagram,facebook లొ share చెసి ..India లొ వుండెవారికి కావాలని irritation తెప్పించె వారిని deport చెయ్యాలి

    ఇళ్ళు… కార్లు కొని సంతొషం తొ వారి అనందాన్ని షెర్ చెసుకొవడం తప్పులెదు …

    ఎదుటి వారు ఈర్ష్య పడాలి అని షెర్ చెసె శాడిస్ట్ లను మాత్రమె పంపెయ్యాలి

      1. నువ్వు చిన్ని అని పెరు పెట్టుకున్నావ్..

        అడొ తెలియదు ….మొగొ తెలియదు …..తెడా నొ తెలియదు ..

        నెనుండెదె అమెరికా లొ ..కావలంటె నీ నుంబెర్ ఇక్కడ పెట్టు ..starting .408 నుంబెర్ తొ ఫొనె చెస్తా

        ఇక్కడ కొంతమంది చెస్తున్న overaction ని బరించలెక పై message పెట్టా chinni pulkaa

      2. నువ్వు చిన్ని అని పెరు పెట్టుకున్నావ్..

        అడొ తెలియదు ….మొగొ తెలియదు …..తెడా నొ తెలియదు ..

        నెనుండెదె అమెరికా లొ ..కావలంటె నీ నుంబెర్ ఇక్కడ పెట్టు ..starting .408 నుంబెర్ తొ ఫొనె చెస్తా

        ఇక్కడ కొంతమంది చెస్తున్న overaction ని బరించలెక పై message పెట్టా chinni pulkaa

        check my first comment time ..at that time no one write message from India..use basic common sense

      3. నువ్వు చిన్ని అని పెరు పెట్టుకున్నావ్..

        అడొ తెలియదు ….మొగొ తెలియదు …..తెడా నొ తెలియదు ..

        నెనుండెదె అమెరికా లొ ..కావలంటె నీ Phone number ఇక్కడ పెట్టు ..starting .408 PhoneNumber తొ ఫొనె చెస్తా

        ఇక్కడ కొంతమంది చెస్తున్న overaction ని బరించలెక పై message పెట్టా chinni pulkaa

        check my first comment time ..at that time no one write message from India..use basic common sense

    1. నేను విన్న ఒక జోక్: మా డాలస్ పురంలో ఉన్న ఓవరాక్షన్ ఎన్నారై ప్లాట్ కొందామని ఇండియా వెళ్ళాడు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అతన్ని తన జీపులో తీసుకెళ్లి ఒక ప్లాట్ చూపించి “ఇక్కడ కొనండి గజం 10 వేలు. పక్కనే ఒక ఐటీ కంపెనీ వస్తోంది” అంటాడు. ఎన్నారై చీదరించుకుని “నేను క్లౌడ్ కన్సల్టంట్‌ని. నా అవర్లీ రేట్ తెలుసా? ఇలాంటి చీప్ లాండ్స్ చూపిస్తావా? హౌ డేర్ యూ?” అంటాడు. ఏజెంట్ సారీ చెప్పి, జీపు తిప్పి వేరే దారిలో వచ్చి మళ్లీ అదే ప్లాట్ చూపించి “ఇక్కడ కొనండి. గజం 25 వేలు. పక్కనే ఐటీ కారిడార్ ప్లాన్ చేసారు” అంటాడు. ఎన్నారై మురిసిపోయి “దట్స్ మై బాయ్. రేపే రిజిస్ట్రేషన్ పెట్టించు” అంటాడు.

  3. హా..మనకూ కావాలి బ్లూ కాలర్ వర్క్స్ ఇమ్మిగ్రెంట్స్…అప్పుడు నాలుగు చె్తులా సంపాదించుకునే అవకాశాలు పెరుగుతాయి…నిజమే ఆలోచించాల్సిన విషయమే. -ఓ టెకీ అభిప్రాయం.

  4. అమెరికాకి అంతటి చీప్ లేబర్ అవసరం నిజంగా ఉంటే లీగల్‌గానే వారిని తెచ్చుకోవచ్చు. వారికి ఎచ్ 2 బి అనే వీసా కాటగరీ ఉంటుంది. కానీ అమెరికన్ పనివారు దొరుకుతున్నా కూడా తక్కువకి వస్తారని వాళ్లని తీసుకుంటేనే చిక్కు. ఉదాహరణకి ఇక్కడ అమెరికన్ స్టూడెంట్స్ వెయిటర్స్‌గా పనిచేసే ప్రతి రెస్టారెంట్‌లోనూ టిప్స్ వారినే తీసుకుకోనిస్తారు. కానీ మన దేశీ రెస్టారంట్ ఓనర్స్ ఇండియన్ స్టూడెంట్స్‌ని అక్రమంగా పనిలో పెట్టుకుని వారికి వచ్చే టిప్స్ తామే మింగేస్తుంటారు. అటువంటి వారిని ఒక పట్టు పడితే తప్పులేదు.

  5. Alaa ani illegal immigrants ni encourage cheyaleru ga. Daani valla risks kuda untaayi.

    yevaru ithe important anukuntunaaro vallanu legal migrants ga techukovdaniki avasaram ayina laws cheskovachu.

  6. గల్ఫ్ దేశాలలో ఇలాంటి పనుల కోసం వీసా ఇస్తారు కదా.. అలాంటిదే ఇస్తే.. మన వారు అమెరికా కూడా హాయిగా వెళతారు…

Comments are closed.