ఈ మెలొడీ గేమ్ ఛేంజ్ చేసేలా ఉంది..!

మెలొడీ విషయంలో తమన్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. హీరో ఎవరైనా, సినిమా ఏదైనా, మెలొడీల్లో తన మార్క్ చూపిస్తూ వస్తున్నాడు.

కొన్నేళ్ల కిందటి సంగతి. తమన్ నుంచి “నీ కాళ్లను పట్టుకు..” అనే సాంగ్ వచ్చింది. అది ఎంత పెద్ద హిట్టయిందో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సరిగ్గా అవే లక్షణాలు ఈరోజు రిలీజైన గేమ్ ఛేంజర్ సాంగ్ లో కూడా కనిపిస్తున్నాయి.

మెలొడీ విషయంలో తమన్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. హీరో ఎవరైనా, సినిమా ఏదైనా, మెలొడీల్లో తన మార్క్ చూపిస్తూ వస్తున్నాడు. ఈరోజు రిలీజైన ‘నా నా హైరానా’ సాంగ్ కూడా ఆ కోవలోకే వచ్చేలా ఉంది.

శ్రేయా ఘోష‌ల్, కార్తీక్ పాడగా విడుదల చేసిన ప్రోమో చూసినప్పుడే చాలామందికి నచ్చింది. ఏదో మేజిక్ చేసేలా ఉందనిపించింది. మెలొడీ ప్రేమికులకు ఇది కచ్చితంగా నచ్చేలా ఉంది.

ఈ సంగీతానికి దర్శకుడు శంకర్ ఇమేజినేషన్ తోడైతే ఎలా ఉంటుందో లిరికల్ సాంగ్ లో అక్కడక్కడ చూపించారు. న్యూజిలాండ్‌లో ఈ పాట‌ను ఇండియాలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చిత్రీక‌రించ‌ని విధంగా రెడ్ ఇన్‌ఫ్రా కెమెరాతో చిత్రీక‌రించారు.

రామ్ చరణ్, కియరా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయబోతున్నారు.

14 Replies to “ఈ మెలొడీ గేమ్ ఛేంజ్ చేసేలా ఉంది..!”

Comments are closed.