బాబు గారూ… అంతిమంగా బాధితులు ప్ర‌జ‌లే!

“ప్ర‌భుత్వం వ‌ద్ద డ‌బ్బు లేదు. కానీ సూప‌ర్‌సిక్స్ సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయాలి. సంప‌ద సృష్టించే వినూత్న ఆలోచ‌న‌లు నా ద‌గ్గ‌ర ఉన్నాయి” అని ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అంటే…ఏమిట‌బ్బా ఆ ఆలోచ‌న‌లు అని…

“ప్ర‌భుత్వం వ‌ద్ద డ‌బ్బు లేదు. కానీ సూప‌ర్‌సిక్స్ సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయాలి. సంప‌ద సృష్టించే వినూత్న ఆలోచ‌న‌లు నా ద‌గ్గ‌ర ఉన్నాయి” అని ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అంటే…ఏమిట‌బ్బా ఆ ఆలోచ‌న‌లు అని చాలా మంది అనుకున్నారు. గ‌తంలో ఏ ప్ర‌భుత్వం చేయ‌ని వినూత్న ఆలోచ‌న‌లు చంద్ర‌బాబు స‌ర్కార్ చేసింది.

“డ‌బ్బులు ఊరికే రావు” అని బంగారానికి సంబంధించి వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో చెప్పిన‌ట్టు, రోడ్లు ఊరికే రావ‌ని చంద్ర‌బాబు అసెంబ్లీ వేదిక‌గా తేల్చి చెప్పారు. రోడ్లు కావాలంటే టోల్ తీస్తార‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. ఒక‌వేళ ఆర్థిక భారం వేయొద్దంటే, త‌న‌కేం ఇబ్బంది లేద‌ని ఆయ‌న బుకాయింపు…వారెవ్వా అనకుండా వుండ‌లేరు.

ప్రైవేటీక‌ర‌ణ ముద్దుబిడ్డ‌గా చంద్ర‌బాబుకు పేరు వుంది. ఆ పేరును ఆయ‌న నిల‌బెట్టుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. రోడ్ల‌పై ఎవ‌రూ చేయని ఆలోచ‌న ఆయ‌న చేశారు. ప్రైవేటీక‌ర‌ణ ఆలోచ‌న‌ల‌పై బ‌హుశా ఆయ‌న‌కు మాత్ర‌మే పేటెంట్ వున్న‌ట్టుంది. అసెంబ్లీలో రోడ్ల‌పై ఆయ‌న ఎంత చ‌క్క‌గా చెప్పారో తెలుసుకుని త‌రిద్దాం.

‘జాతీయ రహదారుల తరహాలో రాష్ట్ర, జిల్లా స్థాయిలోని అన్ని ప్రధాన రోడ్లపై టోల్‌గేట్లు ఏర్పాటుచేయాలని ఆలోచిస్తున్నాం. రోడ్ల నిర్వహణను అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి అప్పగిస్తాం. వారు టోల్‌ ఫీజు వసూలు చేసుకుంటారు. దీనికి ప్రజలను ఒప్పించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల‌దే. ఎక్కడైనా వ్యతిరేకిస్తే అక్కడ గుంతల రోడ్లతోనే ఉండాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

ముఖ్య‌మంత్రి నోట ఈ మాట‌లు వ‌చ్చిన త‌ర్వాత ఎవ‌రైనా జుత్తు పీక్కోవ‌డం త‌ప్ప‌, చేయ‌గ‌లిగేదేమి వుంటుంది? ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ఫైలట్ ప్రాజెక్ట్‌గా టోల్‌గేట్లు ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలకు మినహాయింపు ఇస్తూ మిగతా నాలుగు చక్రాల వాహనాలు, భారీ వాహన దారుల వద్ద టోల్‌ ఫీజు వసూలు చేయాలని ఆలోచిస్తున్న‌ట్టు ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.

మొద‌ట్లో ఇట్లే చెబుతారు. ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా ఆటోలు, ద్విచ‌క్ర వాహ‌నాల‌కు కూడా వ‌సూలు చేయ‌కుండా వుండ‌రనే భ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్రైవేటీక‌ర‌ణ ఎలా వుంటుందో తెలియంది కాదు. రిల‌య‌న్స్ సంస్థ సెల్‌ఫోన్ల మార్కెటింగ్ ఎలా మొద‌లు పెట్టిందో మ‌నంద‌రికీ తెలుసు. మొద‌టి ఫ్రీకాల్స్ అంటారు, ఇక ఫోన్లు లేకుండా బ‌త‌క‌లేని స్థితికి తీసుకొచ్చి, వాత పెట్ట‌డం మార్కెట్ స్వ‌భావం.

ఇప్పుడు కూడా రోడ్ల ప‌రిస్థితి ఇట్లే వుంటుంద‌నే అనుమానాలు లేక‌పోలేదు. ఏది ఏమైనా చివ‌రికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్ల‌కు టోల్‌గేట్లు పెట్ట‌డం అంటే, మ‌న వ్య‌వ‌స్థ ఏ స్థితికి దిగ‌జారిందో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు ఉచితంగా అందించాల్సిన సేవ‌ల్ని, ముక్కు పిండి మ‌న‌తోనే డ‌బ్బు వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ముఖ్య‌మంత్రి చెబుతున్న‌ట్టు నాలుగు చ‌క్రాల వాహ‌నాలు త‌మ‌పై ప‌డే టోల్ ఫీజుల భ‌రాన్ని ప్ర‌యాణికులు లేదా వినియోగ‌దారుల‌పై వేయకుండా వుంటాయ‌ని ఎలా అనుకుంటున్నారు? అంతిమంగా ప్ర‌జ‌లే బాధితులు.

14 Replies to “బాబు గారూ… అంతిమంగా బాధితులు ప్ర‌జ‌లే!”

    1. ఎవరు బాగుపడతాం? ఎలా? ఆ ప్రైవేట్ వాళ్ళు… జీవితాంతం పెట్టిన ఖర్చు.. తిరిగి వచ్చినా … వసూలు చేసుకుంటూ.. బాగుపడటమా?

  1. “మొద‌ట్లో ఇట్లే చెబుతారు. ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా ఆటోలు, ద్విచ‌క్ర వాహ‌నాల‌కు కూడా”

    like Jagan

    1. తెలుగు D0 n G@ల! పార్టీ D0 n G@సన్నాసి.

      ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు… గురించి మాట్లాడక.. ఎప్పుడో దిగిపోయిన… జగన్ గాడి.. మొగ్గ చీకటమే.. పనిగా ఉంది కదర …సన్నాసి ?

      1. అరెరే! సరిగా నిన్ను, GA ని ఇదేగా అడగాలి. Tolls వసూళ్ల గురించి నిన్న వచ్చిన వార్తకి నేను నిన్ననే commentx పెడితే తమరు ఏ పనిలో నిమగ్నమయ్యారో బాగా అర్ధమయ్యింది.

        Two wheeler కి toll fee వసూలు అని gA కి అనుమానం రావడానికి జగన్ గతంలో చేసిన వ్యాఖ్యలే కారణం కాదా?

  2. అప్పుడు మరి డైరెక్ట్, ఇండైరెక్ట్ టాక్స్ తీసేస్తారా? అవి వసూలు చేస్తే మీ జేబుల్లోకి వెళ్లి మళ్ళీ మేము ఈ టోల్ టాక్స్ కట్టు కోవాల?

  3. Maa Janasena strong Godavari jillallo start cheyoddhu. Please start in Rayalaseema areas. Last Government lo tolls ki kooda chaala anti nadichindi. Janasena areas lo kelakoddu.

  4. జిజియా పన్ను గుర్తుకు వస్తుంది. Keeping roads well maintained is duty of govt. సంపద సృష్టి అంటే బాదుడు అని బాదుడు బాబా అనుగ్రహించారు. Babu Surity బాదుడు గ్యారంటీ.

Comments are closed.