అల్లరి నరేష్-సుబ్చు కాంబినేషన్ లో రాజేష్ దండా నిర్మిస్తున్న బచ్చలమల్లి టీజర్ వచ్చింది. బచ్చల మల్లి టీజర్ మీద మంచి అంచనాలు వున్నాయి. సినిమా అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి గ్లింప్స్, ఇప్పుడు టీజర్ వరకు డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓ రియల్ క్యారెక్టర్ ను తీసుకుని కథ అల్లుకున్నారు. మొండిగా, మూర్ఘంగా వుంటూ, నేనింతే..నా తీరు ఇంతే అని చెబుతూ జీవితం సాగించిన వాడి కథ ఇది.
టీజర్ లో అల్లరి నరేష్ డిఫరెంట్ గా కనిపించాడు. పక్కా క్యారెక్టర్ కు ఫిట్ అన్నట్లు వున్నాడు. సినిమా కథ ఎక్కడ మొదలై ఎక్కడకు వెళ్లిందన్నది దాదాపు లైన్ గా టీజర్ లో ఎట్ ఎ గ్లాన్స్ ఇచ్చేసారు. సినిమాలో ఎమోషన్ కంటెంట్ ఎక్కువగా వున్నట్లు కనిపిస్తోంది. టీజర్ కాబట్టి అన్ని ఎలిమెంట్స్ తీసుకువచ్చి వుండరు. సినిమా కాన్సెప్ట్ ప్రకారం, ఒక మూర్ఘుడి ఎమోషనల్ జర్నీ అన్నట్లు కట్ చేసారు.
విశాల్ చంద్రశేఖర్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. సినిమా మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే కాకుండా కాస్త వింటేజ్ టచ్ వున్నట్లు కనిపించింది. వైవిధ్యమైన పాత్రల కోసం ప్రయత్నిస్తున్న అల్లరి నరేష్ కు మంచి పాత్ర దొరికినట్లే వుంది బచ్చలమల్లి టీజర్ చూస్తుంటే.
Call boy works 7997531004
vc estanu 9380537747