సమంత కంటే శోభితానే టాప్

సమంతాకు 8వ స్థానం దక్కగా, శోభిత ఏకంగా ఐదో స్థానం దక్కించుకుంది.

ఎప్పుడైతే నాగచైతన్యతో డేటింగ్ అంటూ పుకార్లు మొదలయ్యాయో అప్పట్నుంచే టాలీవుడ్ లో శోభిత పేరు ఎక్కువగా వినిపించడం మొదలైంది. ఇక నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆమె గురించి ఇంటర్నెట్ లో వెదకడం మరింత ఎక్కువైంది. తాజాగా చైతూ-శోభిత పెళ్లి చేసుకోవడంతో ఆమె పేరు మరోసారి మార్మోగిపోయింది.

ఇలా ఎన్నో సందర్భాల్లో శోభిత ట్రెండింగ్ లోకి రావడంతో.. ఐఎండీబీ లిస్ట్ లో ఆమె సమంతను వెనక్కు నెట్టింది. 2024 సంవత్సరానికి గాను మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ జాబితాను విడుదల చేసింది ఐఎండీబీ.

ఇందులో సమంతాకు 8వ స్థానం దక్కగా, శోభిత ఏకంగా ఐదో స్థానం దక్కించుకుంది. 2023లో ఇదే జాబితాలో 8వ స్థానంలో ఉన్న శోభిత, ఈ ఏడాది ఐదో స్థానానికి ఎగబాకింది.

సమంతకు 2023 జాబితాలో చోటు దక్కలేదు. ఈ ఏడాది సిటాడెల్-హనీబన్నీ కారణంగా ఆమె మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాలోకి చేరింది.

ఇక గతేడాది లిస్ట్ లో నంబర్ వన్ స్థానం దక్కించుకున్న షారూక్ ఖాన్, ఈ ఏడాది నాలుగో స్థానానికి పడిపోయాడు. బాలీవుడ్ తాజా సెన్సేషన్, ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రి టాప్ పొజిషన్ దక్కించుకుంది.

టాప్-10 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్ (2024-IMDB)

1. త్రిప్తి దిమ్రి
2. దీపిక పదుకోన్
3. ఇషాన్ కట్టర్
4. షారూక్ ఖాన్
5. శోభిత ధూలిపాళ
6. శర్వారీ
7. ఐశ్వర్య రాయ్
8. సమంత
9. అలియా భట్
10. ప్రభాస్

15 Replies to “సమంత కంటే శోభితానే టాప్”

    1. సినిమా లో ఛాన్స్ ఇవ్వకపోతే బయట విప్పేస్తుంది.. నష్టం లేదు.. వాళ్ళు ఉన్నదే ఆ వృత్తి లో.. తప్పు లేదు…

Comments are closed.