అక్కడ టీడీపీ వర్సెస్ జనసేన

విశాఖ సౌత్ నియోజకవర్గంలోనూ అలాగే పరిస్థితి ఉందని అంటున్నారు. అక్కడ టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది.

కూటమిలో రెండు ప్రధాన పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఏపీ వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో సాగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో అదే తీరు ఉంది. విశాఖ సౌత్ నియోజకవర్గంలోనూ అలాగే పరిస్థితి ఉందని అంటున్నారు. అక్కడ టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఫలితంగా ఉత్తరాంధ్ర ఇలవేలుపు అయిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మ వారి మార్గశిర మాసోత్సవ వేడుకలకు సంబంధించి ఉత్సవ కమిటీని కూడా దేవాదాయ శాఖ వేయలేని స్థితి ఏర్పడింది అంటున్నారు.

ఈ ఇద్దరూ వైసీపీలోనే దాదాపుగా ఎన్నికల ముందు వరకూ ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరైన వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరి ఎమ్మెల్యే టికెట్ సంపాదించి శాసనసభ్యుడు అయ్యారు. రెండవవారు సీతంరాజు సుధాకర్. ఆయన టీడీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ కోరినా పొత్తుల కారణంగా కుదరలేదు.

పార్టీ ఆయనను సౌత్‌కు టీడీపీ ఇన్‌చార్జ్‌గా చేసింది. ఆయనకు ఇటీవల నామినేటెడ్ పదవి దక్కింది. దాంతో ఆయన తన అధికార హవా చూపిస్తున్నారు. అమ్మ వారి ఉత్సవాలకు సంబంధించి పేర్లను అన్నీ టీడీపీ వారితోనే నింపి ఆయన జాబితా ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఉన్న అధికారిక హోదాలో వంశీకృష్ణ మరో జాబితా ఇచ్చారు. దాంతో ఎవరిది ఓకే చేస్తే ఏమి వస్తుందో అని ఉత్సవ కమిటీనే వేయకుండా ఈసారి అమ్మవారి పండుగను జరిపిస్తున్నారు.

ఈ ఒక్క విషయమే కాదు, చాలా విషయాల్లో ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇన్‌చార్జ్ అన్నట్లుగా సౌత్ పాలిటిక్స్ సాగుతోంది. తమ మాటే నెగ్గాలని ఇద్దరూ పంతాలకు పోతున్న క్రమంలో అధికారులకు ఇబ్బందిగా ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీకి సీతంరాజు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే జనసేనను సౌత్‌లో స్ట్రాంగ్‌గా చేయాలని ఎమ్మెల్యే చూస్తున్నారు. దాంతో రాజకీయ లడాయి అలా సాగుతోంది.

13 Replies to “అక్కడ టీడీపీ వర్సెస్ జనసేన”

  1. ముసలి..ముఖ్యమంత్రికి..అర్థం..కానిది..ఏమిటంటే, వీని..పేపర్స్ ను..నెట్ వర్క్..ను..వాడుకొని..PK..జోకర్..వేషములో..చాప..కింద..నీరులా..ఎదుగుతున్నాడు. వెన్నుపోటు..పొడవడానికి..సిద్దము..అవుతున్నాడు, జగన్..వోట్..బ్యాంకు..షాలిడ్, భవిష్యత్తులో..నష్టపోయేది.. అసమర్దుడుగా..నిలిచిపోయిన..వీని..కొడుకు..మాత్రమే.త్వరలో..TDP..దివాళా..తీస్తుంది, PK..బీజేపీ..లో..చేరుతాడు, రాబోవు..కాలములో..YCP..BJP..మధ్యనే..పోటీ.

    1. హే.. నువ్వు షాలిడ్ అన్నావ్.. సాలిడ్ కాదు.. నిజమైన భక్తుడివి నువ్వు

    2. YCP.. ఏందీ ఇంకో కొత్త పార్టీ పెడుతున్నారా? ఆల్రెడీ ఒకటి మింగిడి bavishayttulo ఇంకోటి మింగుతాడా?

    1. వేడెవడో..గాని..కూకటపల్లిలో..తెగ..గిరాకీ..ఉన్నట్టు..వుంది, విపరీతంగా..పోస్ట్..చేస్తున్నాడు. అమరావతిలో..కూడా..ఒకటి..పెట్టుకో

  2. JSP ఎదిగితే నష్టపోయేది వైకాపా నే… తెదేపా వారిని కెలికితే ప్రపంచం నలుమూలలా ఉన్న వారి సామాజిక వర్గం ఎలా ఏకం అయింది మనం గత ఎన్నికల్లో చూశాం… ఆ ఫైర్ వైకాపా లో లేదు. వాడికి వీడికి పవన్ గారి నీ.. సిబియన్ గారి నీ విమర్శించిన వారికి జాకీలు వేసుకుంటూ… తృప్తి పడితే ఒరిగేది ఏమీ లేదు. తాత్కాలిక ఆనందం తప్ప. బీజేపీ వారి రాజకీయాలు చూస్తూనే ఉన్నాం… మనల్ని ఎలా పక్కన పెట్టేశారో అర్థం చేసుకుని… క్షేత్ర స్థాయిలో ప్రజా పోరాటాలు చేయండి.. ప్రభుత్వ తప్పులను ఎండగట్టండి. అప్పుడే మనుగడ… లేకపోతే 11 కూడా కష్టం.

  3. ఎం చేస్త్తామ్ బ్రదర్.. మాకు సరిఅయిన oppsition లేదు. సో.. కొన్ని ప్లేస్ లో మాకు మేమె oppsition ..

Comments are closed.