వైసీపీతో ధర్మాన… క్లారిటీ ఇచ్చేశారా?

సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫుల్ క్లారిటీ పార్టీ పెద్దలకు ఇచ్చేశారని అంటున్నారు.

సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫుల్ క్లారిటీ పార్టీ పెద్దలకు ఇచ్చేశారని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో జరిగిన శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతల సమావేశానికి ప్రసాదరావు హాజరు కాలేదు.

ఆయన సోదరుడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్, మరో మాజీ మంత్రి సీదరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు సర్పంచులు పార్టీ నేతలు అంతా హాజరైన ఈ ముఖ్యమైన సమావేశానికి ప్రసాదరావు డుమ్మా కొట్టడం ద్వారా తాను వైసీపీకి దూరం అన్న స్పష్టత ఇచ్చేశారు అని అంటున్నారు.

శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఇంచార్జి పదవిని ధర్మాన ప్రసాదరావుకే ఇవ్వాలని వైసీపీ చూస్తోంది. ధర్మాన ప్రసాదరావు మాత్రం వైసీపీలో ఉంటారా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇపుడు పార్టీ సమావేశం అని అధినాయకత్వం పిలిచినా ప్రసాదరావు రాలేదు అంటే ఆయన మీద ఆశలు వదులుకోవచ్చు అని అంటున్నారు.

అయితే వైసీపీ ధర్మాన ప్రసాదరావు తన నోటి వెంట ఆ మాట అంటే తాము వేరేగా నిర్ణయం తీసుకుందామని చూస్తోంది అని అంటున్నారు. అయితే పార్టీ తనను పక్కన పెడితే తాను ఇక స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోవచ్చు అన్నది ప్రసాదరావు మనోగతంలా ఉందని ప్రచారం సాగుతోంది.

ఇక్కడ విషయం క్లియర్ గానే ఉంది. ఎవరు ముందు డెసిషన్ తీసుకుంటారు అన్నదే సమస్య కానీ వైసీపీకి పెద్దాయన దూరం కావడం అన్న మ్యాటర్ లో మాత్రం రెండు వైపుల నుంచి క్లారిటీ ఉందని అంటున్నారు. జిల్లాల వారీగా పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని జగన్ దిశా నిర్దేశం చేసిన సందర్భంగా పార్టీలో అంతా చేయి కలిపి ముందుకు నడవాలని పిలుపు ఇచ్చారు.

11 Replies to “వైసీపీతో ధర్మాన… క్లారిటీ ఇచ్చేశారా?”

Comments are closed.