దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణ స్వీకారానికి ప‌వ‌న్ గైర్హాజ‌రు!

మ‌హారాష్ట్ర‌లో ఎన్డీఏ కూట‌మి అధికారాన్ని నిలుపుకున్న‌ప్ప‌టికీ, సీఎం ఎన్నిక విష‌యంలో స‌స్పెన్స్‌కు తెర‌లేచింది.

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. చ‌ర్చోప‌చ‌ర్చ‌ల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు ఫ‌డ్న‌వీస్ సీఎం అయ్యేందుకు మిత్ర‌ప‌క్షాల నాయ‌కులు అంగీక‌రించారు. మ‌హారాష్ట్ర‌లో ఎన్డీఏ కూట‌మి అధికారాన్ని నిలుపుకున్న‌ప్ప‌టికీ, సీఎం ఎన్నిక విష‌యంలో స‌స్పెన్స్‌కు తెర‌లేచింది.

శివ‌సేన నాయ‌కుడు ఏక్‌నాథ్‌శిండే కూడా మ‌రోసారి సీఎంగా కొన‌సాగాల‌నే ఆస‌క్తిని వ్య‌క్తం చేయ‌డంతో స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైంది. అయితే బీజేపీ అగ్ర‌నేత‌లు అతిక‌ష్ట‌మ్మీద ఫ‌డ్న‌వీస్‌ను సీఎం చేసేందుకు అంద‌ర్నీ ఒప్పించారు. ఈ నేప‌థ్యంలో కూట‌మిలోని భాగ‌స్వామ్య ప‌క్షాల నాయ‌కుల్ని ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు ఒక్క‌రే వెళ్తున్నారు.

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెళ్ల‌డం లేదు. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. అస‌లు మ‌హారాష్ట్ర‌లో మ‌ళ్లీ ఎన్డీఏ అధికారంలోకి రావ‌డానికి ప‌వ‌నే కార‌ణ‌మ‌న్న రేంజ్‌లో జ‌న‌సేన ప్ర‌చారం చేసిన సంగతి తెలిసిందే. అందుకే మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వం కొలువుదీరే స‌మ‌యంలో ప‌వ‌న్ వెళ్ల‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణ స్వీకారానికి వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణాన్ని ప‌వ‌న్ తెలిపారు. సింగ‌పూర్‌లో చ‌దువుకుంటున్న త‌న కుమారుడి విద్యా సంస్థ‌లో జ‌రిగే కార్య‌క్ర‌మానికి తాను హాజ‌రు కావాల్సి వుంద‌ని, అందువ‌ల్లే ముంబ‌యికి రాలేక‌పోతున్న‌ట్టు తెలిపారు. ఇదే సంద‌ర్భంలో కాబోయే సీఎం ఫ‌డ్న‌వీస్‌కు ప‌వ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఫ‌డ్న‌వీస్ నాయ‌క‌త్వంలో మ‌హారాష్ట్ర అభివృద్ధి ప‌థాన న‌డుస్తుంద‌నే ఆశాభావాల‌న్ని ప‌వ‌న్ వ్య‌క్తం చేశారు.

22 Replies to “దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణ స్వీకారానికి ప‌వ‌న్ గైర్హాజ‌రు!”

Comments are closed.