సీఎం సీటు వరకూ వచ్చే సరికి ఉద్ధవ్ ఠాక్రేనే బీజేపీ లెక్క చేయలేదు! అలాంటిది ఇప్పుడు షిండే, అజిత్ పవార్ లను శంకరగిరి మాన్యాలు పట్టించడం కమలం పార్టీకి ఒక లెక్కనా! మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి తర్వాత మెజారిటీ సీట్లను కలిగిన పార్టీకే సీఎం పీఠం అనేది లేదని షిండే వాదిస్తున్నారట! అలాగే అజిత్ పవార్ వర్గం కూడా తమకే సీఎం పీఠం కావాలని అంటోందట!
అయితే.. ఇలాంటి మాటలు ఎన్నికల ముందు వరకూ బీజేపీ వినేదేమో కానీ, ఇప్పుడు వినే అవకాశాలు శూన్యం అని చిన్నపిల్లాడికి కూడా అర్థం అవుతుంది. షిండే, అజిత్ లకు కూడా ఇది అర్థమయ్యే ఉంటుంది కానీ, కాసేపు వీరు హడావుడి చేసుకోవచ్చంతే!
బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నంబర్ ను అయితే పొందలేదు. అయితే..ఆ పార్టీ అలా విజిలేస్తే షిండే సేన నుంచి ఇంకో షిండే పుట్టుకొస్తాడు! అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి ఇంకో నాయకుడు ఎమ్మెల్యేలతో వచ్చేస్తాడు! ఉద్ధవ్ ఠాక్రే మీద చేసిన ప్రయోగమో ఇప్పుడు షిండే, అజిత్ ల మీద చేయడం కమలం పార్టీకి చిటికెలో పని! కాబట్టి.. తమవి వర్గాలు అని, పార్టీలు అని షిండే, అజిత్ లు ఊహించుకోకపోవడమే వారికి మంచిది! వీరే కాదు.. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్) లనుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కూడా బీజేపీ తన వైపుకు తిప్పుకోవడం అణుమాత్రం కూడా కష్టం కాదు!
కాబట్టి.. ఇప్పుడు సీఎం సీటు విషయంలో షిండే, అజిత్ లను కమలం పార్టీ పరిగణనలోకి తీసుకోవడం జరిగే పనిలా కనిపించడం లేదు. ఫడ్నవీస్ సీఎంగా మళ్లీ బాధ్యతలు స్వీకరించడం లాంఛనంగా కనిపిస్తూ ఉంది. షిండే, అజిత్ లు ఏవైనా సన్నాయి నొక్కులు నొక్కినా అవన్నీ ఉత్తుత్తువే! ఎలాగూ డిప్యూటీ సీఎం హోదాలున్నాయి కాబట్టి.. వీరికి అవి దక్కినా అదే మహాప్రసాదం! సీఎం సీట్లో కూర్చుంటేనే తనకు ఎలాంటి పవర్ లేకుండా పోయిందని షిండే అలిగాడు గతంలో! అలాంటిది డిప్యూటీ సీఎంగా వీరు చేసేది ఏమిటి అంటే.. కేసుల ఇబ్బంది లేకుండా చూసుకోవడం కావొచ్చు!
అసలు మతి ఉండే రాస్తారా ఇలాంటి రాతలు! మిగతా రెండు పార్టీ లను కలిపినా బీజేపీ కంటే తక్కువే, అలాంటప్పుడు సీఎం పదవి ఎలా ఇచ్చేస్తారు? ఉద్దవ్ ని లెక్క చెయ్యలేదు అని ఎలా అంటారు? బీజేపీ లో సగం సీట్లు తెచ్చుకుని సీఎం పదవి కావాలి అంటే అది న్యాయం అవుతుందా?
1995-99 మధ్యలో బీజేపీ కంటే శివసేన కి ఏడు సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చినా పూర్తి కాలం శివసేన సీఎం ఉన్నాడు, 2019 లో బీజేపీ కి 105, శివసేన కి 56 వచ్చాయి, అలాంటప్పుడు శివసేన సీఎం పదవి డిమాండ్ చెయ్యడం కరెక్టేనా?
vc available 9380537747
షిండే కే సీఎం ఇవ్వాలి లేకుంటే మహారాష్ట్రలో మళ్ళీ ఎన్నికలు తప్పవు
Kutami Ga win ayyaru ante valla madya bonding undi alage cader kuda tappulu cheyaru maro ap
Call boy works 7997531004
vc estanu 9380537747