తెలుగు భాష ఆధారంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడడానికి తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు పొట్లి శ్రీరాములు వర్ధంతి వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఆయన వర్ధంతిని ఘనంగా సెలబ్రేట్ చేసుకోగా, తెలంగాణ ప్రభుత్వం.. తెలుగు యూనివర్సిటీకి ఉన్న ఆయన పేరును తొలగించేసి, కావలిస్తే చర్లపల్లి రైల్వే టర్మినల్ కు పెట్టుకోండి అంటూ గాలికొదిలేసింది. అయితే.. పొట్టి శ్రీరాములు త్యాగానికి శాశ్వత గుర్తింపు దక్కేలాగా చంద్రబాబునాయుడు కొన్ని కొత్త అంశాలు ప్రకటించారు.
అయితే.. అవన్నీ చేపట్టడం సంగతి తర్వాత.. ముందు ఆయన ప్రాణాలు విడిచిన ప్రదేశంలో.. ఏర్పాటు అయిన స్మారక భవనం గురించి కనీసంగా అయినా పట్టించుకోండి సారూ.. అంటూ ప్రజలు వేడుకుంటున్నారు.
పొట్టి శ్రీరాములు వర్ధంతి రాగానే.. చంద్రబాబునాయుడు రెండు మూడు సంగతులు ప్రకటించారు. పొట్టి శ్రీరాములు యొక్క 58 రోజుల ఆమరణ నిరాహారదీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటుచేసి.. దానిచుట్టూ స్మారక పార్కును కూడా ఏర్పాటుచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే నెల్లూరు జిల్లాలోని అమరజీవి స్వగ్రామంలో స్మారక కేంద్రం నిర్మించి అక్కడ మ్యూజియం కూడా ఏర్పాటుచేస్తామని అన్నారు.
నిజానికి ఈ రెండు ఆలోచనల్లో ఆయన విగ్రహం ఏర్పాటు ఆలోచన భేషైనది. అయితే.. కేవలం పొట్టి శ్రీరాములు స్మారకం, మ్యూజియం కోసం ఒక మారుమూల ప్రాంతంలో అభివృద్ధి చేయడం విజ్ఞతగల ఆలోచన కాదు. ఆ ఒక్క దానికోసం అక్కడికి పర్యాటకులను ఆకర్షించడం చాలా కష్టం అవుతుంది. నిజానికి, ఇలాంటివి ప్రభుత్వాలు కాంట్రాక్టులు చేయించడానికి ఉపయోగపడతాయే తప్ప, తద్వారా ఎవరి లాభాలు వారు దండుకున్న ఆతర్వాత మరుగున పడిపోతాయి. అదే దుర్గతి.. చెన్నైలో ఉన్న పొట్టి శ్రీరాములు స్మారక భవనానికి ఏర్పడి ఉంది.
చెన్నై నగరంలో ఏ స్థలంలో అయితే పొట్టి శ్రీరాములు అప్పట్లో 58 రోజుల నిరాహార దీక్ష చేసి ఆత్మత్యాగం చేశారో అదే ప్రదేశంలో ఒక అద్భుతమైన స్మారకభవనం ఏర్పాటు అయింది. ఇది ఏపీ ప్రభుత్వం ఆధీనంలోనే ఉందనే సంగతి బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసో లేదో అనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే.. రాష్ట్రప్రభుత్వం నుంచి నిర్వహణకు, అక్కడి సిబ్బంది జీతాలకు కూడా నిధులు విడుదల కాకుండా.. ఈ అమరజీవి స్మారక భవనం ఘోరమైన స్థితికి చేరుకుంటూ ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం గత ప్రభుత్వ హయాంలో 2015లో ఈ స్మారక భవనం నిర్వహణకు కమిటీలను ఏర్పాటు చేశారు. అంతే తప్ప.. నిర్వహణకు కనీస నిధులు ఇవ్వడం గురించి కూడా పట్టించుకోలేదు. ఆ కమిటీ సభ్యులే.. తమ సొంత నిధులను వెచ్చించి తూతూమంత్రంగా ఖర్చులు పెడుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు తెదేపా సర్కారు 5 లక్షల నిధులు ఇచ్చింది. వాటితో కొన్ని అప్పులు కట్టారు. ఆ తర్వాతి జగన్ సర్కారు అస్సలు పట్టించుకోలేదు.
2024 ఎన్నికలకు ముందు 4.5 లక్షల నిధులు ఇచ్చింది. అవి అప్పులకు కూడా చాల్లేదు. పొట్టి శ్రీరాములు పేరుతో కొత్త కొత్త కాంట్రాక్టు పనులు చేపట్టడానికి పదుల, వందల కోట్ల రూపాయలను ఖర్చు పెడతానని ఆర్భాటంగా ఆలోచిస్తున్న సర్కారు.. అసలు ఆయన ఆత్మత్యాగం చేసిన స్థలంలో ఉన్న స్మారక భవనం గౌరవం కాపాడడం తమ బాధ్యత అని తెలుసుకోవాలి.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
louda ga
nee amma ni pampu ra vedhava lekapothay ne pellanni
mana 1 1 …..
Chudam