సమంతాకు ఆ సమస్య కూడా ఉండేదంట?

ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు ఫోన్లు చేసి డబ్బులు కావాలంటే ఎవ్వరూ ఇవ్వలేదు. అప్పుడు నేనే 25 లక్షలు సర్దుబాటు చేశాను. 3-4 నెలల్లో ఆ చర్మ సమస్య నుంచి ఆమె కోలుకుంది.

సమంత ఆరోగ్య సమస్యల గురించి అందరికీ తెలిసిందే. తను మయొసైటిస్ బారిన పడినట్టు ఆమె స్వయంగా గతంలో వెల్లడించింది. ఆ తర్వాతా ఆ వ్యాధి వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్టుల నుంచి కూడా ఆమె ఇబ్బంది పడింది.

అయితే సమంతాకు పదేళ్ల కిందటే చాలా పెద్ద ఆరోగ్య సమస్య వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ బయటపెట్టారు. ఆ టైమ్ లో తనే సమంతాను ఆదుకున్నానని గుర్తుచేసుకున్నారు.

“అల్లుడు శీను సినిమా టైమ్ లోనే సమంతాకు చాలా పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. అప్పట్లో సమంతాకు ఓ చర్మ సమస్య బయటపడింది.. అప్పుడు నేను హెల్ప్ చేశాను. బయట ఉంటే ఇబ్బంది అని భావించి, ఆమె కోసం స్టార్ హోటల్ లో రూమ్ తీసి అక్కడుంచాను. ఆ టైమ్ లో సమంతాకు డబ్బులు చాలా అవసరం. ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు ఫోన్లు చేసి డబ్బులు కావాలంటే ఎవ్వరూ ఇవ్వలేదు. అప్పుడు నేనే 25 లక్షలు సర్దుబాటు చేశాను. 3-4 నెలల్లో ఆ చర్మ సమస్య నుంచి ఆమె కోలుకుంది.”

ఇలా సమంత ఎదుర్కొన్న చర్మ సమస్యను బయటపెట్టారు నిర్మాత బెల్లంకొండ. తను చేసిన సహాయాన్ని సమంత ఎప్పుడూ మరిచిపోలేదని, ఆ కృతజ్ఞత ఆమెకు ఎప్పుడూ ఉందంటున్నారాయన. అప్పటికీ ఇప్పటికీ సమంత తమ కుటుంబ సభ్యురాలని చెబుతున్నారు.

అప్పటికే బృందావనం, దూకుడు, ఈగ లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఊపుమీదుంది సమంత. ఆమెను ఎలాగైనా తన కొడుకు డెబ్యూ మూవీలో తీసుకోవాలని బెల్లంకొండ భావించారు. అప్పటివరకు ఏ నిర్మాత ఆఫర్ చేయనంత ఎమౌంట్ ను కోట్ చేసి సమంతను తన ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు. సమంతకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇచ్చిన పాతిక లక్షల్ని కూడా ఆ తర్వాత రెమ్యూనరేషన్ లో భాగంగా సర్దుబాటు చేసుకున్నానని క్లారిటీ ఇచ్చారు.

11 Replies to “సమంతాకు ఆ సమస్య కూడా ఉండేదంట?”

      1. ఎవరికీ, ఎందుకు? ఆమె స్వయంగా చెప్తే తప్పులేనిది, ఆ విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావిస్తే తప్పు వచ్చిందా?

  1. చైతూ అనవసరంగా సినిమా రంగానికి చెందిన వ్యక్తి ని పెళ్లి చేసుకున్నాడు. వారు ఒక చోట కుదురుగా ఉండలేరు.

    సినిమా లలో జరిగిన విధంగా ఉండాలని అనుకుంటారు

Comments are closed.