కొన్ని సినిమాలు వాయిదా పడినట్టు ఉన్నఫలంగా చెప్పరు. ప్రేక్షకులే అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు హరిహర వీరమల్లు సినిమా వాయిదాపడిందనే విషయాన్ని చాన్నాళ్ల కిందటే అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆ తేదీకి రాబిన్ హుడ్ సినిమాను ఎనౌన్స్ చేశారు కాబట్టి.
రాజాసాబ్ విషయంలో కూడా అదే జరిగింది. ఆ తేదీకి జాక్ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు ఘాటీ సినిమాపై కూడా జనం ఇలానే ఓ అభిప్రాయానికి వచ్చేశారు.
ఎందుకంటే, అనుష్క సినిమా రావాల్సిన తేదీకి ప్రియదర్శి తన సినిమాను విడుదల చేస్తున్నాడు కాబట్టి. సారంగపాణి జాతకం సినిమాను ఏప్రిల్ 18కి షెడ్యూల్ చేశారు.
అప్పటికే ఆ తేదీకి ఘాటీ ఉంది. కానీ ప్రియదర్శి సినిమాను ఎనౌన్స్ చేశారంటే, ఘాటీ దాదాపు వాయిదా పడినట్టేనని అర్థం చేసుకోవాలి. త్వరలోనే కొత్త పోస్టర్ తో, కొత్త విడుదల తేదీతో ఘాటీ మేకర్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Waiting