సుక్కూ-షారూక్.. భలే కాంబినేషన్?

షారూక్-సుక్కూ కలిసి ఓ రూరల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా చేయడానికి రెడీ అవుతున్నట్టు బాలీవుడ్ మీడియా నుంచి కథనాలు.

ఓ పెద్ద హిట్ కొట్టిన దర్శకుడికి ఆటోమేటిగ్గా బాలీవుడ్ నుంచి పిలుపొస్తుంది. మరి పుష్ప-2 లాంటి ఆలిండియా హిట్ కొట్టిన సుకుమార్ కు ఎందుకు ఇప్పటివరకు హిందీ హీరోల నుంచి పిలుపు రాలేదు? సగటు ప్రేక్షకుడికి కలిగిన అత్యంత సహజమైన అనుమానమిది.

ఇన్నాళ్లకు ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. సుక్కూకు కింగ్ ఖాన్ నుంచి పిలుపొచ్చింది. ఈ మేరకు బాలీవుడ్ సైట్స్ లో కథనాలు కనిపిస్తున్నాయి. పుష్ప-2లో సుకుమార్ టేకింగ్, మాస్ ఎలివేషన్స్ కు షారూక్ ఫిదా అయ్యాడంట.

వెంటనే సుకుమార్ కు కబురుపెట్టాడట. షారూక్-సుక్కూ కలిసి ఓ రూరల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా చేయడానికి రెడీ అవుతున్నట్టు బాలీవుడ్ మీడియా నుంచి కథనాలు. కుల-వర్గ పోరాటాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో షారూక్ అక్కడక్కడ నెగెటివ్ ఛాయల్లో కూడా కనిపిస్తాడట.

అయితే ఇది సాకారమవ్వడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది. ఎందుకంటే చరణ్ తో సినిమా కోసం సుకుమార్ ప్రిపేర్ అవుతున్నాడు. ఆ తర్వాత పుష్ప-3 చేస్తాడు. ఈ రెండు సినిమాలు పూర్తయితే తప్ప షారూక్ సినిమాలో కదలిక రాదు.

3 Replies to “సుక్కూ-షారూక్.. భలే కాంబినేషన్?”

Comments are closed.