తెలివైన వాళ్ల‌కు హ్యాపీ ల‌వ్ లైఫ్ కష్ట‌మే గురూ!

ఎమోష‌న‌ల్ డిటాచ్ మెంట్ కూడా ఇంటెలిజెంట్ పీపుల్ లో ఉండే ఒక ల‌క్ష‌ణం. వీరు దేన్నైనా లాజిక‌ల్ గా ఆలోచిస్తారు.

బాగా తెలివైన వాళ్లకు ఆనందం అనేది అరుదైన అంశం అంటాడు ఒక ర‌చ‌యిత‌! ఇందులో లోతైన త‌త్వం ఉన్నా.. అది అంద‌రూ ఆమోదించే సంగ‌తెలా ఉన్నా, బాగా ఇంటెలిజెన్స్ ఉన్న వారికి ల‌వ్ లైఫ్ లో ఆనందం అంత తేలిక‌కాదు అంటున్నాయి అధ్య‌య‌నాలు! అంటే తెలివైన వాళ్ల‌కు ల‌వ్ లైఫ్ లో ఎగ్జ‌యిట్ మెంట్ మిస్ అవుతుంద‌నేది వీరి సారాంశం. మీరు బాగా తెలివైన వారు కాక‌పోతేనే, అతిగా ఆలోచించే వారు కాక‌పోతేనే.. ల‌వ్ లైఫ్ ను బాగా ఆస్వాధించ‌గ‌ల‌రు అనేది ఈ అధ్య‌య‌నం సూటిగా చెప్పే ముఖ్య‌మైన అంశం! అతిగా ఆలోచించే వాళ్లు స్పాంటేనివిటీని కోల్పోతారు.

ల‌వ్ లో స్పాంటేనియ‌స్ రియాక్ష‌నే ఎగ్జ‌యిట్ మెంట్ ను ఇస్తుంది ఎవ‌రికైనా! అయితే అతిగా ఆలోచించే వారు .. స్పాంటేనియస్ గా ఉండ‌లేరు. ఇక అతి తెలివైన వారు ఎంత‌సేపూ త‌మ స్వార్థానికే ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. ఏది చేసినా ఆచితూచి, ఒక ఉద్దేశంతో చేస్తారు. ఫ‌లితంగా వీరు త‌మ పార్ట్ న‌ర్ ను కొన్నాళ్ల పాటు తెలివిగా మేనేజ్ చేసినా, వీరి అస‌లు రూపం వారికి అర్థ‌మైపోతుంది. వీరి అతి తెలివిని వారు అర్థం చేసుకుంటే.. ఒక‌టి బ్రేక‌ప్ అయినా చెప్పేస్తారు, త‌ప్ప‌దంటే.. మ‌న‌సులో వీరి తెలివిని దృష్టిలో ఉంచుకునే.. పైకి న‌టిస్తారంతే!

ఓవ‌రాల్ గా అతి తెలివితేట‌లుంటే.. ల‌వ్ లైఫ్ బాగుండ‌దు అనేది ఈ అధ్య‌య‌నం థియ‌రీ. అయితే అతి తెలివైన వాళ్లు త‌మ ల‌వ్ లైఫ్ ను అలా కూడా క‌నిపించ‌నివ్వ‌రు! అది బాగున్న‌ట్టుగా క‌ల‌రింగ్ ఇచ్చే తెలివి తేట‌ల‌కు వారి వ‌ద్ద లోటు కూడా ఉండ‌దు!

ఇంటెలిజెంట్ పీపుల్ త‌మ ల‌వ్ పార్ట్ న‌ర్ లో కూడా ప‌ర్ఫెక్ష‌నిజం ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఎమోష‌న‌ల్ ఇంటెలిజెన్స్ ఉండాల‌ని, ఇంటెలెక్చువ‌ల్ కంప్యాట‌బులిటీ ఉండాల‌ని, మెచ్యూరిటీ ఉండాల‌ని, ప‌ర్స‌న‌ల్ గ్రోత్ క‌లిగి ఉంగాల‌ని.. ఇలా పార్ట్ న‌ర్ లో చాలా ల‌క్ష‌ణాలు ఉండాల‌ని వీరు అంటారు. త‌మ‌లో ఆ ల‌క్ష‌ణాలు ఉన్నా లేక‌పోయినా.. త‌మ ఇంటెలిజెన్స్ తో పార్ట్ న‌ర్ లో ఈ ల‌క్ష‌ణాల‌ను వెదికే ప‌ని పెట్టుకుంటారు. భారీ ఎక్స్ పెక్టేష‌న్ల‌ను పెట్టుకుంటారు! మ‌రీ ఈ ఎక్స్ పెక్టేష‌న్ల‌ను పార్ట్ న‌ర్ పై రుద్ద‌డం అంటే అంత‌కు మించిన దుర్మార్గం ఉండ‌దు! ప్రేమించిన మ‌నిషిలో వారికి ఉన్న ల‌క్ష‌ణాలను చూసి ప్రేమించిన‌ట్టుగా ఉండాలి కానీ, మేం ప్రేమిస్తున్నాం కాబ‌ట్టి.. ఈ ల‌క్ష‌ణాలు అన్నీ ఉండాలంటే మాత్రం ల‌వ్ స్టోరీ లో అంత‌క‌న్నా విషాదం ఉండ‌దు!

ఎమోష‌న‌ల్ డిటాచ్ మెంట్ కూడా ఇంటెలిజెంట్ పీపుల్ లో ఉండే ఒక ల‌క్ష‌ణం. వీరు దేన్నైనా లాజిక‌ల్ గా ఆలోచిస్తారు. ఎమోష‌న‌ల్ గా క‌న్నా.. రియాలిటీకి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. మ‌రి వారి వ‌ర‌కూ అది చెల్లుబాటు అవుతుందేమో కానీ.. పార్ట్ న‌ర్ కూడా అంతే డిటాచ్డ్ గా ఉండాల‌ని లేదు. అంద‌రూ అలా ఉండ‌రు కూడా! ఇంటెలిజెంట్ ఏమో ప్ర‌తిదాన్నీ లాజిక‌ల్ గా మాట్లాడుతే.. ఎమోష‌న‌ల్ గా ఉండేవారికి జీవితమే భ‌యంక‌రంగా మారుతుంది. త‌మ ఎమోష‌న్స్ కు ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌కుండా.. అన్నింటికీ లాజిక‌ల్ గా మాట్లాడితే.. వీరికి కూడా వారితో డిటాచ్ మెంట్ పెరుగుతుంది. దీని వ‌ల్ల సాన్నిహిత్యం అనేది పోతుంది!

అలాగే ఇంటెజెంట్స్ లో ఒక‌ర‌క‌మైన భ‌యం ఉంటుంది. అదే లాంగ్ ట‌ర్మ్ క‌మిట్ మెంట్, అందుకు సంబంధించిన భ‌యాలు. ప్రేమ మొద‌లు పెట్టాకా.. పార్ట్ న‌ర్ తో ప్ర‌యాణం మొద‌లుపెట్టాకా.. దాని ప‌ర్య‌వ‌స‌నాల‌ను వీరు ఆలోచించ‌డం మొద‌లుపెడ‌తారు! ప్ర‌తిదాన్నీ క్యాలుకులేట్ చేస్తారు. దీని వ‌ల్ల‌.. వారిలోనే లేనిపోని భ‌యాలు మొద‌ల‌వుతాయి. ఈ భ‌యాలు, అతి ఆలోచ‌న‌లు.. ప్ర‌శాంత‌త‌ను దూరం చేస్తాయి. ప్రేమ ఫీలింగ్స్ ను కూడా ఇవి దుంప‌నాశ‌నం చేస్తాయి!

ఇక ఈ ఇంటెలిజెంట్స్ లైక్ మెండెడ్ పీపుల్ కోసం సెర్చ్ చేస్తే.. అలాంటి వారు దొర‌క‌డం కూడా తేలిక కాదు! అచ్చం వీరిలాగానే ప్ర‌తిదాన్నీ అనేక లెక్క‌లు వేసి, అనేక లాజిక్ ల‌ను క‌లుపుకుని ఆలోచించే వాళ్లు.. దొర‌డం దుర్లభం. ఒక‌వేళ దొరికినా.. వారు వీరి కన్నా ఎక్కువ లెక్క‌లు వేసే వాళ్లు కావొచ్చు, వీరికి మించిన ఇంటెలిజెంట్స్ కావొచ్చు. దీని వ‌ల్ల మ‌రిన్ని క‌ల‌హాలే పెరుగుతాయి. ఒక‌రికి మించి మ‌రొక‌రు అతి తెలివిని ప్ర‌ద‌ర్శిస్తే.. ఆ ల‌వ్ లైఫ్ గురించి వేరే వ‌ర్ణ‌న‌లు అక్క‌ర్లేదు!

స్థూలంగా.. మీరు ఎంత ఇంటెలిజెంట్స్ అయినా, ఆ తెలివి తేట‌ల‌ను ల‌వ్ లైఫ్ లోకి తీసుకొచ్చి వాటిని వాడొద్దు అనేది ఈ అధ్య‌య‌నం ఇచ్చే స‌ల‌హా!

9 Replies to “తెలివైన వాళ్ల‌కు హ్యాపీ ల‌వ్ లైఫ్ కష్ట‌మే గురూ!”

Comments are closed.