పాటలో అరుదైన కవిత్వం

అప్పుడప్పుడు సినిమా పాటల్లో కూడా మంచి సాహిత్యం వినిపిస్తూ వుంటుంది.

ఇంతందం దారి మళ్లిందా… అనే పాట సీతారామం సినిమాలోది. రాసింది కెకె. ఆ పాటలో కొత్త భావనలు, ఆలోచనలు తొంగిచూస్తాయి. ఇప్పుడు అదే రచయిత కెకె మరో మంచి పాట రాసారు. బచ్చలమల్లి లాంటి ఒ మొరటోడి కథతో నడిచే సినిమాలో, అదే మూర్ఖుడి ప్రేమ పాట ఇది. భలే భావుకత తొంగి చూస్తోందీ పాటలో.

‘’…నిలబడే నిద్ర పడుతుందనే మత్తు ఒకటి వుందనే తెలిసీ తెలియదే

అన్ని వ్యసనాలను మించిన వ్యసనుం పేరే ప్రేమని..’’

నిలబడే నిద్రపోవడం.. వ్యసనాలకు మించిన వ్యసనం.. ప్రేమ లక్షణాలని కవి వర్ణించడం బాగుంది. అలాగే

‘’…గడ్డి పువ్వుంటి నాకోసం గుడి తలుపులు తీసావే..’ అనడం కొత్త ఆలోచన.

‘..చెలియవే.. కలువవే.. బురదకు నువ్వు వరానివే..’ ఇదో మంచి ప్రయోగం. హీరో తనను తాను బురదతో పోల్చుకుని, తనకు దొరికిన అమ్మాయిన కలువతో పోల్చడం బాగుంది.

అప్పుడప్పుడు సినిమా పాటల్లో కూడా మంచి సాహిత్యం వినిపిస్తూ వుంటుంది. కెకె రాసిన ఈ పాటను ఎస్పీ చరణ్ పాడారు. గతంలో సీతారామం లో కెకె రాసిని ఇంతందం దారి మళ్లిందా పాటను కూడా చరణ్ నే పాడారు.

5 Replies to “పాటలో అరుదైన కవిత్వం”

Comments are closed.