మోడీని చూసి ప‌డ‌ని ఓట్లు షిండే-ఫ‌డ్న‌వీస్ ల‌ను చూసి ప‌డ్డాయా!

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు దేశాన్ని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతున్నాయి! ప్ర‌త్యేకించీ ఐదారు నెల‌ల కింద‌ట జ‌రిగిన లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌రాఠీలు ఇచ్చిన తీర్పుకూ, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అక్క‌డ వ‌చ్చిన ప్ర‌జాతీర్పుకూ పొంత‌నే…

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు దేశాన్ని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతున్నాయి! ప్ర‌త్యేకించీ ఐదారు నెల‌ల కింద‌ట జ‌రిగిన లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌రాఠీలు ఇచ్చిన తీర్పుకూ, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అక్క‌డ వ‌చ్చిన ప్ర‌జాతీర్పుకూ పొంత‌నే లేదు!

లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే.. 48 లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గానూ కాంగ్రెస్-ఎన్సీపీ(శ‌ర‌ద్ ప‌వార్)- శివ‌సేన‌(ఉద్ధ‌వ్ ఠాక్రే) పార్టీలు ఏకంగా 30 ఎంపీ సీట్ల‌ను గెలిచాయి! 48 ఎంపీ సీట్ల‌కు గానూ ఇలా ఏకంగా ముప్పై ఎంపీ సీట్ల‌ను ఆ పార్టీలు సొంతం చేసుకున్నాయి! వీరికి ప్ర‌త్య‌ర్థులుగా క‌లిసి పోటీ చేసిన బీజేపీ-శివ‌సేన‌(షిండే)- ఎన్సీపీ(అజిత్ ప‌వార్) పార్టీలు కేవ‌లం 17 ఎంపీ సీట్ల‌కు ప‌రిమితం అయ్యాయి!

ఇలా బీజేపీ కూట‌మికి వ్య‌తిరేక గాలి అప్పుడు స్ప‌ష్టంగా క‌నిపించింది. గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. మోడీ మ‌రోసారి ప్ర‌ధాని కావ‌డం గురించి జ‌రిగిన ఎన్నిక‌లు అవి! కేంద్రంలో బీజేపీ ఇంకోసారి అధికారాన్ని చేప‌ట్ట‌డం గురించిన ఎన్నిక‌లు అవి! దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తున్న ప్ర‌జ‌లు, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి ప‌ట్టం గ‌ట్ట‌డం రొటీనే! మోడీ మానియా అది అంటారంతా!

అయితే మ‌హారాష్ట్ర క‌థ రివ‌ర్స్ లో ఉంది. మోడీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా జ‌రిగిన ఎన్నిక‌ల్లోనేమో క‌మ‌లం పార్టీని ప్ర‌జ‌లు పూర్తిగా తిరస్క‌రించారు! కూట‌మిగా వెళ్లినా ప్ర‌జ‌లు చిత్తు చేసి పంపించారు! అయితే ఆరు నెల‌ల్లోపే, దేశంలో పెద్ద రాజ‌కీయ సంచ‌ల‌నాలు ఏమీ జ‌ర‌గ‌క‌పోయినా, అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కూ వ‌చ్చే స‌రికి క‌థ మారిపోయింది! ముప్పై ఎంపీ సీట్ల‌ను గెలిచిన మూడు పార్టీలు ముప్పై అసెంబ్లీ సీట్ల‌ను గెలిచేందుకు మాత్రం ముప్పుతిప్ప‌లు ప‌డే ప‌రిస్థితి క‌నిపించింది అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో!

అంటే.. మోడీ క‌న్నా షిండే- ఫ‌డ్న‌వీస్- అజిత్ ప‌వార్ లే పెద్ద నాయ‌కులా! మోడీ ని తిర‌స్క‌రించిన మ‌రాఠీలు వీరిని ఎన్నుకున్నారా! అయినా అప్పుడు కూడా వీళ్లే క‌దా కూట‌మి నాయకులు! ఓట్ల శాతం ప‌రంగా చూసినా, సీట్ల లెక్క‌ల ప్ర‌కారం చూసుకున్నా.. బీజేపీ కూట‌మిని ఆరు నెల‌ల కింద‌ట చిత్తు చేసిన ప్ర‌జ‌లు ఇప్పుడు బంప‌ర్ మెజారిటీతో అధికారంలోకి తీసుకురావ‌డం వెనుక లోగొట్టు ఎవ‌రికి ఎరుక? ఈవీఎంలకా?

14 Replies to “మోడీని చూసి ప‌డ‌ని ఓట్లు షిండే-ఫ‌డ్న‌వీస్ ల‌ను చూసి ప‌డ్డాయా!”

  1. దేశమంతా ఎన్నికలు జరిగితే ఒక్క మహారాష్ట్ర మీద ఫోకస్ చెయ్యలేరు, ఇప్పుడు ఒక్క మహారాష్ట్ర మీదే ఫోకస్ ఉండడం తో సులువుగా ప్రచారం చేశారు. అదీ కాక లోకసభ ఎన్నికలు నేర్పిన గుణ పాఠం తో తప్పు జరక్కుండా చూసుకున్నారు.

    1. లోకసభ ఎన్నికలు లో కాంగ్రెస్ కూటమి గారంటీ లు, రిజర్వేషన్స్ రద్దు అని తప్పుదారి పట్టించింది. ఈసారి భాటెంగే తో కాటెంగే ప్రచారం తో హిందువులను బీజేపీ ఏకం చేసింది.

      1. ఏసెస్. ఇక కేంద్రం లో ఎవరంటే వలకే. వేస్తారు పనులు జరుగుతాయి గనుక ఇందులో తప్పేమీ లేదు గా

  2. 😂😂😂…ఇందుకే GA మీకు 11 వచ్చింది………లోక్ సభ లో కాంగ్రెస్ గెలిచి Govt form చేసి వుంటే ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు….ఇప్పుడు సెంట్రల్ లో మోడీ govt వుంది కాబట్టే ఇక్కడ బీజేపీ గెలిచింది….మోడీ govt వల్లే మళ్ళీ మహారాష్ట్ర గెలిచారు ..UP లో 7 seats గెలిచారు….

  3. చాల సర్వే సంస్థలు, చానెల్స్ చెప్తున్నాయి కదా …నెల రోజుల క్రితం వరకు హోరా హోరీ గ ఉన్న పోటీ కాస్త ఆఖరు లో rss రంగం లోకి దిగడం వల్ల ..కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు కేటయించడం వల్ల బీజేపీ వైపు కి ఎడ్జ్ వచ్చింది అని

  4. మన అన్న కి 2019 లో బంపర్ మెజారిటీ తగలడం లో గుట్టు కూడా వాటికీ (మెషిన్ )ఎరుకేనా ????

Comments are closed.