రోజూ 2 గంటలు అదే పని

వారానికి ఒకసారి కోచ్ సహాయంతో కొత్తకొత్త వర్కవుట్స్ చేస్తుంటానని తెలిపింది.

హీరోయిన్లు అంత అందంగా ఎలా ఉంటారు? మంచి కాస్మొటిక్స్ వాడడమే కాదు, మంచి ఫుడ్ తీసుకుంటారు. దానికి తగ్గట్టు వ్యాయామాలు కూడా చేస్తారు. ఇదే విషయాన్ని నభా నటేష్ కూడా ప్రస్తావించింది.

అందంగా ఉండడం అంటే తన దృష్టిలో ఫిట్ గా ఉండడం అని చెబుతోంది నభా నటేష్. అందుకే తను ప్రతి రోజూ 2 గంటలు జిమ్ లో గడిపేందుకు ఇష్టపడతానని వెల్లడించింది.

రెగ్యులర్ గా ఒకే రకమైన వ్యాయామాలు చేస్తే నభాకు బోర్ కొడుతుందట. అందుకే వారానికి ఒకసారి కోచ్ సహాయంతో కొత్తకొత్త వర్కవుట్స్ చేస్తుంటానని తెలిపింది.

నభా నటేష్ కు యాక్సిడెంట్ అయింది. ఆమె భుజానికి సర్జరీ కూడా జరిగింది. ఆ టైమ్ లో వ్యాయామం విలువ తనకు తెలిసొచ్చిందని చెబుతోంది నభా. తను ఫిట్ గా ఉండడం వల్ల గాయం నుంచి త్వరగా కోలుకోగలిగానని, ఫిట్ నెస్ ను కూడా కోల్పోలేదని స్పష్టం చేసింది.

అందుకే ఇప్పటికీ రోజూ వ్యాయామం చేస్తానని, దానితోపాటు యోగా కూడా ప్రాక్టీస్ చేస్తానని అంటోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం స్వయంభూ సినిమా చేస్తున్న నభా నటేష్, ఓ మంచి మర్డర్ మిస్టరీ కథలో నటించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది.

2 Replies to “రోజూ 2 గంటలు అదే పని”

Comments are closed.