సన్యాసం కష్టం.. కాషాయం పుచ్చుకోనున్న విజయసాయి!

విజయసాయి కాషాయదళంలో చేరుతారా లేదా అనే విషయంలో ఆయన స్వయంగా వివరణ ఇస్తే తప్ప ఈ పుకార్లు ఆగవు!

ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని, తనకు ఎంతో ఇష్టమైన సేద్యం చేసుకుంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి తాను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ వారు ప్రసాదించిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తద్వారా.. ఎన్డీయే కూటమి రాజ్యసభలో తమ బలం పెంచుకోవడానికి కూడా ఆయన తోడ్పాటు అందించారు.

ఇక రాజకీయాలు మాట్లాడను అని ప్రకటించిన వ్యక్తి- జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి, ఆయన చుట్టూ ఏర్పడిన కోటరీ గురించి వ్యాఖ్యలు చేయడానికి మాత్రం తరచుగా ఆ నియమాన్ని తీసి గట్టున పెడుతూ వస్తున్నారు. అంటే.. కారణాలు ఏమైనా కావొచ్చు గానీ.. జగన్ ను బద్నాం చేయడానికి మాత్రమే ఆయన రాజకీయాలు మాట్లాడతారు.. మిగిలిన విషయాల్లో రాజకీయాలు మాట్లాడకుండా సన్యాసం పాటిస్తారు.. అనే విమర్శ ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. తాజాగా ఆయన భారతీయ జనతా పార్టీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

విజయసాయిరెడ్డి ఢిల్లీలో తన రాజీనామాను ప్రకటించినప్పటికి- కాకినాడ పోర్టు వాటాల కేసులో సీఐడీ విచారణకు హాజరైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పిన మాటలకు మధ్య కొంత వ్యత్యాసం ఉంది. ఢిల్లీలో మాట్లాడినప్పుడు.. ఆయన ఇక ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని, సన్యాసమూ వ్యవసాయమూ అనే మాటలు మాత్రమే చెప్పారు. సీఐడీ విచారణ తర్వాత మాట్లాడినప్పుడు.. భవిష్యత్తులో వేరే పార్టీలో చేరే సంగతి ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు. ఈ మాటలే తాజా పుకార్లకు కారణం అవుతున్నాయి.

వైసీపీ తరఫున ఎంపీగా ఉన్న సమయంలో ఢిల్లీలోని కమలదళం పెద్దలతో విజయసాయిరెడ్డికి చాలా దగ్గరి సంబంధాలు నెలకొన్నాయి. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఆయన వారితో సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఆ సంబంధాలను ఉపయోగించుకుంటూ ఆయన కమలదళంలో చేరుతారని, కాషాయం కప్పుకోనున్నారనే వార్తలు ఇప్పుడు వస్తున్నాయి.

ఇందుకు కమలం పెద్దలనుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆయన చేరికకు సంబంధించి.. నిజానిజాలేమిటో తెలియదు గానీ.. పుకార్లు మాత్రం చాలానే స్ప్రెడ్ అవుతున్నాయి. ముందుముందు ఏపీ బీజేపీ సారథ్యం కూడా స్వీకరించే అవకాశం ఉన్నదని, ఆ పార్టీ తరఫున 2029న ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీచేయాలనుకుంటున్నారని రకరకాలుగా మాట్లాడుతున్నారు.

విజయసాయిరెడ్డికి మీడియా వ్యవహారాల మీద చాలా అవగాహన ఉంది. ఒక దశలో ఆయన సొంత పార్టీ పెట్టాలని కూడా అనుకున్నారు. 2023 ఉగాది నాటికి కొత్త దినపత్రిక ప్రారంభించబోతున్నట్టుగా అప్పట్లో ప్రకటించారు. ఆయన రాజకీయ సన్యాసం తర్వాత కూడా టీవీ ఛానెల్ ప్రచారం పెడతారనే ప్రచారమూ జరిగింది. ఈ సంగతులు పక్కన పెడితే.. ఒక్క మాట తేడా మాట్లాడడం వల్ల ఎన్ని పుకార్లు పుడతాయో ఆయనకు తెలియనిది కాదు.

విజయసాయి కాషాయదళంలో చేరుతారా లేదా అనే విషయంలో ఆయన స్వయంగా వివరణ ఇస్తే తప్ప ఈ పుకార్లు ఆగవు!

22 Replies to “సన్యాసం కష్టం.. కాషాయం పుచ్చుకోనున్న విజయసాయి!”

  1. ఇంకా డ్రామాలు ఎందుకురా? వాడు BJP లొకి వెళ్ళాలి అని నిర్నయించుకున్నకె Y.-.C.-.P ని వదిలెసాడు!

    .

    మరి వీడు చెసినా పాపాలు అటు వంటివి. ఆ పాపాలె, శాపాలుగా మారకముందె జగన్ ని వదిలెసి BJP తీర్దం తీసుకొని జాగ్రత్త పడదాం అన్నది వాడి అలొచెన గా ఉంది!

  2. నాకు విలువలూ, విస్వసనీయతలు ఉన్నాయి అంటె, కాదు నాకె ఉన్నయి అంటూ A1, A2 లు స్టెట్మెంట్ లు ఇచ్చుకొని.. పాపం ఆ మద్య లు విలువలూ, విస్వసనీయత లొ పొటీపడి రాష్ట్రం మొత్తం కామిడీ పండిచారు!

    .

    అయితె ఈ కామెడి మాత్రం GA కి కనపడదు

  3. 16 నెలలు లోపల ఉండి మళ్ళీ అవినీతి చేయను అని హామీ ఇచ్చి బయటకి వచ్చాక అవినీతిలో మునిగితేలినట్టు ఇది కూడా అంతే

    1. నీ ఐటీడీపీ Kv తహ్! లే ర.Yerr! పూవ్

      ఇప్పుడేమైనా.. సిగ్గు పడని పనులు చేస్తున్నారా ఏంటి రోజు?! బండభూతులుతిట్టిన .పావలా గాడిని చేర్చుకోలే? మరి వాడికంటే..వీడెంతక్కువ? అన్ని ఆర్ధిక వ్యవహారాలే.. అన్ని అధికారం కోసమే.. గా తెలుగు D0 ng@l@ పార్టీ తాపత్రయం!

    2. నీ ఐటీడీపీ Kv తహ్! లే ర.Yerr! పూవ్

      ఇప్పుడేమైనా.. సిగ్గు పడని పనులు చేస్తున్నారా ఏంటి రోజు?! బండభూ***తిట్టిన .పావలా గాడిని చేర్చుకోలే? మరి వాడికంటే..వీడెంతక్కువ? అన్ని ఆర్ధిక వ్యవహారాలే.. అన్ని అధికారం కోసమే.. గా తెలుగు D0 ng@l@ పార్టీ తాపత్రయం!

    3. నీ ఐటీడీపీ Kv తహ్! లే ర.Yerr! పూవ్

      ఇప్పుడేమైనా.. సిగ్గు పడని పనులు చేస్తున్నారా ఏంటి రోజు?!పావలా గాడిని చేర్చుకోలే? మరి వాడికంటే..వీడెంతక్కువ? అన్ని ఆర్ధిక వ్యవహారాలే.. అన్ని అధికారం కోసమే.. గా తెలుగు D0 ng@l@ పార్టీ తాపత్రయం!

    4. ఇప్పుడేమైనా.. సిగ్గు పడని పనులు చేస్తున్నారా ఏంటి రోజు?! పావలా గాడిని చేర్చుకోలే? మరి వాడికంటే..వీడెంతక్కువ? అన్ని ఆర్ధిక వ్యవహారాలే.. అన్ని అధికారం కోసమే.. గా తెలుగు D0 ng@l@ పార్టీ తాపత్రయం!

    5. ఇప్పుడేమైనా.. SiGGv పడని పనులు చేస్తున్నారా ఏంటి రోజు?! బండభూ***తిట్టిన .పావలా గాడిని చేర్చుకోలే? మరి వాడికంటే..వీడెంతక్కువ? అన్ని ఆర్ధిక వ్యవహారాలే.. అన్ని అధికారం కోసమే.. గా తెలుగు D0 ng@l@ పార్టీ తాపత్రయం!

  4. Nenu recent ga comment chesaga… Congress Kada Kiran Kumar Reddy ela workout chesukunmadon, ipudu VSR Kuda alaga… AP jateeya party Loki vasthadu… But no use in long-term.

  5. సన్యాసం అన్నపుడే మీకు అర్ధం అవ్వలేదు .. అయినా కాషాయ దారి అవుతాడు అని ..

  6. ఇదో క్రొత్తరకం ట్రెండ్ . గతంలో వదిలేశాక ఎప్పటికో నిర్ణయించుకొనేవారు. ఇప్పుడు నిర్ణయించుకున్నాకే వదిలేస్తున్నారు.

    1. నువ్వు అంటున్న హైనా ని అడ్డం పెట్టుకునే ఇన్ని రోజులు యాపారాలు చేసింది .. మర్చి పోయారా .. అంతే లే సొంత చెల్లిని తూలనాడగల మనం బయట వాళ్ళు ఎంత ..

Comments are closed.