రామ్ గోపాల్ వర్మ స్కూలు నుంచి వచ్చిన వాళ్లయినా, లేదా సేమ్ టు సేమ్ స్కూలు టైపు అయినా కొంత కాలం తరువాత చప్పబడిపోతారు, చల్లబడిపోతారు. సినిమాను టేకిట్ ఈజీగా తీసుకుంటారు. ప్రేక్షకులను టేకిట్ గ్రాంట్ గా తీసుకుంటారు. దాంతో సినిమాలు సంతకెళ్లిపోతాయి. అది గురువు ఆర్జీవీ నుంచే వచ్చిందేమో. ఆయనా అంతే నాకు నచ్చింది.. నాకు వచ్చింది నేను తీస్తా.. మీరు చూస్తే చూడండి.. లేదంటే లేదు అంటారు. ఆయన శిష్యబృందం.. వాళ్ల పేర్లెందుకు కానీ లైనప్ చూస్తే ఇలాగే వుంటుంది. లేస్తే మనిషిని కాదు అనే టైపు. కానీ లేవడమే కనిపించదు.
తెలుగులో దర్శకుడు పూరి చేసినన్ని వైవిధ్యమైన ప్రయోగాలు చాలా తక్కువ మంది చేసారు. పైగా ఇప్పటికి తన కథలు తానే అల్లుకుంటారు. పక్క భాష కథలు, పక్కోళ్ల కథలు తీసుకోవడం అంటే రేర్.. వెరీ రేర్. పూరి సినీ ప్రయాణం మొత్తం చూసుకుంటే ఎన్ని వైవిధ్యమైన పాత్రలు సృష్టించారు. చిన్న సినిమా, పెద్ద సినిమా ఇలా ఎన్ని రకాలు తీసారు. బద్రి, శివమణి, ఇడియట్, శ్రావణి సుబ్రహ్మణ్యం, పోకిరి, బిజినెస్ మేన్ ఇలా రాసుకుంటూ వెళ్తే లిస్ట్ చాలా పెద్దది. ప్రతి పాత్ర సింపుల్ గా పూరి స్టయిల్ అనేస్తారు కానీ, ప్రతి పాత్రకు దేని ఫిలాసఫీ దానికి వుంటుంది. లోతుగా చూస్తే ఆ ఫిలాసఫీ అర్థం అవుతుంది.
అలాంటి పూరి రాను రాను బద్ధకిష్టి అయిపోయారు. సినిమాను టేకింగ్ ఈజీ అనేసుకుంటున్నారు. ఆయన ఫ్లాప్ సినిమాలు చూస్తే ఇది అర్థం అయిపోతోంది. ఇది ఆరోపణ కాదు. అక్షర సత్యం. పూరి మనసు పెడితే ప్రొడెక్ట్ ఇలా వుండదు. పూరి సీరియస్ గా, సిన్సియర్ గా సినిమా మీదే కూర్చుంటే ఆ సినిమా వేరే లెవెల్ లో వుంటుంది.
పూరి సినిమా వస్తున్నపుడల్లా హడావుడి మామూలుగా వుండదు. ఆయనకంటూ వున్న ఫ్యాన్ బేస్ అలాంటిది. ఒక్కో కంటెంట్ బయటకు వస్తూ వుంటే ఈ హడావుడి పెరుగుతూ వుంటుంది. కానీ తీరా చేసి సినిమా వచ్చేసరికి నాన్నా పులి కథలా వుంటుంది.
పూరి ఎంత గొప్ప సినిమాలు తీసారో, అంత టేకిట్ ఈజీ సినిమాలు తీసారు. అవే డ్రగ్ మాఫియా కథలు తిప్పి తిప్పి తీయడం. మాఫియా బ్యాక్ డ్రాప్ లేకుండా సినిమా తీయలేరా? బద్రి, శ్రావణీ సుబ్రహ్మణ్యం, ఇడియట్ ఇలా ఎన్ని సినిమాలు వైవిధ్యమైన కథలతో తీసారు. అసలు పూరి సినిమాల్లో కామెడీ ఎంత బాగుండేది. డబుల్ ఇస్మార్ట్ లో కామెడీ చూసి, పూరి కూడా తనే రాసానా ఇది అని బాధపడాల్సిన రేంజ్ లో వుంటుంది. ఇలాంటి కామెడీ ఎపిసోడ్ ను ఆయన మనసు పెట్టి రాసారు అని అంటే ఎవ్వరూ నమ్మరు.
క్రియేటివ్ పీపుల్ థాట్స్ ను టెన్షన్లు చంపేస్తాయి. సినిమా నిర్మాణాలు, నష్టాలు, అప్పులు, ఫోన్ కాల్స్, టెన్షన్లు అన్నీ కలిసి క్రియేటివ్ థాట్స్ ను రానివ్వవు. బిజినెస్ లోకి వేళ్లు పెట్టని దర్శకులు ఎప్పుడూ నవ యవ్వనంతో వుంటారు. అది గమనించాలి. రియల్ ఎస్టేట్ కావచ్చు, నిర్మాణ భాగస్వామ్యాలు కావచ్చు, ఇతర వ్యాపారాలు కావచ్చు. ఏవైనా సరే వాటిల్లోకి క్రియేటివ్ పీపుల్ అడుగు పెడితే, క్రియేటివిటీ అటక ఎక్కేస్తుంది.
జనం ఒకసారి మోసపోతారు. రెండు సార్లు మోసపోతారు. పూరి అంటే ఎంత అభిమానం వున్నా ఇలా ప్రతిసారీ మోసపోవడానికి సిద్దంగా వుండరు. అలాగే పోగొట్టుకున్న ప్రతిసారీ అవకాశం మళ్లీ దొరకదు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి డిజాస్టర్లు ఇచ్చినా కూడా విజయ్ సేతుపతి లాంటి వెర్సటైల్ ఆర్టిస్ట్ తో అవకాశం వచ్చింది.
ఇప్పుడు పూరి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. అభిమానులు కు మరోసారి నాన్నా పులి కథ చెప్పకూడదు.
He knows everything..gelichina cm kuda ekuva Kalam nibadadu ..cinema kuda antey
puri jagan and 11 reddy jagan iddarinee prajalu nammatam eppudo maasesaaru
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
ponile 1 1 laga 99.99 ante pola